RRB లో NTPC, గ్రూప్ D, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం రాత పరీక్షలను డిసెంబర్ 15 నుంచి నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. షిఫ్ట్ ల ప్రకారం పరీక్షలు జరుపుతామని తెలిపింది. మినిస్టీరియల్ అండ్ ఐసోలెటెడ్ కేటగిరీల్లో 1,663 పోస్టుల కోసం డిసెంబర్ 15 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. NTPC, గ్రూప్ D పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. కోవిడ్ పరిస్థితుల వల్ల అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్లు పంపించడం జరగదని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాలి. దక్షిణమధ్య రైల్వేలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://www.rrbsecunderabad.nic.in/ ద్వారా…
Read MoreCategory: విద్య
Education News, Current Affairs
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ కు 2,73,588 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,32,811 మంది పరీక్షకు హాజరు కాగా.. 2,02,682 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతశాతం 87.05 శాతంగా నమోదైంది. ఇంజనీరింగ్ విభాగంలో 1,56,953 మందిలో 1,33,066 (84.78 శాతం), అగ్రి మెడికల్‌లో 75,858లో 69,616 (91.77 శాతం) క్వాలిఫై అయ్యారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఎంసెట్‌ను సెప్టెంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈసారి రెండోసారి ఎంసెట్ నిర్వహించారు. ఫలితాల కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి AP EAMCET – 2020 RESULTS
Read Moreకరెంట్ అఫైర్స్ – ఆగస్టు 8, 2020
☛ శ్రీలంక ప్రధానమంత్రిగా 4వ సారి ఎన్నికైన రాజపక్స శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహింద రాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది. రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద రాజపక్స 4వసారి ప్రధాన మంత్రిగా ఆగస్టు 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయం సాధించింది. మాజీ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు. ☛ ఏపీలో జిల్లాల విభజనకు అధ్యయన కమిటీ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)…
Read Moreకరెంట్ అఫైర్స్ – ఆగస్టు 7, 2020
☛ దేశంలో తొలి కిసాన్ ప్రత్యేక పార్శిల్ రైలు ప్రారంభం భారత దేశపు తొలి కిసాన్ స్పెషల్ పార్శిల్ రైలు ఆగస్టు 7న సేవలు ప్రారంభించింది. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దానాపూర్ వరకు ఇది ప్రయాణిస్తుంది. దీనిలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ రైలును ప్రారంభించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కిసాన్ రైలు ప్రాజెక్టు ప్రకటించారు. ఈ రైలు దేవ్లాలీలో బయల్దేరి… దానాపూర్ చేరుకుంటుంది. 1519 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కూరగాయలు, పండ్లు రవాణా చేస్తూ, కొన్ని స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయి. నాసిక్‌లో కూరగాయలు, పండ్లు, పూలు విస్తారంగా పండుతాయి. వీటిని ఈ రైలు ద్వారా…
Read Moreకరెంట్ అఫైర్స్ – ఆగస్టు 6, 2020
☛ ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ఉత్తరప్రదేశ్ లోని ఆయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన ఆగస్టు 5న మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం..…
Read MoreTSRJC దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి టీఎస్ఆర్జేసీ సెట్-2020 కోసం ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు పెంచారు. ఆగస్టు 5 చివరి తేదీ కాగా, దాన్ని ఈ నెల 20 వరకు పెంచారు. వివరాల కోసం tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ☛ మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
Read Moreకరెంట్ అఫైర్స్ – ఆగస్టు 5, 2020
☛ పీఓకే, జమ్మూలోని కొన్ని ప్రాంతాలతో పాక్ మ్యాప్ భారత్‌లోని కొన్ని కీలక భూభాగాలు తమవేనని చెప్పుకుంటూ ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అక్కడ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త మ్యాప్ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆగస్టు 5కి ఏడాది కానుండగా… ఆగస్టు 4న మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించింది. సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసింది. పాక్ ప్రజలతోపాటు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు సైతం…
Read MoreGK Practice Test – Solar System – 7
☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు. Thank You Team Vikaasam
Read MoreGK Practice Test – Solar System – 6
☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు. Thank You Team Vikaasam
Read MoreGK Practice Test – Solar System – 5
☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు. Thank You Team Vikaasam
Read More