కశ్మీర్ కల్లోలం.. ! కారణం, కారకులెవరు ? వికాసం విశ్లేషణ

జమ్ము కశ్మీర్.. ! భారత్ లో ప్రకృతి అందాల పరంగా భూతల స్వర్గం. శాంతి, భద్రత పరంగా చూస్తే మాత్రం నిత్యం రగులుతున్న కాష్టం. పాకిస్తాన్ సైన్యం ఓ వైపు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మరోవైపు బరితెగించి జమ్ము కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. 1947లో మొదలైన ఈ విధ్వంసం… నేటికీ కొనసాగతోంది. కశ్మీర్ ప్రజలను నిత్యం అశాంతిలో, ఆందోళనలో, ఆవేదనలో బతుకులీడ్చేలా చేస్తోంది. ఈ మారణకాండలో వేలాది సైనికులు, సామాన్యులు సమిధలయ్యారు. భారత సైన్యం కంటిమీద కునుకులేకుండా జల్లెడపడుతూ తీవ్రవాదులను ఏరివేస్తున్నా… సరిహద్దులో గుంట నక్కలా కాచుకోని కూర్చున్న పాకిస్తాన్ కశ్మీర్ లో యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తు భారత్ పైకి ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తోడ్పాటుతో జై షే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడుగట్టిన…

Read More

Daily Current Affairs–MCQs-September 14, 15 – 2018

మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 130వ స్థానం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల ర్యాంకింగ్స్ తో యూఎస్ డీపీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నార్వే, 2వ స్థానంలో స్విట్జర్లాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో ఐర్లాండ్, 5వ స్థానంలో జర్మనీ నిలిచాయి. తాజా ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 136వ స్థానంలో, పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచాయి. 2017 ర్యాంకింగ్స్ లో భారత్ కు 131వ స్థానం దక్కింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నంబర్ – 1 హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విమాన సేవల నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో…

Read More

Daily Current Affairs–MCQs-September 7, 2018

తెలంగాణ శాసనసభ రద్దు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే…

Read More

ఇండస్ వాటర్ ఒడంబడికి – భారత్, పాక్ మధ్య అవగాహన

ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము  అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల  అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పీఎంఎల్ – ఎన్ పార్టీ అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జరిగిన చర్చల్లో ఈ అవగాహన కుదిరింది. అలాగే శాశ్వత ఇండస్…

Read More