Daily Current Affairs – October 24, 25 – 2018

గాంధీ నగర్ లో 27IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్

27International Atomic Energy Agency – IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్(FEC 2018) అక్టోబర్ 24న గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్ ల ద్వారా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అణు ఇంధన పరిశోధనలో సాంకేతిక, శాస్త్ర అభివృద్ధిని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తుంది.

 • IAEA ని జూలై 29 1957లో ఏర్పాటు చేశారు.

 • ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది.

దేవెగౌడకు వాల్మికి జయంతి అవార్డు 2018-19

శ్రీ మహర్షి వాల్మీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డుని 2018-19 సంవత్సరానికి మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 24న ప్రకటించింది. ఈ రోజున వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఏటా కర్ణాటక ప్రభుత్వం వాల్మికి అవార్డుని ప్రకటిస్తుంది. అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

 • కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి. పార్టీ – JDS

భారత్ కు UN పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు

ఐక్యారాజ్య సమితి పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు (UN INVESTMENT PROMOTION AWARD) ని భారత్ దక్కించుకుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో గణనీయమైన పనితీరు కనబరుస్తున్నందుకు గాను భారత్ కు ఈ అవార్డు దక్కింది. UN Convention on Trade and Development (UNCTAD) తాజాగా నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల ఫోరమ్ సమావేశంలో అర్మేనియా అధ్యక్షుడు అర్మెన్ సర్కిసియాన్ భారత్ కు అవార్డుని ప్రదానం చేశారు.

ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త షిమోమురా కన్నుమూత

ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత, జీవశాస్త్ర నిపుణులు ఒసాము షిమోమురా కన్నుమూశారు. ఆయన 2008లో అమెరికాకు చెందిన మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు గెలుచుకున్నారు. జెల్లీ ఫిష్ ప్రోటీన్, క్యాన్సర్ పరిశోధనలో దాని ప్రాముఖ్యతను గుర్తించినందుకు గాను షిమోమురాకు నోబెల్ దక్కింది.

చౌబాహర్ పోర్ట్ ప్రాజెక్టుపై భారత్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్ సమావేశం

భారత్, ఇరాన్, ఆప్గనిస్తాన్ దేశాల మధ్య రవాణాకు సంబంధించి కీలక వేదికగా నిలిచిన చౌబహార్ పోర్టు ప్రాజెక్టుపై మూడు దేశాల మధ్య అక్టోబర్ 24న తొలి సమావేశం జరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఈ సమావేశం జరిగింది. మూడు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రవాణా సదుపాయం కోసం 2016లో కుదిరిన చౌబాహర్ పోర్ట్ ప్రాజెక్టు ఒప్పందాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా మూడు దేశాలు దృడ సంకల్పాన్ని తెలియజేశాయి.

 • ఇరాన్ దక్షిణ సరిహద్దులో, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ను సమీపంలో చౌబాహర్ పోర్టు ఉంది. దీని అభివృద్ధి చేయడం ద్వారా పాకిస్తాన్ మార్గాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఆప్గనిస్తాన్, ఇరాన్ మార్కెట్లతో అనుసంధానం అయ్యే వీలు కలిగింది.

ప్రధాని మోదీకి సియోల్ శాంతి పురస్కారం – 2018

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం – 2018 దక్కింది. సియోల్ పీస్ ప్రైజ్ కమిటీ ఈ మేరకు ఆయనని ఈ అవార్డుకి ఎంపిక చేసింది.

 • అంతర్జాతీయ స్థాయిలో దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి, అవినీతి వ్యతిరేక చర్యల ద్వారా భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించిన సియోల్ కమిటీఅవార్డు కోసం ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.

 • సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకోనున్న 14వ వ్యక్తి గా ప్రధాని మోదీ నిలిచారు.

 • దక్షిణ కొరియాలోని సియోల్ లో జరిగిన 24వ ఒలింపిక్స్ పోటీల విజయాన్ని గుర్తుచేసుకునేలా 1990లో సియోల్ శాంతి పురస్కారాన్ని నెలకొల్పారు. అవార్డు కింద 2 లక్షల డాలర్ల నగదు బహుమతి సైతం అందజేస్తారు.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా తెలంగాణకు చెందిన ఆఫీసర్

కేంద్ర దర్యాప్తు సంస్థ – సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా తెలంగాణలోని పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన ఎం. నాగేశ్వరరావు నియమితులయ్యారు. అవినీతి ఆరోపణలు, పరస్పర విమర్శల నేపథ్యంలో…. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మా, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న వేటు వేసింది. వారిద్దరినీ సెలవుపై పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావుని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

 • 55 సీబీఐ చరిత్రలో ఈ విధంగా డైరెక్టర్ ను మార్చడం ఇదే తొలిసారి.

 • నాగేశ్వరరావు ఇంతకముందు జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

డీఆర్డీఎల్ డైరెక్టర్ గా డాక్టర్ దశరథరాం

డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ లెబొరేటరీస్(DRDL) డైరెక్టర్ గా డాక్టర్ దశరథరాం నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

 • ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ రక్షణ రంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టం(mss)కు డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందారు.

 • ఆయన స్థానంలో డీఆర్డీఎల్ డైరెక్టర్ గా డాక్టర్ దశరథరాం బాధ్యతలు స్వీకరించారు.

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అక్టోబర్ 24న విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 157 పరుగులు సాధించిన కోహ్లీ.. 10,000 పరుగుల మార్కుని దాటాడు. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న ఐదో భారత బ్యాట్సమెన్ గా నిలిచాడు. ఓవర్ ఆల్ గా 13వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కేవలం 213 మ్యాచ్ ల్లోని 205 ఇన్నింగ్స్ లు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు.

 • వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయిని దాటిన మొదటి ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. 2001 మార్చి 31న ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ ఘనత నమోదు చేశాడు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments