తల్లిదండ్రులకు కరోనా – 6 నెలల బాబుకి అమ్మైన డాక్టర్ !!

కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మేకదా..” పైన ఫోటోని వర్ణించేందుకు ఈ పాటకన్నా అద్భుతమైనది మరొకటి దొరకదు. కరోనా తెచ్చిన భయం.. మనుషుల మధ్య అనుబంధాలని, మానవత్వాన్ని మంటకలుపుతోంది. ఇలాంటి సమయంలోకేరళలోని ఓ డాక్టర్కరోనా సోకిన దంపతులు ఆసుపత్రిలో చేరితోవారి బిడ్డని అక్కున చేర్చుకొని.. నెల రోజులు కన్నబిడ్డలా ఆలించింది. లాలించింది. పాలించింది. ఆ దంపతులు కరోనా నుంచి కోలుకొని బిడ్డని తీసుకెళ్లేందుకు వస్తే.. బుడ్డోడిని వారికి అప్పగిస్తూ కన్నీటిపర్యంతమైంది. నెల రోజుల పాటు తన ఒడిలో ఆడుకున్న బాబు.. దూరం అవడంతో తల్లడిల్లింది. అందుకే.. అంటారు అమ్మ ప్రేమని మించింది లేదని. కన్న ప్రేమ అయినా.. పెంచిన ప్రేమ అయినా.. రెండూ గొప్పవే అని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది.

             

ఈ ఘటనకేరళలో జరిగింది. హర్యానాలో నర్సులుగా సేవలు అందిస్తున్న ఎల్డోస్, షీనా దంపతులకు ఎల్వినే అనే 6 నెలల బాబు ఉన్నాడు. బాబు తండ్రి ఎల్డోస్ కి హర్యానాలోనే కరోనా పాజిటివ్ రావటంతో.. షీనా ఎల్విన్ ని తీసుకొని కోచికి వచ్చి హోం క్వారంటైన్ లో ఉంది. ఆ సమయంలోనే ఆమెకి కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పరీక్ష చేయగా.. ఆమెకీ పాజివట్ గా తేలింది. దీంతో.. ఆమె దగ్గరికి వచ్చేందుకు బంధువులు కూడా భయపడ్డారు. ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలి. బాబుని వెంట ఉంచుకోవడం ప్రమాదం. ఏం చేయాలి ? బంధువులు కనీసం బాబుని చూసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. దిక్కుతోచని స్థితిలో ఎల్విన్ తల్లి షీనా తల్లడిల్లుతోన్న సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీఅదే ప్రాంతంలో ఉండే డాక్టర్ మేరీ అనితాకు పరిస్థితిని వివరించారు. మొత్తం విషయం తెలుసుకున్న ఆమెతల్లి ఆరోగ్యం మెరుగుపడే వరకు బాబుని చూసుకునేందుకు అంగీకరించారు. కరోనా పాజిటివ్ తేలిన తర్వాత షీనా వద్దే బాబు ఏడు రోజులు ఉన్నాడు. దీంతో.. ఎల్విన్ కి కూడా వైరస్ సోకిందా లేదా అన్న విషయం తెలీదు. అయినా.. ధైర్యంగా పిల్లాడి సంరక్షణకు ఒప్పుకున్న డాక్టర్ అనితబాబు తల్లిదండ్రులకు దేవతలా కనిపించారు

 డాక్టర్ మేరీ అనితకి ముగ్గురు పిల్లలు. దీంతో.. బాబుని తీసుకొని ఇంటకెళ్లలేదు. అందుకేతన ఇంటి వద్దే ఉన్న ఖాళీ ఫ్లాట్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వండిన ఆహారాన్ని ఆమె పిల్లలు ప్రతి రోజు తెచ్చి తలుపు ముందు పెట్టి వెళ్లేవారు. అలా నెల రోజుల పాటు పూర్తి సమయాన్ని బాబుకే కేటాయించి ఐసోలేషన్ లో ఉండిపోయారు ఆమె. ఎల్విన్ తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసిబాబు యోగ క్షేమాలు తెలియజేశారు. చివరికి పిల్లాడి తల్లిదండ్రులు కరోనాను జయించి తిరిగి వచ్చాక.. బాబుని వారికి అప్పజెప్పారు. ఈ సమయంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎంతైనా తల్లి మనసు కదా.. నెల రోజుల పాటు తన ఒడిలో ఆడుకున్న బాబు.. దూరం అవుతుంటే తట్టుకోలేకపోయింది. డాక్టర్ అనిత పిల్లలు కూడాతమ తమ్ముడు వెళ్లిపోతున్నాడంటూ ఏడ్చేశారు. ఈ సంఘటనచుట్టుపక్కల వాళ్లని కన్నీరుపెట్టించింది. ఎల్విన్ తల్లిదండ్రులు…. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమంటూ డాక్టర్ అనితకి బరువెక్కిన హృదయంతో కృతజ్ఞతలు చెప్పారు. నిజంగామనం ఒకరి కోసం ఒకరం అండగా నిలబడితే.. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు కదా !!

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments