Daily Current Affairs–MCQs-September 2, 2018

ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి…

Read More

IBA చైర్మన్‌గా సునీల్ మెహతా

2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు. ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు. మాదిరి ప్రశ్న 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ? సునీల్ మోహతా రజనీష్ కుమార్ దీనబంధు మొహపాత్ర శ్యామ్ శ్రీనివాసన్ జవాబు: సునీల్ మోహతా

Read More