Daily Current Affairs – October 12 – 2018

☛ “తిత్లీ” తుపాను బీభత్సం.. శ్రీకాకుళం అతలాకుతలం తిత్లీ తుపాన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను అక్టోబర్ 11న ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం బలహీనపడింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంపై తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 2 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. తుపాన వల్ల మొత్తంగా రూ.1,500 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా. ☛ ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్..…

Read More

Daily Current Affairs – October 10, 11 – 2018

☛ 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనా వేసింది. 2019-20లో 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 9న ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2018-19లో భారత్ ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను దక్కించుకుంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటును 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది. ☛ సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్…

Read More

Daily Current Affairs – October 08, 09 – 2018

☛ జపాన్ గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్ జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేతగా మెర్సడిసీ జట్టు జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. అక్టోబర్ 7న జరిగిన 53 ల్యాప్ ల రేసుని గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేసి తొలిస్థానంలో నిలిచాడు. తద్వారా 2018 ఫార్ములా వన్‌ సీజన్ లో హామిల్టన్ 9వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు. ☛ 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 7న ఓ నివేదికను విడుదల చేసింది. 2019-20,…

Read More

Daily Current Affairs – October 06, 07 – 2018

☛ ఎస్ – 400 పై రష్యాతో భారత్ ఒప్పందం ఎస్ – 400 ట్రయంఫ్ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి భారత్ రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువుల తదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. 2022 నాటికి భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఇస్రో.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ…

Read More

Daily Current Affairs – October 04, 05 – 2018

☛ భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయ్ భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రంజన్ గోగోయ్ సీజేఐ గా 13 నెలలపాటు అంటే.. 2019 నవంబర్ 17 వరకు ఉంటారు. ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన మొదటి వ్యక్తి.. జస్టిస్ రంజన్ గోగోయ్. 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్ లో రంజన్ గోగోయ్ జన్మించారు. 1978లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2001లో గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 45వ సీజేఐ దీపక్…

Read More