డైలీ కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ 2 – 2018

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్

మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

ఆసియా క్రీడలు – 2018

ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను గెలుచుకొని పతకాల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

చైనా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 280 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో(75 స్వర్ణాలు, 56 రజతాలు, 74 కాంస్యాలు, మొత్తం 205), దక్షిణ కొరియా మూడో స్థానంలో(49 స్వర్ణాలు, 58 రజతాలు, 70 కాంస్యాలు ,మొత్తం 177) నిలిచాయి.

  • ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జపాన్ స్విమ్మర్ రికాకో ఇకీ ఎంపికైంది. స్విమ్మింగ్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 18 ఏళ్ల ఇకీ ఆరు పసిడి, రెండు రజత పతకాలను సాధించింది.దీంతో 1998 తర్వాత ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఇకీ గుర్తింపు పొందింది.

ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలను వివరిస్తు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1.55 లక్షల పోస్టాఫీసులకు ఈ సేవలను విస్తరిస్తామని మోదీ ప్రకటించారు.

ఇవీ విశేషాలు

  • ఐపీపీబీలో రూ.లక్షకు మించి డిపాజిట్లు ఉంటే అవి పొదుపు ఖాతాలుగా మారిపోతాయి. ఆధార్, వేలిముద్రలతో ఒక్క నిమిషంలోనే ఐపీపీబీలో ఖాతా తెరవచ్చు.

  • ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్‌‌సడ్ లోన్‌‌స), క్రెడిట్ కార్డుల వంటి సేవలు అందుబాటులో ఉండవు.

  • డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
  • రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్‌‌జ జీవిత బీమా కంపెనీతో ఐపీపీబీ ఒప్పందం కుదుర్చుకుంది.

2017-18లో మారిషస్ నుంచి అత్యధిక FDIలు

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టిన దేశంగా మారిషస్ నిలిచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2న వెలువరించిన వివరాల ప్రకారం.. 2017-18లో దేశంలోకి మొత్తం 37.36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మారిషస్ నుంచి వచ్చాయి. 9.27 బిలియన్ డాలర్లతో సింగపూర్ రెండోస్థానంలో నిలిచింది.

2016-17లో మొత్తం 36.31 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి రాగా మారిషస్ నుంచి 13.38 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6.52 బిలియన్ డాలర్లు వచ్చాయి.

మాదిరి ప్రశ్నలు

1. ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన వివరాల ప్రకారం 2017-18లో భారత్ లోకి అత్యధిక FDIలు ఏ దేశం నుంచి వచ్చాయి ?

అమెరికా

మారిషస్

సింగపూర్

జపాన్

జవాబు: మారిషస్

2. ఇటలీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు – 2018 టైటిల్ విజేత ఎవరు ?

లూయిస్ హామిల్టన్

రైకోనెన్

వాల్తెరి బొటాస్

సెబాస్టియన్ వెటల్

జవాబు: లూయిస్ హామిల్టన్

3. 18వ ఆసియా క్రీడలు ఇటీవల కింది వాటిలోని ఏ నగరంలో జరిగాయి ?

జకార్తా

న్యూఢిల్లీ

బీజింగ్

టోక్యో

జవాబు: జకార్తా

4. “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తక రచయిత ఎవరు ?

వెంకయ్య నాయుడు

నరేంద్ర మోదీ

రామ్ నాథ్ కోవింద్

అమిత్ షా

జవాబు: వెంకయ్య నాయుడు

5. ఇటీవల ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ చెల్లిస్తారు ?

8 శాతం

7 శాతం

2 శాతం

4 శాతం

జవాబు: 4 శాతం

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments