బల్దియా పోరుకి సై .. డిసెంబర్ 1న పోలింగ్ !!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో బల్దియా పోరు రసవత్తరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పునకు నాందిగా భావిస్తున్న గ్రేటర్ ఫైట్ కు డేట్స్ లాక్ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి నవంబర్ 17న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి వార్డు రిజర్వేషన్ల పునర్వస్థీకరణ లేదని.. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఉన్న ఓటర్ల జాబితాతో నవంబర్ 16 కటాఫ్ తేదీతో తుది ఓటర్లను ప్రకటించామని వెల్లడించారు. గతానికి భిన్నంగా ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ సారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది.

ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ విడుదల నవంబర్ 17

నామినేషన్లు ప్రారంభం నవంబర్ 18

నామినేషన్ కు చివరి రోజు నవంబర్ 20

నామినేషన్ల పరిశీలన నవంబర్ 21

నామినేషన్ల ఉపసంహరణనవంబర్ 22

పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన – నవంబర్ 22

పోలింగ్ తేదీ డిసెంబర్ 1

కౌంటింగ్ ఫలితాల వెల్లడి డిసెంబర్ 4

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments