20 రోజుల పాటు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అనుకునే వారు, వినూత్న ఆవిష్కర్తలను కలిసి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ యాత్ర సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 వరకు 20 రోజుల పాటు జరిగే ఈ యాత్రను రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో 20 మందిని ఎంపిక చేస్తారు. 12 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. నీల్ బసుకి ఆసియాన్ అచీవర్స్ అవార్డు బ్రిటన్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు .. ప్రతిష్టాత్మక ఆసియన్ అచీవర్స్ అవార్దుకు ఎంపికయ్యారు. ఆసియాన్ బిజినెస్…
Read More