ఆస్ట్రేలియాలో ఆడతాం.. కానీ .. !!

కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాడిన పడుతున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా షురూ అయింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సీరీస్ స్టేడియంలో అభిమానులకు అనుమతి లేకుండానే ప్రారంభమైంది. దీంతోభారత్ మ్యాచ్ లు ఎప్పుడు మొదలవుతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో… 2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ విషయంలో బీసీసీఐ చిన్న మార్పు కోరుతోంది. క్రికెట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే భారత్ జట్టు క్వారంటైన్ రోజులని 14 రోజులు కాకుండా తక్కువకు కుదించాలని సౌరవ్ కోరారు. క్రికెట్ కోసం అంత దూరం వెళ్లిన ప్లేయర్లను రెండు వారాల పాటు ఆటకు దూరంగా హోటల్ గదుల్లో ఉంచడం ప్రతికూల ప్రభావం చూపుతుందని సౌరవ్ అభిప్రాయపడ్డారు. అది ప్లేయర్లను నిరుత్సాహానికి గురిచేస్తుందని, వారి మానసిక ధృడత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని అన్నారు. అందుకేక్వారంటైన్ రోజులని తగ్గించాల్సిందిగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుని కోరామని గంగూలీ చెప్పారు.

West indies Vs England Match
                               West indies Vs England Match

ఇంగ్లండ్ తో సీరీస్ కోసం జూన్ 9న ఆ దేశం వెళ్లిన వెస్టిండీస్ జట్టు.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంది. అది పూర్తయిన తర్వాతే జూలై 8న ఫస్ట్ టెస్ట్ మొదలైంది. ప్లేయర్లలో ఒక్కరికీ ఇన్ఫెక్షన్ సోకినా.. అది మొత్తం రెండు జట్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు కూడా తప్పనిసరిగా కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే. ఇంతకముందు 2018 -19 లో ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీ సేన.. టెస్ట్ సీరీస్ ని 2-1తో గెలుచుకుంది. 71 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ కు ఇది తొలి టెస్ట్ సీరీస్ విజయం.

కరోనా వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్న పరిస్థితిలో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ విషయంలో కొంచెం మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. న్యూజిలాండ్ వైరస్ ను పూర్తిగా నియంత్రించింది. ఆస్ట్రేలియాలో ఒక మెల్ బోర్న్ మినహా మిగతా నగరాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. జూలై 10 నాటికి ఆ దేశంలో 9 వేల కరోనా కేసులు నమోదుకాగా.. 106 మంది మరణించారు. మరోవైపుఐపీఎల్ లేకుండానే 2020 సంవత్సరాన్ని ముగించమని సౌరవ్ మరోసారి స్పష్టం చేశారు. అంటేభారత్ లో సాధ్యం కాకపోతే.. న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఐపీఎల్ ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments