గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. గాల్లోనే ప్రయాణిస్తూనే IAF IL 78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఘనత సాధించింది. దీంతో.. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపకలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. 123 తేజస్ మార్క్ – 1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన 2017 డిసెంబర్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు రూ.50,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులకు…
Read More