Daily Current Affairs – October 04, 05 – 2018

భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయ్

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రంజన్ గోగోయ్ సీజేఐ గా 13 నెలలపాటు అంటే.. 2019 నవంబర్ 17 వరకు ఉంటారు.

 • ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన మొదటి వ్యక్తి.. జస్టిస్ రంజన్ గోగోయ్.

 • 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్ లో రంజన్ గోగోయ్ జన్మించారు. 1978లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2001లో గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.

 • 45వ సీజేఐ దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2న రిటైర్ అయ్యారు.

యూఎస్ నూక్లియర్ వింగ్ చీఫ్ గా రీటా బరన్వాల్

అమెరికా అణుశక్తి విభాగం అధిపతిగా భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఈ పదవికి నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనలకు సెనేట్ ఆమోదం తెలిపితే రీటా బరన్వాల్.. ఇంధన విభాగం అసిస్టెంట్ సెక్రటరీ హోదా పొందుతారు.

 • ఈ బాధ్యతల్లో రీటా.. అణు సాంకేతిక పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తారు.

 • రీటా బరన్వాల్.. గతంలో అమెరికా నేవి రియాక్టర్లలో వాడే న్యూక్లియర్ ఎనర్జీ పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు.

 • మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్, మిషగాన్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పొందారు.

ఐసీఐసీఐ సీఈవో పదవికి చందా కొచ్చర్ రాజీనామా

ఐసీఐసీఐ సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చందా కొచ్చర్.. అక్టోబర్ 3న పదవికి రాజీనామా చేశారు. 2019 మార్చి 31 వరకు ఆమె పదవికాలం ఉన్నప్పటికీఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా చందా కొచ్చర్ తప్పుకున్నారు.

 • చందా కొచ్చర్ స్థానంలో సందీప్ బక్షి ఐసీఐసీఐ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.

 • వీడియోకాన్ గ్రూప్ నకు లంచం తీసుకొని రుణం మంజూరు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ పదవి నుంచి తప్పుకున్నారు. వీడియో కాన్ గ్రూప్ నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ గ్రూప్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచర్ కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు వచ్చాయి.

MSS DGగా ఎమ్మెస్సార్ ప్రసాద్

Missile and Strategic Systems(MSS) డైరెక్టర్ జనరల్ గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ నియమితులయ్యారు.

 • ప్రసాద్ఐఐటీ మద్రాస్ లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు.

 • 1964లో డీఆర్డీవోలో చేరారు. మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.

 • జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.

 • Missile and Strategic Systems.. రక్షణ రంగంలో కీలక విభాగం.

ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ – 2018లో ముకేశ్ నంబర్ వన్

భారత దేశంలో టాప్ – 100 బిలియనీర్స్ – 2018 పేరుతో ఫోర్బ్స్ మాగజైన్ వెలువరించిన జాబితాలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

 • 47.3 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు.

 • 21 బిలియన్ డాలర్ల సంపదతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ రెండో స్థానంలో ఉన్నారు.

 • 18.3 బిలియన్ డాలర్ల సంపదతో ఎర్సెల్లార్ మిట్టర్ చైర్మన్ అండ్ సీఈవో లక్ష్మీ మిట్టల్ మూడో స్థానంలో ఉన్మారు.

 • టాప్ – 100 జాబితాలో ముగ్గురు తెలుగు వారికి స్థానం దక్కింది. వారు.. మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి. రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పి.వి. రామ్ ప్రసాద్ రెడ్డి, దీవీస్ ల్యాబ్స్ చైర్మన్ మురళి.

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డ్స్ – 2018

స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేసిన వారికి విభాగాల వారీగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డులు – 2018ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 4న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.

అవార్డ గ్రహీతలు

ఉత్తమ రాష్ట్రం హరియాణా

ఉత్తమ జిల్లా సతారా జిల్లా, మహారాష్ట్ర

అత్యధిక మంది భాగస్వామ్యం ఉత్తరప్రదేశ్

 • జోనల్ వారీ ర్యాంకింగ్స్ లో దక్షిణభారతం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి.

 • స్వతంత్ర ఏజెన్సీ ద్వారా జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పాఠశాలల్లో పరిశుభ్రత, పౌరు భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించారు.

 • 2018 నుంచి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఈ అవార్డులను అందించటం ప్రారంభించింది.

డిప్యూటీ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ గా ఆర్.ఎన్.రవి

డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు)గా జాయింట్ ఇంటిలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్.ఎన్. రవి నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ అక్టోబర్ 4న వెల్లడించింది.

 • జాతీయ భద్రతా సలహాదారుగా ప్రస్తుతం అజిత్ దోవల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులు ఉన్నారు. ఈ నియామకంతో ఆర్.ఎన్. రవి మూడో వ్యక్తి అయ్యారు. మరో ఇద్దరు రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా, పంకజ్ శరణ్.

 • ఆర్.ఎన్.రవి 1976 ఐపీఎస్ బ్యాచ్ కేరళ క్యాడర్ కు చెందిన వారు.

ఇండోనేషియాకు సహాయంగా భారత్ ఆపరేషన్ సముద్ర మైత్రి

భూకంపం, సునామీతో కకావికలమైన ఇండోనేషియాకు తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు భారత్ ఆపరేషన్ సముద్ర మైత్రి చేపట్టింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత భారత ఈ ఆపరేషన్ ను ప్రారంభించింది.

 • ఆపరేషన్ లో భాగంగా భారత్ భారీ ఎత్తున ఆహార, ఔషధ, నిత్యావసర వస్తువులను ఇండోనేషియాకు పంపింది. రెండు C – 130J, C – 17 ఎయిర్ క్రాఫ్ట్ లు, మూడు నౌకల ద్వారా ఈ వస్తువులను పంపింది.

 • సెప్టెంబర్ 28న ఇండోనేషియాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ వల్ల వెయ్యి మందికిపైగా చనిపోయారు. లక్షల మంది నిరాశ్రులయ్యారు.

 • 2018లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాల్లో ఇదే అతిపెద్దది.

ISA తొలి అసెంబ్లీని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ (అంతర్జాతీయ సోలార్ కూటమి) తొలి అసెంబ్లీని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో.. సెకండ్ ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (IORA) పునరుత్పాదక ఇంధన మంత్రుల సమావేశం, 2వ గ్లోబల్ రీ ఇన్వెస్ట్ (RE – Invest) మీట్ అండ్ ఎక్స్ పోను ప్రధాని మోదీ ప్రారంభించారు.

 • పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రారంభమైంది. ఐఎస్ఏ కేంద్ర కార్యాలయం భారత్ లోని గురుగ్రామ్ లో ఉంది.

 • 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,000 గిగావాట్ల సోలార్ విద్యుత్ ని ఉత్పత్తి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఈ రంగంలోకి వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నది ఐఎస్ఏ లక్ష్యం.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments