Daily Current Affairs – October 15, 2018

జయరాజుకు సుద్దాల జాతీయ పురస్కారం – 2018

ప్రజా కవి సుద్దాల హనుమంతు జానకమ్మల జాతీయ పురస్కారం – 2018ని ప్రఖ్యాత ప్రజాకవి జయరాజుకు ప్రదానం చేశారు. సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ప్రదానం చేస్తున్నారు.

ప్రపంచంలోనే వేగవంతమైన కెమెరాను కనుగొన్న అమెరికా

వెలుతురు లేదా కాంతిని స్లో మోషన్ లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ ను కేప్చర్ చేయగలదని వెల్లడించారు. కాలఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ కెమెరాను అభివృద్ధి చేశారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నాయి.

ఒడిశా పోలీస్ ప్రమోద్ కుమార్ కు అశోక చక్ర

నక్సల్స్ తో జరిగిన పోరాటంలో అమరుడైన ఒడిశా పోలీస్ అధికారి ప్రమోద్ కుమార్ సత్పతికి కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ప్రకటించింది. Special Operations Group (SOG) అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేసిన ప్రమోద్ కుమార్.. 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. సత్పతి ధైర్య సాహసాలను గుర్తిస్తు ఆయనకు మరణానంతరం అశోకచక్ర ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

వెస్టిండీస్ తో టెస్ట్ సీరీస్ కైవసం చేసుకున్న భారత్

వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ ను భారత్ 2 – 0 తేడాతో గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మూడో రోజే భారత్ 10 వికెట్లతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా సీరీస్ ని సొంతం చేసుకుంది. 2013లోను ఇదే తరహాలో భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది.

  • సొంతగడ్డపై భారత్ కు 2013 నుంచి వరుసగా పదో సీరీస్ విజయం. దీంతో ఆస్ట్రేలియా పేరిట(రెండు సార్లు) ఉన్న సొంత గడ్డపై వరుసుగా అత్యధిక సీరీస్ ల విజయాన్ని భారత సమం చేసింది.

పేస్ జంటకు సాంటో డొమింగో ఓపెన్ టైటిల్

ఢిల్లీలో జరిగిన సాంటో డొమింగో ఓపెన్ టెన్నిస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మెక్సికోకు చెందిన వరేలా జంట విజయం సాధించింది. అక్టోబర్ 14న జరిగిన ఫైనల్లో బెహర్ (ఉరుగ్వే) – రొబెర్టో(ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది.

CSIR డైరెక్టర్ జనరల్ గా శేఖర్ మండె

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ – CSIR డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ శేఖర్ మండె నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు అక్టోబర్ 14న వెల్లడించింది. డిపార్టమెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసర్చ్ – DSIR కార్యదర్శిగాను ఆయన నియమితులయ్యారు.

  • 2018 ఆగస్టులో పదవి విరమణ పొందిన గిరీశ్ సాహ్ని స్థానంలో సీఎస్ఐఆర్ కొత్త డీజీగా డాక్టర్ శేఖర్ మండె బాధ్యతలు చేపడతారు.

  • కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ కేంద్రాన్ని 1942లో స్థాపించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది.

  • భారత ప్రధాన మంత్రి సీఎస్ఐఆర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.

సిక్కింకు ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డ్

దేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా నిలిచిన సిక్కింఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) అందించే ప్రతిష్టాత్మక ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డుకు ఎంపికైంది. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం విధానం పాటిస్తున్న ప్రపంచంలోని తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందినందుకు గాను సిక్కింకు ఈ అవార్డు ప్రకటించారు.

  • ఈ అవార్డుని ఎఫ్ఏఓ గోల్డ్ ప్రైజ్ గాను పిలుస్తారు.

  • FAO ను 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం రోమ్ లో ఉంది.

  • ఈ సంస్థలో ప్రస్తుతం 194 సభ్య దేశాలు ఉన్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments