- 3 బ్యాంకుల విలీనం
మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం చేయాలని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ద్వారా రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా 3వ అతిపెద్ద బ్యాంక్ ఏర్పాటు అవుతుంది.
-
విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారతాయని, రుణ వితరణ సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
-
2017లో భారతీయ స్టేట్ బ్యాంకులో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంక్) విలీనం అయ్యాయి. తద్వారా ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
-
దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
- చేతులు మారిన టైమ్ మ్యాగజైన్
ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ మ్యాగజైన్ టైమ్ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్ టైమ్ కొత్త యజమాని అయ్యారు. ఈ మేరకు ఆయనకు 190 మిలియన్ డాలర్లకు టైమ్ మ్యాగజైన్ ను అమ్ముతున్నట్లు ప్రస్తుత యాజమాన్యం మెరిడిత్ కార్పొరేషన్ వెల్లడించింది.
-
యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ లు 1923 మార్చిలో టైమ్ మ్యాగజైన్ ను ప్రారంభించారు.
-
2017లో టైమ్ మ్యాగజైన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.
-
ఇప్పుడు మెరిడిత్ నుంచి ఆ సంస్థ మార్క్ బెనియాఫ్ చేతుల్లోకి వెళ్లింది.
-
ఇది న్యూస్ మ్యాగజైన్.
- పురుషుల డెకథ్లాన్ లో కెవిన్ మాయెర్ సరికొత్త రికార్డు
పురుషుల డెకథ్లాన్ లో సెప్టెంబర్ 17న కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన డెకాస్టర్ ఈవెంట్లో ఫ్రాన్స్ అథ్లెట్ కెవిన్ మాయెర్ 9,126 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకోవటంతో పాటు కొత్త ప్రపంచ రికార్డు లిఖించాడు. 2015లో అమెరికా అథ్లెట్ యాప్టన్ ఈటన్ 9,045 పాయింట్లతో నెలకొల్పిన రికార్డుని మాయెర్ తిరగరాశాడు.
డెకథ్లాన్ అంట్ ?
-
అథ్లెటిక్స్ లో 100 మీటర్లు, లాంగ్ జంప్, షాట్ పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హార్టిల్స్, డిస్కర్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు సమాహారం.
- మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల అమ్మకానికి సంబంధించి వార్తల్లో నిలిచిన టైమ్ మ్యాగజైన్ కు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సరైనవి ?
a) టైమ్ మ్యాగజైన్ ను 1923లో ప్రారంభించారు
b) టైమ్ మ్యాగజైన్ న్యూస్ మ్యాగజైన్
c)టైమ్ టైమ్ మ్యాగజైన్ ను మార్క్ బెనియాఫ్ కొన్నారు
d)హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ లు మ్యాగజైన్ ను స్థాపించారు
-
A, B, C, D
-
A & D only
-
A, C & D only
-
B & D only
జవాబు: A, B, C, D
2. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ కింది వాటిలో ఏ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించింది ?
-
బ్యాంక్ ఆఫ్ బరోడా
-
విజయ బ్యాంక్
-
దేనా బ్యాంక్
-
పై మూడు
జవాబు: పై మూడు
3. పురుషుల డెకథ్లాన్ లో ఇటీవల సరికొత్త రికార్డు నెలకొల్పిన అథ్లెట్ కెవిన్ మాయెర్ కు సంబంధించి.. ఈ కింది వాటిలో ఏవి సరైనవి ?
a) కెవిన్ మాయెర్ ఫ్రాన్స్ కు చెందిన అథ్లెట్
b) ఇటీవల పారిస్ లో జరిగిన డెకాస్టర్ ఈవెంట్లో కెవిన్ స్వర్ణం గెలుచుకున్నాడు
-
A only
-
B only
-
None
-
Both A & B
జవాబు: Both A & B