Current Affairs – Telugu – August 11 – 14 – 2019

☛ మోదీ సాహసయాత్ర – డిస్కవరీలో ప్రసారం ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టిన సాహసయాత్ర ఆగస్టు 12న డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్రను చిత్రీకరించారు. ఈ యాత్ర లో బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు వైల్డ్ లైఫ్ థీమ్ అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభు త్వం చేపట్టిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ’ కార్యక్రమానికి ‘వైల్డ్ లైఫ్’ను ఇతివృత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ ఆగస్టు…

Read More

Current Affairs – Telugu – August 10, 2019

☛ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 34:66 నిష్పత్తిలో కృష్ణా నీటి పంపకం కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించాయి. 2019-20 వాటర్‌ ఇయర్‌లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. హైదరాబాద్ లోని జలసౌధలో ఆగస్టు 9న సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు… ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి. కృష్ణా బోర్డు చైర్మన్‌ – ఆర్‌కే గుప్తా ☛ తెలంగాణ, ఏపీలో ఎక్కడి నుంచైనా రేషన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక నుంచి రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ తీసుకునే…

Read More

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. 2018లో విడుదలైన చిత్రాలను పరిశీలించి వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఏటా ఏప్రిల్ లో ప్రకటించించే ఈ అవార్డులను ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసి.. ఆగస్టులో విజేతల జాబితా విడుదల చేశారు. అవార్డు విజేతలు జాబితా ఉత్తమ నటుడు : ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి) ఉత్తమ నటి : కీర్తి సురేశ్‌ (మహానటి) ఉత్తమ దర్శకుడు : ఆదిత్య ధర్‌(ఉరి) బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ :మహానటి బెస్ట్‌ మేకప్, విజువల్‌ ఎఫెక్ట్‌ : అ! ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే : చి.ల.సౌ ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం ఉత్తమ తమిళ చిత్రం : బారమ్‌ ఉత్తమ కన్నడ సినిమా : నాతిచరామి ఉత్తమ యాక్షన్‌ సినిమా…

Read More

Current Affairs – Telugu – August 9, 2019

☛ పార్లమెంటులో 32 బిల్లులకు ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. జూన్ 17 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఈ సమావేశాల్లో లోక్‌సభ 35 బిల్లులకు ఆమోదం తెలపగా… రాజ్యసభ 32 బిల్లులను ఆమోదించింది. ☛ యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా గోసంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను ఎంపిక చేసిన రైతులకు, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ…

Read More

Current Affairs – Telugu – August 8, 2019

☛ వరుసగా నాలుగోసారి రెపో రేటు తగ్గింపు వృద్ధి మందగమనానికి విరుగుడుగా ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో మరో 0.35 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 5.15 శాతానికి చేరాయి. రెపో రేటును తగ్గించడం వరుసగా ఇది నాలుగోసారి. మొత్తం 1.1 శాతం తగ్గించింది. ఫలితంగా రెపో తొమ్మిదేళ్ల కనిష్ఠ (2010 ఏప్రిల్‌ నాటి) స్థాయికి తగ్గింది. సాధారణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం చొప్పున పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా 35 బేసిస్‌ పాయింట్లు (0.35 శాతం) తగ్గించడం గమనార్హం. ఆర్‌బీఐ భవిష్యత్‌లో తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయంపై ‘వెసులుబాటు’ వైఖరినే కొనసాగించింది. మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు…

Read More

Current Affairs – Telugu – August 7, 2019

☛ 370 రద్దు తీర్మానం, పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును ఆగస్టు 6న లోక్ సభ ఆమోదం పొందింది. కాగా, తీర్మానం, బిల్లు రాజ్యసభలో సోమవారమే పాస్‌ అవ్వడంతో వీటికి సోమవారం పార్లమెంటు ఆమోదం లభించనట్లైంది. చర్చ అనంతరం తీర్మానం ఆమోదంపై ఓటింగ్‌ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టి, లదాఖ్‌ను అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు తీసుకొచ్చిన ‘జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’పై కూడా ఓటింగ్‌ నిర్వహించగా,…

Read More

Current Affairs – Telugu – August 6, 2019

☛ దేశంలో అతిపెద్ద యూటీగా జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రాల విభజన తర్వాత దేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా జమ్మూకశ్మీర్ అవతరించనుంది. జమ్మూకశ్మీర్ తర్వాత లదాఖ్ రెండో స్థానంలో ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు. దీంతో దేశంలో యూటీల సంఖ్య తొమ్మిదికి పెరగనుంది. అదే సమయంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గనుంది. ☛ పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక అధికారి పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్, 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌ను…

Read More

Current Affairs – Telugu – August 4- 5, 2019

☛ జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు – రాష్ట్ర విభజన జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆర్టికల్ 370 రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఆయన ప్రకటించారు. వెనువెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి సర్వాధికారాలు లభించాయి. జమ్ము కశ్మీర్ విభజన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జమ్ము కశ్మీర్ ని.. జమ్ము అండ్ కశ్మీర్ మరియు లదాఖ్ లుగా విభజిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన…

Read More

Current Affairs – Telugu – August 3, 2019

☛ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి చైనా వ్యోమనౌక చైనాకు చెందిన లాంగ్‌జియాంగ్-2 వ్యోమనౌక తన ప్రస్థానాన్ని ముగించుకొని ఆగస్టు 2న చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టి, అంతమైంది. నిర్దేశించిన రీతిలో చంద్రుని అవతి భాగాన్ని వ్యోమనౌక తాకిందని చైనా అంతరిక్ష సంస్థ వివరించింది. 47 కిలోల బరువున్న లాంగ్‌జియాంగ్-2ను 2018, మే 21న ప్రయోగించారు. ఇది 437 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది. ఈ వ్యోమనౌకలో సౌదీ అరేబియా అభివృద్ధి చేసిన ఒక ఆప్టికల్ కెమెరాను కూడా ఉంది. ☛ అయోధ్య మధ్యవర్తిత్వం విఫలం అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదా కేసులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది. ఈ మేరకు ఆగస్టు 2న సుప్రీంకోర్టుకు కమిటీ తన నివేదికను సమర్పించింది. క్లిష్టమైన అయోధ్య సమస్యకు…

Read More

Current Affairs – Telugu – August 2, 2019

☛ పేపర్ లెస్ గా మారనున్న లోక్‌సభ లోక్‌సభ తదుపరి సమావేశాలన్నీ కాగితరహితంగానే జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 31న తెలిపారు. దీని వల్ల కోట్ల రూపాయలు మిగులుతాయన్నారు. అవసరం అనుకున్న వారికి విడిగా పేపర్లు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ్యులు మాట్లాడే సమయంలో వారి పేర్లు, డివిజన్ నంబర్ కనిపించేలా కొత్తగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ☛ పోక్సో సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019’ని పార్లమెంటు ఆగస్టు 1న ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ జూలై 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు ఆగస్టు 1న ఆమోదం పొందింది. కొత్త సవరణల ప్రకారం…. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించవచ్చు. ‘చిన్నారులతో నీలి…

Read More