☛ UNHRC ఎన్నికల్లో భారత్ గెలుపు
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో( United Nations Human Rights Commission ) సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలలో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 12న జరిగిన ఓటింగ్ లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరం కాగా… భారత్ కు 188 ఓట్లు వచ్చాయి. దీంతో.. 2019 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి భారత్ యూఎన్ హెచ్ఆర్సీలో సభ్య దేశంగా ఎంపికైంది. భారత్ తో పాటు మరో 18 దేశాలు కూడా ఎంపికయ్యాయి.
-
2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు UNHRCకి ఎంపికైంది.
-
UNHRC ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
-
ఈ సంస్థను 2006లో స్థాపించారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల రక్షణ కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.
☛ భారత్ లో రెండు టైమ్ జోన్లపై చర్చ
దేశంలో పరిస్థితులకు అనుగుణంగా రెండు ప్రత్యేక టైమ్ జోన్ ల ఆవశ్యకత ఉందని ఢిల్లీలోని CSIR-National Physcial Laboratory(NPL) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అంశంలో పరిశోధనలు జరిపిన సైంటిస్టులు… ఈశాన్య భారతంలోని అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
-
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం(IST) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. ఇది 1947 సెప్టెంబర్ 1న ఏర్పడింది.
-
అదే యూకేలోని గ్రీన్ విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కో ఆర్డినేటెడ్ యూనివర్సిల్ టైం (UCT) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్ విచ్ టైమ్ గా లెక్కిస్తున్నారు.
అధిక టైమ్ జోన్లు ఉన్న దేశాలు
ఫ్రాన్స్ – 12 టైమ్ జోన్లు
అమెరికా – 11 టైమ్ జోన్లు
రష్యా – 11 టైమ్ జోన్లు
బ్రిటన్ – 9 టైమ్ జోన్లు
ఆస్ట్రేలియా – 8 టైమ్ జోన్లు
☛ SCO సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్
తజకిస్థాన్ రాజధాని డుషన్‌బేలో అక్టోబర్ 12న జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల ప్రభుత్వ విభాగాధిపతుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సదస్సుకి భారత ప్రతినిధిగా హాజరైన సుష్మా మాట్లాడుతు… అభివృద్ధికి ఉగ్రవాదం అవరోధంగా నిలిచిందన్నారు. పారదర్శకత, సుపరిపాలన, ప్రాదేశిక సమైక్యత, సంప్రదింపులే ప్రాతిపదికగా దేశాల మధ్య కనెక్టివిటీని పెంచుకోవాలని పేర్కొంటూ… పరోక్షంగా చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కోసం ఇరు దేశాలు అనుసరిస్తున్న విధానాలని తప్పు పట్టారు.
-
చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ని 50 బిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్థాన్–చైనా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
☛ ఫ్రాన్స్ లో పర్యటించిన భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 12న ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు… రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు.
అనంతరం… రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే రఫేల్ యుద్ధ విమానాలను 2019లో భారత్‌కు సరఫరా చేయనున్నారు.
☛ పారా ఆసియా క్రీడాల్లో 9వ స్థానంలో భారత్
ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన 3వ పారా ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 13న జరిగిన చివరి రోజు పోటీల్లో రెండు స్వర్ణాలు కైవసం చేసుకొని… మొత్తంగా 72 పతకాల ( 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు)తో పారాక్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.
-
319 పతకాలతో(172 స్వర్ణాలు, 88 రజతాలు, 59 కాంస్యాలు) చైనా అగ్రస్థానంలో నిలవగా, 145 పతకాలతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 136 పతకాలతో ఇరాన్ మూడో స్థానంలో నిలిచాయి.
☛ హిందుస్తానీ సంగీత దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత
హిందుస్తానీ సంగీతంలో ప్రముఖ కళాకారిణి అన్నపూర్ణ(92) అక్టోబర్ 13న ముంబైలో కన్నుమూశారు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ ను అన్నపూర్ణ 1941లో వివహామాడారు. 1962లో విడాకులు తీసుకున్నారు. అనంతరం శిష్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. హిందుస్తాన్ సంగీతంలో ప్రముఖ కళాకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ అన్నపూర్ణ సోదరుడు.
-
1927లో మధ్యప్రదేశ్ లోని మైసూర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్. అప్పటి మైసూర్ మహరాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది.
-
హిందూస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణదేవిని భారత్ ప్రభుత్వం 1977లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.