Daily Current Affairs – September 25 – 2018

రాడ్ లేవర్ కప్ – 2018 విజేత యూరప్ జట్టు

అమెరికాలోని షికాగోలో జరిగిన రాడ్ లేవర్ పురుషుల టెన్నిస్ కప్ – 2018ను యూరోప్ జట్టు గెలుచుకుంది. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్(సెర్పియా), జ్వెరెక్(జర్మనీ), దిమిత్రోవ్(బల్గేరియా), గాఫిన్(బెల్జియం), ఎడ్మండ్(బ్రిటన్)లతో కూడిన యూరప్ జట్టు… 13 – 8 తేడాతో ప్రపంచ జట్టుని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా రెండో ఏడాది ఈ కప్ ను సొంతం చేసుకుంది.

 • ప్రపంచ జట్టులో అండర్సన్(దక్షిణాఫ్రికా), ఇస్నెర్(అమెరికా), కిరియోస్(ఆస్ట్రేలియా), జాక్ సోక్(అమెరికా), ష్వార్ట్ జ్ మన్(అర్జెంటీనా), టీయాఫో(అమెరికా) ఉన్నారు.

దేశంలో జడ్జీలు ప్రజల నిష్పత్తి 10 లక్షలు : 19.49

భారత్ లో ప్రతి పది లక్షల మందికి దాదాపు 19 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని కింది స్థాయి కోర్టులతో కలిపి మొత్తం 6 వేల మంది న్యాయమూర్తుల కొరత ఉంది. పార్లమెంటులో చర్చ కోసం కేంద్ర న్యాయశాఖ 2018 మార్చిలో ఈ నివేదికను రూపొందించింది.

సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం

సిక్కింలో రాష్ట్రంలోని పాక్ యాంగ్ నగరంలో నిర్మించిన ఆ రాష్ట్ర తొలి ఎయిర్ పోర్టుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశంలో 65 విమానాశ్రయాలు ఉన్నాయని.. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం కొత్తగా 35 ఎయిర్ పోర్టులని నిర్మించిందనిదీంతో పాక్ యాంగ్ ఎయిర్ పోర్ట్ దేశంలోని 100వ ఎయిర్ పోర్టుగా నిలిచిందని ప్రధాని వివరించారు.

 • పాక్ యాంగ్ పట్టణంలో సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మించారు.

 • ఎయిర్ పోర్టు 201 ఎకరాల్లో విస్తరించి ఉంది.

 • కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్ పోర్టుని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం

ఈజ్ ఆఫ్ లివింగ్ లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో అమృత్ (AMRUT – Atal Mission for Rejuvenation and Urban Transformation) అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ అవార్డులను అందజేశారు.

 • పట్టణాల వారీగా 2018 ఆగస్టులో ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో తిరుపతి 4వ స్థానంలో, విజయవాడ 9వ స్థానంలో నిలిచాయి.

 • అభివృద్ధి కార్యక్రమాల డీపీఆర్ ల రూపకల్పన, కాంట్రాక్టుల కేటాయింపు, ప్రాజెక్టుల పూర్తి, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సమర్పణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను రూపొందిస్తారు.

 • AMRUT పథకాన్ని 2015లో ప్రారంభించారు.

ఫోర్బ్స్ టైకూన్స్ ఆఫ్ టుమారోలో సింధు, ఉపాసన

ప్రముఖ మ్యాగజైన తొలిసారి విడుదల చేసిన టైకూన్స్ ఆఫ్ టుమారోలో హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేని స్థానం సంపాదించుకున్నారు. క్రీడా, వ్యాపార, నటనా రంగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన 22 మంది యువ అచీవర్స్ తో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఇది కేవలం భారత్ జాబితానే.

చైనా ఓపెన్ – 2018

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇండోనేషియా ప్లేయర్ ఆంటోని సినిసుకా, మహిళల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ గెలుచుకున్నారు.

సెప్టెంబర్ 23న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంటోని సినిసుకా.. జపాన్ ప్లేయర్ కెంటో మొమొట్టోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్.. చైనా క్రీడాకారిణి చెన్ యూఫీని ఓడించి టైటిల్ గెలుచుకుంది.

అమీర్ పేట్ ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం

హైదరాబాద్ మెట్రో కారిడార్ – 1 లోని అమీర్ పెట్ ఎల్బీనగర్ మార్గం.. సెప్టెంబర్ 24 నుంచి ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. జెండా ఊపి రైలుని ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో 17 స్టేషన్లు ఉన్నాయి. దీంతో.. 29 కిలోమీటర్ల కారిడార్ – 1 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లైంది.

 • హైదరాబాద్ మెట్రోని ప్రధాని నరేంద్ర మోదీ 2017 నవంబర్ 28న ప్రారంభించారు. తొలుత మియాపూర్ నుంచి నాగోల్ మార్గాన్ని ప్రధానితో ప్రారంభింపజేశారు.

మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలిహ్

భారత్ కు మంచి మిత్రపక్ష దేశమైన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్ట్(MDP) సహ వ్యవస్థాపకులు.. ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ విజయం సాధించారు. దీంతో.. ఆయన దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 23న వెలువడ్డ ఫలితాల్లో.. ఇబ్రహీం సోలిహ్ కు 58.3 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థి అబ్దుల్లా యామీన్ కు 41.7 శాతం ఓట్లు వచ్చాయి. దీంతోయామీన్ తన ఓటమిని అంగీకరించారు.

 • ఎన్నికల్లో ఓటమిపాలైన అబ్దుల్లా యామీన్ భారత్ విరోధిగా పేరుపడ్డారు. ఈయన చైనాకు దగ్గరగా మెలిగారు.

 • కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ .. భారత్ అనుకూల వాదిగా ముద్రపడ్డారు.

 • మాల్దీవుల రాజధాని మాలె.

 • కరెన్సీ మాల్దీవియన్ రుఫియా

ఫేస్ బుక్ ఇండియా ఎండీగా అజిత్ మోహన్

ప్రముఖ వీడియో సేవల సంస్థ హాట్ స్టార్ సీఈవో అజిత్ మోహన్.. ఫేస్ బుక్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ హోదాని కొత్తగా సృష్టించారు. 2019 జనవరిలో అజిత్ మోహన్.. బాధ్యతలు స్వీకరిస్తారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments