Daily Current Affairs – October 26, 2018

2020, ఏప్రిల్ 1 నుంచి BS – 4 బంద్

దేశంలో 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(BS)-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న ఆదేశించింది. అప్పటి నుంచి కేవలం బీఎస్-6 వాహనాలను మాత్రమే అమ్మాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తీర్పునిచ్చింది. దేశంలో వాయుకాలుష్యం నియంత్రించేందుకు కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. యూరో-6 ప్రమాణాలతో సమానమైన బీఎస్-6 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువస్థాయిలో వెలువడతాయి.

లైంగిక వేధింపులపై జీవోఎం ఏర్పాటు

కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (GOM)ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఏర్పాటు చేసింది. ఈ బృందానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుంది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుంది.

మహిళలకోసంషీబాక్స్
మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీబాక్స్’ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అక్టోబర్ 24ఈ మేరకు ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తారు. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

భారత్‌కు బరాక్-8 క్షిపణి వ్యవస్థ

భారత్‌కు బరాక్-8 క్షిపణి వ్యవస్థ, క్షిపణి పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కి చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI)తో భారత్ అక్టోబర్ 24న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.5,683 కోట్లు. దీంతో భారత నావికాదళానికి బరాక్ 8 (ఎస్‌ఏఎం) క్షిపణులను ఐఏఐ సరఫరా చేయనుంది. భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి.

గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి.

ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24

పోలీయో వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచి.. ఈ వైరస్ ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా.. ప్రపంచవ్యాప్తంగా ఏటా అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పోలీయో వైరస్ కు వ్యాక్సిన్ ను కనుగొన్న జొనాస్ సాల్క్ జయంతిని పురస్కరించుకొని.. రొటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా అక్టోబర్ 24న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

  • ఇందులో భాగంగానే గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్(GPEI)ని 1988లో ప్రారంభించారు.

  • జీపీఐఈని ప్రారంభించిన నాడు 125 దేశాల్లో పోలియో ఆనవాళ్లు ఉండేవి. ప్రస్తుతం కేవలం పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ లో మాత్రమే పోలియో వైరస్ కనిపిస్తోంది.

ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24

1945లో UN Charter అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున అన్ని దేశాలు.. ప్రపంపవ్యాప్తంగా ఐరాస కార్యక్రమాలు మరింత విస్తృతం అయ్యేందుకు ఆర్థికసహాయాన్ని ప్రకటిస్తాయి.

  • లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైన తర్వాత ఐక్యరాజ్య సమితిని 1945లో ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు ఈ సంస్థను స్థాపించారు. ప్రపంచ దేశాల మధ్య వివాదాల పరిష్కారం, ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు సహాయం తదితర కార్యక్రమాలను ఈ సంస్థ అమలు చేస్తుంది.

న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ – 2018

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2వ ఎడిషన్ అక్టోబర్ 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలో జరిగింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సెల్యూలార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

Theme :New Digital Horizons. Connect. Create. Innovate”.

ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ విజేతలు

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ విజేతలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ ఎన్ గోపాలస్వామి నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు అవార్డు విజేతలను ఎంపిక చేసింది.

అవార్డు విజేతలు

2014 – రాజ్ కుమార్ సింగజిత్ సింగ్ మణిపూర్ డ్యాన్సర్

2015 – ఛాయానౌత్ బంగ్లాదేశ్ కు చెందిన సాంస్కృతిక సంస్థ – దీన్ని 1961లో ఏర్పాటు చేశారు.

2016 – రామ్ వంజి సుతార్ ప్రముఖ శిల్పి

  • 2011లో రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనిని ఏర్పాటు చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments