Daily Current Affairs – October 23, 2018

షాంఘై చెస్ విజేత లలిత్ బాబు

షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేతగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు నిలిచాడు. చైనాలో అక్టోబర్ 22న జరిగిన ఈ టోర్నీలో లలిత్ ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ లభించింది.

 • రెండో స్థానంలో లీ డిమూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు.

యూఎస్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు

అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలిచింది. 2010-17 కాలంలో అమెరికాలో ఇంగ్లీషు మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ అక్టోబర్ 22న వివరాలు వెల్లడించింది.

 • 2017 నాటి లెక్కల యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు.

 • ప్రపంచ వాణిజ్య సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010-17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది.

 • అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-10 భాషల్లో ఏడు దక్షిణాసియా భాషలు ఉన్నాయి.

 • అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు. అందులో అధికంగా స్పానిష్ మాట్లాడేవారున్నారు.

 • యూఎస్‌లో భారతీయ భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు అధికంగా ఉండగా తర్వాతి స్థానంలో గుజరాతీ మాట్లాడేవారున్నారు.

కిలిమంజారోను అధిరోహించిన పాలమూరు వాసి

ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారోని మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అక్టోబర్ 22న అధిరోహించారు. మహబూబ్‌నగర్ ట్రెక్కింగ్ క్లబ్ తరఫున ‘మహబూబ్‌నగర్ బాలికలను రక్షించాలి’ అనే నినాదంతో ఆయన కిలిమంజారోని అధిరోహించారు.

ఫాలీ నారీమన్ కు లాల్ బహదూర్ శాస్త్రి – 2018 అవార్డు

న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్‌లెన్స్ అవార్డు-2018 లభించింది. ఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును నారీమన్ కు ప్రదానం చేశారు.

యూఎస్ గ్రాండ్‌ప్రి రేసు విజేత కిమీ రైకోనెన్

అమెరికాలోని ఆస్టిన్‌లో అక్టోబర్ 22న జరిగిన యూఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేసి విజయం సాధించాడు.

 • రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో నిలువగా మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడోస్థానం దక్కించుకున్నాడు.

అంధుల కోసం దేశంలోనే తొలిసారి బ్రెయిలీ లీపీ ఓటరు కార్డులు

దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (EPIC)ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ అక్టోబర్ 23న కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డులను పంపీణి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు.

 • ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది.

 • ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి వంటి త దితర వివరాలున్నాయి.

 • ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,12,098 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.

విశాఖలో వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్

వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ విశాఖపట్నంలో జరిగింది. ఇందులో భాగంగా అక్టోబర్ 23ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి ఐటీ సిటీగా, నాలెడ్జి నగరంగా, తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానికగ్ హబ్‌గా తయారు చేస్తామన్నారు.
ప్రపంచస్థాయి ఫిన్‌టెక్ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్’ (రూ. 7 కోట్లు) పోటీలను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 • కార్యక్రమంలో 15 దేశాల నుంచి 1,800 మంది ఐటీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు వాదాయాప్

హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘వాదా’(ఓటర్ యాక్సెస్‌బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్)ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్ అక్టోబర్ 23న ప్రారంభించారు.

 • వాదా(హామీ) అనే అర్థమొచ్చేలా ఈ పేరు పెట్టారు. ఓటర్ చైతన్య రథాలు, గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఈ యాప్ ద్వారా అధికారులు సహాయమందిస్తారు.

పొడవైన సముద్ర వంతెన ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందిన ‘హాంకాంగ్జుహయి’ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 23న అధికారికంగా ప్రారంభించారు.

 • పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్జుహయిమకావో పట్టణాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 55 కి.మీ కాగా, ఇందులో 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది.

 • ప్రస్తుతం హాంకాంగ్ నుంచి జుహయికి ప్రయాణ సమయం 3 గంటలు కాగా, ఈ వంతెన వల్ల అది 30 నిమిషాలకు తగ్గనుంది. 2009లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments