సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్.. వాళ్లు ఒప్పుకుంటేనే ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల అభివృద్ధి పర్యటనల్లో వరాలు జాలువారుతాయి. జిల్లా మంత్రులు అడిగినవే కాకుండా అడగనివి కూడా మంజూరు చేస్తారు. గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనల మాదిరిగానే డిసెంబర్ 10న కేసీఆర్ సిద్ధిపేట పర్యటన సాగింది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధిపేట జిల్లాను బొడ్రాయిగా అభివర్ణించిన సీఎం.. హరీశ్ అడ్డాకి అనేక వరాలు ప్రకటించి వెళ్లారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తా అన్న వాగ్దానం.. చాలా మందిలో సాధ్యమేనా అనే సందేహాలు రేకెత్తించింది. ఎందుకంటే.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కే ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సిద్ధిపేట పేరు తెరపైకి వచ్చి చేరింది. మరి వరంగల్, సిద్ధిపేట… ఈ రెండింట్లో దేనికి ముందుగా ఎయిర్ పోర్ట్ వస్తుంది ?? GMR ఒప్పుకుంటేనే .. !! తెలంగాణలో నిర్వహణలో…

Read More

కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ బాహుబలి పరిస్థితేంటి..?

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు–నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న చిన్న కుర్రాడ్ని అడిగినా తడుముకోకుండా చెప్పగలరు. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు…

Read More

కారుకి పాలమూరు ఓట్లాభిషేకం వయా… హరీశ్ !

వికాసం: మహబూబ్ నగర్…! తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న జిల్లా. పక్కనే కృష్ణా నది ఉన్నా.. కరువు, వలసలతో గోస పడే ప్రాంతం. ఇలాంటి చోట ప్రజల అంచనాలను అందుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము వంటిదే. ఈ సవాల్ ని బాధ్యతలా స్వీకరించిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించి ఓట్ల రూపంలో దీవెనలను తిరిగి పొందింది. ఎన్నికలకు ముందు… చాలా మంది విశ్లేషిస్తూ… “మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు కష్టమే రా భయ్. ఒక్కో జిల్లాలో రెండు, మూడు సీట్లు గెలవడం కూడా కష్టమే” అన్నారు. మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు కూడా ఇదే విశ్లేషణ చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాల్లో 13 సీట్లను…

Read More