ఇండియన్ నేవీలో 500 నావికుల రిక్రూట్ మెంట్

భారత నౌకాదళంలో (Indian Navy) 500 నావికుల (Artificer Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 ఆగస్టు నుంచి మొదలయ్యే బ్యాచ్ కోసం ఈ మేరకు ఎంపిక చేయనుంది. పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

విద్యార్హతలు (Educational Qualification) : 10 + 2 ఉత్తీర్ణత. మేథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ లలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. సంబంధిత కోర్సుల్లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించన వారే ఈ పోస్టులకు అర్హులు.

వయసు (Age) : అభ్యర్థులు 01 ఆగస్టు 1999 – 31 జూలై 2002 మధ్య జన్మించిన వారై ఉండాలి.

స్టైపెండ్ : అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో రూ.14,000 వేల స్టైపెండ్ అందుతుంది. ట్రైనింగ్ దాదాపు 3 ఏళ్లు ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారు ఇండియన్ నేవీలో రెగ్యూలర్ పోస్టు పొందుతారు.

పరీక్ష ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 205. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

ముఖ్య తేదీలు : ఆన్ లైన్ దరఖాస్తులు డిసెంబర్ 14, 2018 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 30, 2018.

వెబ్ సైట్ : www.joinindiannavy.gov.in

మరిన్ని వివరాలకు

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10701_33_1819b.pdf

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments