IBA చైర్మన్‌గా సునీల్ మెహతా

2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు. ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు. మాదిరి ప్రశ్న 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ? సునీల్ మోహతా రజనీష్ కుమార్ దీనబంధు మొహపాత్ర శ్యామ్ శ్రీనివాసన్ జవాబు: సునీల్ మోహతా

Read More