కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 8, 2020

శ్రీలంక ప్రధానమంత్రిగా 4వ సారి ఎన్నికైన రాజపక్స

శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహింద రాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది. రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద రాజపక్స 4వసారి ప్రధాన మంత్రిగా ఆగస్టు 9 ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్‌ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయం సాధించింది. మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు.

☛ ఏపీలో జిల్లాల విభజనకు అధ్యయన కమిటీరాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని ఆగస్టు 7 ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. ఇందులో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి.☛ అక్టోబర్ 2 నుంచి ఏపీలో చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’

గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆగస్ట్‌ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

 ఆంధ్రప్రదేశ్ లో 3 కాన్సెప్ట్ సీటీలు

రాష్ట్రంలో కాన్సెప్ట్‌ నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. నాలుగు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా సంస్థను ఎంపిక చేస్తూ ఆగస్టు 7 ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఒకేచోట వాణిజ్య, నివాస, ఇతర అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసి నిర్మించడమే కాన్సెప్ట్‌ సిటీ. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటుచేస్తారు.

ఏపీ సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం మరో 3 నెలలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆగస్టు 7 ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సీఎస్‌ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆమె పదవీకాలాన్ని జూలై ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకు మూడు నెలలకు పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలతో అదికూడా ముగుస్తుండడంతో మరో 3 నెలల పాటు సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం లేఖ రాశారు. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఈ ఏడాది డిసెంబరు 31 వరకు నీలం సాహ్ని సీఎస్ గా కొనసాగనున్నారు.☛ ఎన్జీ రంగా యూనివర్సిటీ వీసీగా విష్ణువర్ధన్ రెడ్డి

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీగా ఆదాల విష్ణువర్ధన్‍రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

☛ కియా మోటార్స్ కొత్త ఎస్ యూ వీ ‘సోనెట్‌’

కియా మోటార్స్‌ మేడిన్‌ ఆంధ్రా సరికొత్త స్మార్ట్‌ అర్బన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘సోనెట్‌’ను ఆగస్టు 7 వర్చువల్‌గా ఆవిష్కరించింది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో సెల్టోస్‌ తర్వాత తయారైన రెండవ కారు ఇది. వచ్చే పండుగల సీజన్‌కు ఈ కారును వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కారును వర్చువల్‌గా ఆవిష్కరిస్తూ కియా మోటార్‌ కార్పొరేషన్‌ సీఈవో హూ సంగ్‌ సాంగ్‌ మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి నాణ్యతతో రూపొందించిన ఈ కారుడ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు విన్నూతనమైన ఆనందాన్ని అందిస్తుందన్నారు. డ్రైవర్‌కు అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే విధంగా క్లచ్‌ పెడల్‌ లేకుండా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్స్, సిక్స్‌ స్పీడ్‌ స్మార్ట్‌ స్ట్రీమ్‌ ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రిన్స్‌మిషన్‌ వంటి 30కిపైగా ప్రత్యేకతలు ఈ సోనెట్‌ సొంతం.

☛ చేనేత కార్మికుల పరంగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ‘దేశీయ వస్త్ర పరిశ్రమలో చేనేత కార్మికుల పరంగా రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని గొప్ప వస్త్ర వారసత్వాన్ని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న మా నేతన్నలను చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్‌లో కొనియాడారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు రూ. 24,000 చొప్పున వరుసగా రెండేళ్లు ఇవ్వడం..ముఖ్యంగా కోవిడ్‌–19 వంటి సమయంలో చేనేత కార్మికుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

☛ ప్రజాదరణ ఉన్న సీఎంలలో యోగీ ఫస్ట్.. 3వ స్థానంలో జగన్దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉన్నారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ స్థానంలో నిలవగాతెలంగాణ సీఎం కేసీఆర్‌ కి తొమ్మిదో స్థానం దక్కింది. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది.

☛ పీఎం స్వనిధిని ప్రారంభించిన కేంద్రం వీధి వ్యాపారులకు రూ.10 వేలు

గుర్తింపుకార్డు లేని వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7 ప్రారంభించింది. ఈ పథకం కింద వారికి ‘సిఫారసు ఉత్త రం’ జారీచేస్తారు. ఈ ఉత్తరంతో వీధివ్యాపారులు రూ.10 వేల వరకు రుణం పొందవచ్చని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా తెలిపారు. అర్హులైన వీధి వ్యాపారులు తాము నివసిస్తున్న ప్రాంతంలోని పట్టణ, స్థానిక సంస్థలో ‘సిఫారసు ఉత్తరం’ కోసం ఏదైనా గుర్తింపు పత్రంతో దరఖాస్తు చేస్తే ఆ ఉత్తరాన్ని జారీ చేస్తారని, ఆ ఉత్తరంతో వారు ఏదైనా బ్యాంకు నుంచి రూ.10 వేల వరకు రుణం తీసుకోవచ్చని తెలిపారు. ఓ సంవత్సరంలో నెలకు వాయిదాల రూపంలో ఈ రు ణాన్ని తిరిగి చెల్లింవచ్చని పేర్కొన్నారు.

☛  యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్‌ కుమార్‌ జోషీ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌గా విద్యావేత్త ప్రొఫెసర్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్‌ అరవింద్‌ సక్సేనా పదవీ కాలం ఆగస్టు 7తో ముగియటంతో ఈ మేరకు కమిషన్‌ కొత్త ఛైర్మన్ ను నియమించింది. ఇప్పటి వరకు యూపీఎస్సీలో సభ్యునిగా జోషీ ఉన్నారు. 2021 మే 12 వరకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జోషీ నియామకంతో కమిషన్‌ సభ్యుల్లో ఒక ఖాళీ ఏర్పడింది.

☛ తూర్పు లడఖ్‌లోని సరిహద్దులోనే భారత సేనలు

సరిహద్దుల్లో చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడే ఉంటాయని డ్రాగన్‌కు భారత్‌ తేల్చిచెప్పింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్‌ షరతు విధించింది. పలుమార్లు డ్రాగన్‌కు ఇదే విషయం స్పష్టం చేసినా సంప్రదింపుల పేరుతో చైనా సరికొత్త ప్రయత్నాలతో ముందుకొస్తూనే ఉంది.

☛ రైల్వేలో కళాసీ వ్యవస్థ రద్దు

భారత్‌లో బ్రిటిష్‌ పాలన కాలం నాటి నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే సీనియర్‌ అధికారుల ఇళ్లలో పనిచేసే గ్రేడ్ – 4 కు చెందిన ఖలాసీ (ప్యూన్‌)ల ఉద్యోగాలకు కొత్తగా నియామకాలు ఉండబోవని చెప్పింది. అయితే, టెలిఫోన్‌ అటెండెంట్‌కమ్‌డాక్‌ ఖలాసీ(టీఏడీకే)లకు సంబంధించిన అంశం మాత్రం తమ పరిశీలనలో ఉందని చెప్పింది. అలాగే జూలై 1 నాటికి చేపట్టిన నియామకాలనూ రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని చెప్పింది.

☛ కేరళలో విమాన ప్రమాదం – 17 మంది మృతి

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు.

☛ టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లను నిషేధించిన అమెరికా

చైనా సోషల్‌ మీడియా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన నేపథ్యంలో.. అమెరికా కూడా అదే బాటలో సాగుతోంది. అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా తాజాగా అమెరికాలో సైతం టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమలులోకి రానుంది. భారత్‌ ఇటీవలే టిక్‌టాక్, వీచాట్‌లతో పాటు చైనాకు సంబంధించిన 106 యాప్‌లపై నిషేధం విధించింది. దీన్ని అమెరికా చట్టసభ సభ్యులు, అధికార వర్గాలు స్వాగతించాయి. అమెరికాలో సైతం ఆ యాప్‌లను నిషేధించాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా జాతీయ భద్రతను కాపాడటానికి టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.

☛ కరోనా వ్యాప్తి భయాలతో పెరిగిన సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలుమహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫిషింగ్‌ వెబ్‌సైట్ల(నకిలీ)లో 350 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఆస్పత్రులు, వైద్యారోగ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులు పెచ్చుమీరుతున్నాయని.. కరోనా సమాచారాన్ని ఎరగా చూపి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపింది. అదే విధంగా గత కొంతకాలంగా ఉగ్రవాదులు కూడా చాపకింద నీరులా తమ కార్యకలాపాలు విస్తృతం చేశారని పేర్కొంది.

☛ 2,500కు పైగా చైనా యూట్యూబ్ చానళ్లు తొలగింపు

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు గూగుల్ ప్రకటించింది. త్రైమాసిక బులెటిన్ వెల్లడి సందర్భంగా గూగుల్ ఈ విషయాన్ని వివరించింది. స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్జూన్ మాసంలో వీటిని తొలగించినట్టు వెల్లడించింది. అయితే తప్పుడు సమాచారం వ్యాప్తి ఆరోపణలను చైనా గతంలో తీవ్రంగా ఖండించింది.

☛ 2021, 2022 టీ20 ప్రపంచ కప్ వేదికలు ఖరారు మహిళల టోర్నీ 2022కు వాయిదా

వరుసగా రెండేళ్లు రెండు టి20 ప్రపంచకప్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వాటి వేదికలను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాకు 2022 టి20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు ఇస్తున్నట్లు ఆగస్టు 7 ఐసీసీ ప్రకటించింది. గత షెడ్యూల్‌ తరహాలో 2021లో జరగాల్సిన టి20 వరల్డ్‌ కప్‌ వేదికను మాత్రం కొనసాగించారు. ఇందులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ ప్రకారం 2021 ఫిబ్రవరి 6 – జనవరి 7 మధ్య న్యూజిలాండ్‌లో జరగాల్సి ఉంది. దీనిని ఇప్పుడు ఐసీసీ 2022కు వాయిదా వేసింది.

☛ ఫార్ములా వన్ రేసింగ్ పాయింట్ జట్టుపై రూ. 3 కోట్ల జరిమానా

నిబంధనలకు విరుద్ధంగాప్రత్యర్థి కారుతో పోలి ఉన్న పరికరాలను వాడుతూ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో పోటీపడుతున్న రేసింగ్‌ పాయింట్‌ జట్టుపై అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) 4 లక్షల యూరోలు (రూ. 3 కోట్ల 54 లక్షలు) జరిమానా విధించింది. దాంతోపాటు కన్‌స్ట్రకర్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆ జట్టు ఖాతాలో నుంచి 15 పాయింట్లు తొలగించింది. ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్, అతని సహచరుడు వాల్తెరి బొటాస్‌ సభ్యులుగా ఉన్న మెర్సిడెస్‌ జట్టు వాడుతున్న బ్రేక్‌ డక్ట్‌లను రేసింగ్‌ పాయింట్‌ జట్టు గత మూడు రేసుల్లో వాడిందని రెనౌ జట్టు స్టీవార్డ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారించిన స్టీవార్డ్స్‌ రెనౌ ఫిర్యాదులో నిజం ఉందని తేలుస్తూ రేసింగ్‌ పాయింట్‌ జట్టును హెచ్చరించి జరిమానా విధించడంతోపాటు పాయింట్లను తీసివేసింది. ప్రస్తుత ఫార్ములావన్‌ సీజన్‌లో నాలుగు రేసులు ముగిశాక కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌ విభాగంలో రేసింగ్‌ పాయింట్‌ జట్టు 42 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా… 10 పాయింట్లతో రెనౌ జట్టు ఆరో స్థానంలో ఉంది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments