Explore Telangana : నల్గొండ “గురిజాల”లో చాళక్యుల చారిత్రక సంపద

ఈ ఆర్టికల్ రాసినవారు చరిత్రకారులు, ఆలేరు శ్రీరామరాజు హరగోపాల్ – శ్రీరామరాజు హరగోపాల్ ☛ స్టోరీ కింద ఫోటోలు ఉన్నాయి… నల్గొండ జిల్లాలోని గురిజాల శాలిగౌరారం మండలంలోని చిన్న గ్రామం.ఎన్నాళ్ళగానో తమవూరు గురిజాలకు రమ్మని పిలుస్తున్న నవీన్ భట్టుతో నేను, మా చంటి, రాగిమురళి కలిసి (12.12.18)న గురిజాల గ్రామానికి వెళ్ళాం. మాకక్కడ ఆ గుడిలో ఎపుడుండే మల్లయ్య, మజార్, ఇంకా ఇద్దరు పిల్లలు మా పనిలో బాగా సహకరించారు. అద్భుతమైన దేవాలయ ప్రాంగణం. అందమైన, అపూర్వమైన శిల్పాలు చరిత్రకు తార్కాణాలుగా నిలిచివున్నాయి. ☛ గురిజాల మూసీనది ఒడ్డున వున్న ఒక పురాతన గ్రామం. పాత గురిజాల నది వరదలో మునిగిపోతే కొత్త గురిజాల మిట్టన కట్టబడింది. పాతగురిజాల పాటిగడ్డలో ఆలయాల ప్రాంగణం వుంది. అందులో ఇపుడు బాగున్నది ఒక శివాలయమే. ఆ శివాలయంలో 14 స్తంభాల…

Read More