ఎగ్జిట్ పోల్స్ ను ఇలా లెక్కిస్తారు.. !

వికాసం : ఎన్నికల్లో కీలకంపోలింగ్. ఈ తంతు ముగిశాక అన్ని పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్న వారు ఆతృతగా ఎదురు చూసేది ఎగ్జిట్ పోల్స్ కోసమే. ప్రైవేట్ సంస్థలు, పత్రికలు, టీవీ ఛానళ్ల కోసం పనిచేసే సర్వే సంస్థలుఎగ్టిట్ పోల్స్ ను చేపడతాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరిస్తూ విడుదల చేసే గణాంకాలు.. వాస్తవ ఫలితాలకు ముందస్తు అంచనా మాత్రమే. కాకపోతే.. అవి చాలా దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది కూడా. నాణేనికి రెండో వైపు అన్నట్లుఎగ్జిట్ పోల్స్ తుది అంచనాలకు భిన్నంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఇలా

ఓటింగ్ జరిగిన రోజుఆయా సర్వే సంస్థల ప్రతినిధులు కొన్ని పోలింగ్ స్టేషన్లకు వెళతారు. అక్కడ ఓటు వేసిన వారిని ఎవరికి వేశారు ? ఎందుకు వేశారు ? అని అడిగి వారి నుంచి వివరాలు సేకరిస్తారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. వారంతా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. కనీసం ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల సాంపిల్స్ తీసుకుంటారు. తద్వారా సాయంత్రానికి మొత్తం నియోజవర్గాల్లో ఓటింగ్ సరళి, ఓటర్ మనోగతాన్ని క్రీడీకరించి…. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు. ఇదే ఎగ్జిట్ పోల్.

ఒపీనియన్ పోల్ అంటే

పోలింగ్ కి ముందు చేపట్టేది ఒపీనియన్ పోల్. ఇందులో ఓటర్లు ఎవరికి ఓటు వేయబోతున్నారో అడిగి తెలుసుకుంటారు. సాధారణంగా ఒపీనియన్ పోల్ నెల రోజులు, 15 రోజులు, 2 నెలలుఇలా ఎప్పుడైనా చేపడతారు. ఒపీనియన్ పోల్ ని రాజకీయ పార్టీలు కూడా నిర్వహిస్తాయి. నియోజవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నాయకుల పట్ల ప్రజల ఆలోచన తదితర వివరాలను సేకరిస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి సర్వేలను ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. పత్రికలు, టీవీ చానళ్లు కూడా ఒపీనియన్ పోల్ చేపడతాయి.

అంచనాలు ఎంత వరకు నిజం అంటే… ?

ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో వాస్తవాన్ని తెలియజేస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. దేశవ్యాప్తంగా గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితాలను ప్రతిబింబించాయి. ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. ఫలితాలకు ముందేచాలా సంస్థలు.. కర్ణాటకలో హంగ్ ఏర్పడనుందని అంచనా వేశాయి. కౌంటింగ్ రోజు.. మధ్యాహ్నానికే అది నిజమైంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి పూర్తి మెజారిటీ రాలేదు. ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ తో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లోను దాదాపు అన్ని సంస్థలు.. బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. Todays Chanakya సంస్థ ఏకంగా బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. ఫలితాల్లో అదే నిజమైంది కూడా.

భిన్నఫలితాలు ఉన్నాయి..

Bihar Exit Poll – 2015

అంచనాలు ఎప్పుడు అంచనాలే. అవి అన్ని సందర్భాల్లో నిజమవ్వాలని లేదు. ఎగ్టిట్ పోల్స్ పలు సందర్భాల్లో వాస్తవ ప్రజానాడిని పట్టడంలో విఫలమైన సందర్భాలు ఉన్నాయి. బిహార్, ఢిల్లీ 2015 అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు మంచి ఉదాహరణ. బిహార్ ఎన్నికల్లో ఓటర్ల మూడ్ ని పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. అత్యధిక సంస్థలు బిహార్ లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ అందుకు విరుద్ధంగా.. జేడీయూ, కాంగ్రెస్ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

Delhi Exit Poll – 2015

ఇకఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. కానీ.. బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితం అవుతుందని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోను ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. అందుకేగతంలోలా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ని చూసి తుది ఫలితాలపై ఆశలు వదులుకోవడం లేదు. ఈ లెక్కల్లో పై చేయి సాధించిన పార్టీని కూడాఏదో ఒక మూల గత అనుభవాలు వెంటాడుతుంటాయి.

తెలంగాణ తీర్పు ఎటువైపు… ?

ఈ నేపథ్యంలోతెలంగాణ శాసనసభ ఎన్నికల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్క లగడపాటి సర్వే తప్ప దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలంగాణ మరోసారి టీఆర్ఎస్ దే అని తేల్చేశాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ డిసెంబర్ 11న వాస్తవాన్ని అందుకుంటాయా లేక లగడపాటి జోష్యం నిజం అవుతుందా అన్నది చూడాలి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments