Daily Current Affairs – October 08, 09 – 2018

జపాన్ గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్

జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేతగా మెర్సడిసీ జట్టు జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. అక్టోబర్ 7న జరిగిన 53 ల్యాప్ ల రేసుని గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేసి తొలిస్థానంలో నిలిచాడు. తద్వారా 2018 ఫార్ములా వన్‌ సీజన్ లో హామిల్టన్ 9 విజయాన్ని నమోదు చేశాడు.

 • ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు.

2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 7ఓ నివేదికను విడుదల చేసింది.

 • 2019-20, 2020-21లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని ముందస్తు అంచనాల్లో పేర్కొంది.

ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్-2018’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని అన్నారు. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్

నాగాలాండ్ గాంధీ కన్నమూత

నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా అసోంలోని గువాహటిలో ఆయన అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచారు.

 • నట్వర్ ఠక్కర్ 1932లో మహారాష్ట్రలో జన్మించారు.

 • 23 ఏళ్ల వయసులో నాగాలాండ్‌కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు.

 • చుచుయిమ్‌లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి విశేష కృషి చేశారు.

 • ఠక్కర్ చేసిన సేవలను గుర్తింపుగా ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది.

లక్నోలో ఐఐఎస్ఎఫ్ – 2018

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2018 (IISF – 2018) జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 6న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 • రాష్ట్రపతి మాట్లాడుతూదేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. పతిష్టాత్మక సీఎస్‌ఐఆర్‌లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమేఉన్నారని చెప్పారు.

 • కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి భారత్‌కి తిరిగి వచ్చారని రాష్ట్రపతి తెలిపారు.

హైదరాబాద్ లో క్వాల్కమ్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ క్వాల్కామ్తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం (క్యాంపస్)ను హైదరాబాద్‌లోని కోకాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 6న ప్రకటించింది. రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 5జీ మొబైల్ టెక్నాలజీపై పరిశోధనలు, పరీక్షలు నిర్వహిస్తారు. చనున్నారు.

 • ఈ క్యాంపస్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

 • అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా క్వాల్కమ్ పనిచేస్తోంది.

 • ఈ అభివృద్ధి కేంద్రం అమెరికా బయట ఉన్న క్యాంపస్‌లలో అతిపెద్ద క్యాంపస్ కానుందని ఆ సంస్థ పేర్కొంది.

ఆసియా కప్ అండర్-19 టైటిల్ విజేత భారత్

ఆసియా అండర్ – 19 కప్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్లో భారత జట్టు.. 144 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిటైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా భారత్ ఆసియా కప్ అండర్-19 టైటిల్‌ను ఆరోసారి గెలుచుకుంది.

 • ఈ టోర్నిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సిమ్రన్ సింగ్ వ్యవహరించాడు.

 • మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ను భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

 • భారత బౌలర్ హర్ష్ త్యాగికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.

జాతీయ టీటీ యూత్ చాంపియన్ గా ఆకుల శ్రీజ

జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) యూత్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కి చెందిన ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీజ…. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రాప్తి సేన్‌పై విజయం సాధించింది.

 • శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగింది.

ఏపీ సీఎం చంద్రబాబుకి గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు లభించింది. ఈ మేరకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. ఢిల్లీలో అక్టోబర్ 24న జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చంద్రబాబుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

 • ప్రభుత్వ పరంగా వ్యవసాయ విధానాలు, రైతులకు చేయూత, ప్రోత్సాహకాలు, పంటల అభివృద్ధి, పరిశోధన, సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్ వంటి అంశాల ఆధారంగా ఈ అవార్డుకు చంద్రబాబును స్వామినాథన్ కమిటీ ఎంపిక చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments