లీడెన్ లో 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్
4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ నెదర్లాండ్స్ లోని లీడెన్ లో సెప్టెంబర్ 1,2 తేదీల్లో జరిగింది. భారత ఆయుష్ శాఖ మంత్రి శ్రీ పాద యశో నాయక్ ఈ సదస్సుని ప్రారంభించారు. నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ మహరిషి ఆయుర్వేద ఫౌండేషన్, భారత్ లోని న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్, పూణెలోని అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ ఆయుర్వేదా సంయుక్తంగా ఈ కాంగ్రెస్ నిర్వహించాయి.
భారత్, సిప్రస్ మధ్య 2 ఒప్పందాలు
మనీ లాండరింగ్ నిరోధం, పర్యావరణ పరిరక్షణలో సహకారానికి సంబంధించి భారత్, సిప్రస్ మధ్య సెప్టెంబర్ 3న రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడెస్ తో రాజధాని నికోసియాలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి.
భారత్ లో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న విదేశాల జాబితాలో సిప్రస్ 8వ స్థానంలో ఉంది. ఆ దేశం నుంచి 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ లోకి వస్తున్నాయి.
యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఆర్య పథకం
యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం (ఎట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్–ఆర్య) పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 100 జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ పథకం అమలుకు అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు సూచనలిచ్చింది.
- దేశవ్యాప్తంగా ఉన్న 669 కృషి విజ్ఞాన కేంద్రాల్లో(KVK) 100 కేవీకేలను ఇందుకోసం ఎంపిక చేయాలని ఆదేశించింది.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 జిల్లా కేవీకేల్లో ఈ పథకం అమలువుతోంది.
- తెలంగాణలోని నల్గొండ జిల్లా కంపాసాగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న KVKలో ఆర్య కార్యక్రమం ప్రయోగాత్మక అమల్లో ఉంది.
- దేశంలో పంట ఉత్పాదకత, దిగుబడులు పెరగాలంటే ఆర్య పథకం కీలకం అని కేంద్రం గట్టిగా భావిస్తోంది. యువతను సేద్యం వైపు ఆకర్షించేలా చేయడం ద్వారా కొత్త ప్రయోగాలకు చేయూతనిచ్చినట్లవుతుందని గట్టిగా విశ్వసిస్తోంది.
- మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉన్న యువ రైతులను ఎంపిక చేసి ఆధునాతన పరిజ్ఞానం వినియోగం, మార్కెటింగ్ అవకాశాలను పెంచుకునే నైపుణ్య శిక్షణ కేవీకేల ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తోంది.
మాదిరి ప్రశ్నలు
యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్య పథకం తొలుత ఎన్ని జిల్లాల్లో అమలు కానుంది ?
1)121
2)100
3)150
4)200
జవాబు:100
4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1)చైనా
2)శ్రీలంక
3)మయన్మార్
4)నెదర్లాండ్స్
జవాబు: నెదర్లాండ్స్
ఈ కింది వారిలో సిప్రస్ దేశ అధ్యక్షుడు ఎవరు ?
-
వ్లాదిమిర్ పుతిన్
-
కిమ్ జోంగ్
-
నికోస్ అనస్టాసియాడెస్
-
షీ జిన్ పింగ్
జవాబు: నికోస్ అనస్టాసియాడెస్