Daily Current Affairs – October 02 – 2018

చార్మినార్.. భారత స్వచ్ఛ ఐకాన్

400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన చార్మినార్భారత స్వచ్ఛ ఐకాన్ గా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ కు స్వచ్ఛ ఐకాన్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ 4వ వార్షికోత్సవంలో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా జీహెచ్ఎంసీ అధికారులు అవార్డు అందుకున్నారు.

 • చారిత్రక కట్టడాల అభివృద్ధి, పునరుద్ధరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది.

సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని సమాచార హక్కు చట్టం(RTI) పరిధిలోకి తెస్తూ కేంద్ర సమాచార కమిషన్(CIC) అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. పలు చట్టాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక, జాతీయ క్రీడామంత్రిత్వశాఖ నిబంధనలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొనిఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (H) పరిధిలోకి బీసీసీఐ వస్తుందని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. దీని ప్రకారం ఇకపై పౌరులు ఎవరైనా ఆర్టీఐ కింద బీసీసీఐ సమాచారం కోరితే తప్పకుండా ఇవ్వాల్సిందే.

 • 2005 జూన్ 15 నుంచి దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది.

యూత్ ఒలంపిక్స్ లో భారత పతాకధారి.. మనూ భాకర్

భారత యువ షూటర్ మనూ భాకర్.. అరుదైన అవకాశం దక్కించుకుంది. అక్టోబర్ 6 నుంచి 18 వరకు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల ప్రారంభ వేడుకల్లో 68 భారత బృందానికి యువ షూటర్ మనూ భాకర్.. పతాకధారిగా వ్యవహరించనుంది.

 • యూత్ ఒలింపిక్స్ లో 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.

హాకీ ఇండియా అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్

హాకీ ఇండియా(HI)కి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముస్తాక్ అహ్మద్.. హెచ్ఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 1న జరిగిన ఎన్నికల్లో హెచ్ఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాజేంద్ర సింగ్ స్థానంలో ముస్తాక్ అహ్మద్ బాధ్యతలు చేపడతారు.

ఉపాధ్యక్షులుగా ఆసిమా అలీ, బోలానాథ్ సింగ్‌ కొత్త సెక్రటరీ జనరల్‌గా రాజీందర్ సింగ్‌.. కోశాధికారిగా తపన్ కుమార్ దాస్ నియమితులయ్యారు. మహిళల మాజీ కెప్టెన్ అసుంతా లక్రా, ఫిరోజ్ అన్సారీ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

హిమదాస్ IOCలో ఉద్యోగం

భారత స్ప్రింట్ సంచలనం హిమదాస్ కు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో భారత తరపున పాల్గొని.. సాధించిన ఘనతలకు గుర్తింపుగా తమ సంస్థలోని హెచ్ఆర్ విభాగంలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ఐఓసీ అక్టోబర్ 1న ప్రకటించింది. ఆమెకు భారీ వేతన భత్యాలతో పాటు పాల్గొనే ఈవెంట్లకు అయ్యే ప్రయాణ, బస ఖర్చులన్నింటినీ తమ సంస్థే భరిస్తుందని పేర్కొంది.

 • అస్సోంకు చెందిన హిమ దాస్ 2018 ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా 3 పతకాలు సాధించింది.

 • ఆమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను అర్జున అవార్డుతో సత్కరించింది.

 • హిమ దాస్ ను ధింగ్ ఎక్స్ ప్రెస్అని అభివర్ణిస్తారు.

ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఎం. రవికుమార్, బి.వి. రమణ కుమార్, కట్టా జనార్దనరావులు నియమితులయ్యారు. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం గవర్నర్ నరసింహన్ సూచించిన ఈ ముగ్గురి పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. అక్టోబర్ 1న నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వారు 5 ఏళ్లు కొనసాగుతారు.

భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య 17 ఒప్పందాలు

భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య అక్టోబర్ 117 ఒప్పందాలు కుదిరాయి. భారత పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్ కత్ మిర్జియోయెవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, విద్య, వైద్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో 17 ఒప్పందాలు జరిగాయి. అనంతరంఇరువురు నేతలు ఉమ్మడిగా సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాలు వివిధ అంశాల్లో పరస్పర సహకారంతో ముందు సాగుతాయని ప్రకటించారు.

దేశంలో సాగు భూమి 157.14 మిలియన్ హెక్టార్లు

2015-16లో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. దీని ప్రకారం 2010-11లో దేశంలో సాగు భూమి 159.59 మిలియన్ హెక్టార్లుగా ఉండగా… 2015-16 గణనలో అది 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది. అంటే.. 5 ఏళ్లలో 1.53 శాతం మేర సాగు భూమి తగ్గింది.

 • నివేదిక ప్రకారం.. దేశంలో కమతాల సంఖ్య 5.33 శాతం పెరిగింది.

 • ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కమతాలు ఉన్నాయి.

 • కమతాలు ఎక్కువగా పెరిగిన రాష్ట్రాల్లో.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

 • రాజస్తాన్ లో అత్యధిక సాగు భూమి ఉంది.

 • ఇక 2010-11 ప్రకారం వ్యవసాయంలో 12.79 శాతం మహిళా రైతులు ఉండగా.. 2015-16 నాటికి 13.87 శాతానికి చేరారు.

 • వ్యవసాయ గణన ప్రతి 5 ఏళ్లకోసారి చేపడతారు.

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గా గీతా గోపీనాథ్

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన ఆర్థిక వేత్తగా(Chief Economist) భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. 2018 చివర్లో పదవీ విరమణ పొందుతున్న ప్రస్తుత చీఫ్ ఎకనమిస్ట్ ఓస్ట్ ఫెల్ట్ స్థానంలో గీతా పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐఎంఎఫ్ అక్టోబర్ 1న వెల్లడించింది.

 • భారత్ లో పుట్టి పెరిగిన గీతా.. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 • ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి MA డిగ్రీలు పొందారు.

 • 2016లో గీతా.. కేరళ సీఎం పినరయి విజయన్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఇది వివాదాస్పదం కావడంతో.. బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments