☛ లైంగిక నేరస్తుల రిజిస్టర్ – NRSO ప్రారంభం
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు ఈ కేసుల్లో విచారణ వేగాన్ని పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (National Registry of Sexual Offenders – NRSO)ను ప్రారంభించింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు.
-
ఎన్ఆర్ఎస్ఓలో భాగంగా నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతి అంశాన్ని రిజిస్టర్ లో పొందుపరుస్తారు.
-
ఇందులో భాగంగా జాతీయ నేర గణాంకాల సంస్థ(National Crime Records Bureau – NCRB) దేశవ్యాప్తంగా జైలల్లో ఉన్న నేరస్తుల వివరాలు సేకరించింది.
-
2005 నుంచి నేరాలకు పాల్పడిన 4.40 లక్షల మంది నేరస్తుల వివరాలతో ఎన్ఆర్ఎస్ఓను ప్రారంభించారు. త్వరలో బాల నేరస్తులను కూడా ఇందులో చేరుస్తారు.
-
NCRB ని 1986 మార్చి 11న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది.
-
NCRB ప్రస్తుత డైరెక్టర్ – డాక్టర్ ఐష్ కుమార్, ఐపీఎస్
☛ ఆర్చరీ కోచ్ జీవన్ జ్యోత్ రాజీనామా
భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ జీవన్ జ్యోత్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ కోచ్ లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం “ద్రోణాచార్య” జాబితా నుంచి తన పేరుని తొలగించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవార్డుల సెలక్షన్ కమిటీ జీవన్ జ్యోత్ సింగ్ పేరుని నామినీల జాబితాలో చేర్చింది. అయితే.. కేంద్ర క్రీడా శాఖ ఆయన పేరుని ఎంపిక జాబితా నుంచి తొలగించింది.
☛ వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూత
వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 21న హనోయిలో కన్నుమూశారు. చికిత్స పొందుతు ఆయన కన్నుమూశారని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది.
-
ట్రాన్ డాయ్ క్వాంగ్ 2016లో వియత్నాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
-
వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
☛ “మద్యం” మరణాలు ఏటా 30 లక్షలు : WHO
2016లో మద్యం కారణంగా సంభవించే వ్యాధులు, సమస్యలతో 30 లక్షల మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 5.3 శాతమని వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 21న మద్యం మరణాల గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఈ 30 లక్షల మందిలో 75 శాతం మంది పురుషులేనని పేర్కొంది.
-
అలాగే… ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే ప్రతి 20 మరణాల్లో ఒక దానికి మద్యమే కారణమని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.
-
ఇదే సమయంలో ఎయిడ్స్ 1.8 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 2.5 శాతం, హిం స కారణంగా 0.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
-
యూరప్ తో పాటు భారత్, చైనాల్లో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
-
WHO ని 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
☛ రష్యా లక్ష్యంగా అమెరికా కాస్టా చట్టం
అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ – 400ను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రూపొందించిన కాస్టా ఆర్డర్ పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యాను లక్ష్యంగా చేసుకొని అమెరికా కాస్టా చట్టాన్ని తెచ్చింది.
-
రష్యా నుంచి ఎస్ – 400 ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించడమే కాస్టా ఆర్డర్.
-
భారత్ సైతం రష్యా నుంచి ఎస్ – 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
-
కాగా ఇప్పటికే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్ – 400 లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్ పూపై అమెరికా ఆంక్షలు విధించింది.
☛ రూ.750 ప్రీమియం.. ప్రమాద బీమా రూ.15 లక్షలు
వాహన బీమా కవరేజ్ మొత్తాన్ని భారీగా పెంచుతు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(Insurance Regulatory and Development Authority – IRDA) సెప్టెంబర్ 21న కీలక నిర్ణయం తీసుకుంది. ఓనర్ – కమ్ – డ్రైవర్ ల ప్రమాద బీమాను రూ.15 లక్షలకు పెంచింది. సంవత్సరానికి కేవలం రూ.750 ప్రీమియంతో ఈ పాలసీని పొందవచ్చు.
-
ఈ నిర్ణయాని కంటే ముందు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ద్విచక్ర వాహనాలకు రూ.1 లక్ష, కమర్షియల్ వాహనాలకు రూ.2 లక్షలుగా ఉండేది. దీనికి నెల వారీ ప్రీమియం ద్విచక్ర వాహనాలకు రూ.50, కమర్షియల్ వెహికల్స్ కు రూ.100 రూపాయలుగా ఉండేది.
-
IRDA 1999లో ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.
-
IRDA ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఖుంతియా
☛ సెయిల్ చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి
భారతీయ స్టీల్ అథారిటీ( Steel Authority of India – SAIL) చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. కేంద్ర నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 2018 జూన్ లో పదవీ విరమణ పొందిన పీకే సింగ్ స్థానంలో అనిల్ కుమార్ చౌదరి కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు. 2020 డిసెంబర్ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
SAIL ను 1974లో ఏర్పాటు చేశారు.
☛ యూఎన్ సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్లు
ఐక్యరాజ్య సమితి సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. న్యూయార్క్ లోని UN ప్రధాన కార్యాలయం ఆవరణపై సోలార్ ప్యానాళ్ల ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టే.. UN Solar Project.
-
2018 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో… ఐరాస బిల్డింగ్ పై సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్.. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయాన్ని కోరారు.
-
ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తొలి దేశం భారత్
☛ గగన్యాన్ మిషన్ కోసం షార్ లో 3వ లాంచ్ ప్యాడ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో .. గగన్యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తోంది. 2022లో చేపట్టే ఈ ప్రయోగం కోసం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్ లో 3వ లాంచ్ ప్యాడ్ ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రంలో ఉన్న రెండు ప్రయోగ వేదికలు నిండుగా ఉన్నందున… 3వ ప్రయోగ వేదిక ఏర్పాటు జరుగుతోంది. అలాగే… Small Satellite Launch Vehicles (SSLV) ప్రయోగం కోసం గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశంలో వేదికను ఏర్పాటు చేసేందుకు ఇస్త్రో కసరత్తు చేస్తోంది.
☛ మాదిరి ప్రశ్నలు
☛ లైంగిక నేరాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల NRSOను ప్రారంభించింది. దీనికి సంబంధించి కింది పేర్కొన్న స్టేట్ మెంట్స్ లో సరైన వాటిని గుర్తించండి…
a) NRSO – National registry of sexual offenders
b) ncrb 1982లో ఏర్పాటైంది
c)ncrb ప్రస్తుత డైరెక్టర్ డా. ఐష్ కుమార్
1) A, B, C
2) A, B
3) A, C
4) A ONLY
జవాబు: A, B
☛ రష్యా నుంచి ఎస్ – 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ఇటీవల తీసుకొచ్చిన చట్టం ఏది ?
-
పోస్కో చట్టం
-
కాస్టా చట్టం
-
ట్రపీజ్ యాక్ట్
-
జాబ్స్ యాక్ట్
జవాబు: కాస్టా చట్టం
☛ ఇటీవల వార్తల్లో నిలిచిన IRDA కు సంబంధించి కింది వాటిలో సరైన స్టేట్ మెంట్స్ ను గుర్తించండి…
A) IRDAను 1999లో ఏర్పాటు చేశారు
B) IRDA ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది
C)వాహన ప్రమాద బీమాను ఐఆర్ డీఏ ఇటీవల రూ.15 లక్షలకు పెంచింది
D)IRDA ప్రస్తుత చైర్మన్ సుభాష్ చంద్ర ఖుంతియా
-
A, B, C
-
A, C
-
A, B, C, D
-
A and D only
జవాబు: A, B, C, D
☛ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించి.. ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైన వాటిని గుర్తించింది ?
A) ప్రపంచ ఆరోగ్య సంస్థను 1947 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు
B) 2016లో మద్యం వల్ల 30 లక్షల మరణాలు సంభవించాయని WHO ఇటీవల వెల్లడించింది
-
A, B
-
A ONLY
-
B ONLY
-
NONE
జవాబు: A, B
☛ వియత్నాం రాజకీయాలకు సంబంధించి.. ఈ కింది వాటిలో సరైన స్టేట్ మెంట్స్ ను గుర్తించండి ?
A) వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ ఇటీవల కన్నుమూశారు
B) వియత్నాం ఏక పార్టీ దేశం
C)వియత్నాంలో బహుళ పార్టీలు ఉన్నాయి
1) A,B,C
2) A & B
3) B & C
4)NONE
జవాబు: A & B
☛ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేసిన జీవన్ జ్యోత్ సింగ్.. కింది వాటిలోని ఏ క్రీడకు సంబంధించిన వారు ?
-
క్రికెట్
-
ఫుట్ బాల్
-
ఆర్చరీ
-
బ్యాడ్మింటన్
జవాబు: ఆర్చరీ
☛ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఎన్ని ప్రయోగ వేదికలు ఉన్నాయి ?
-
ఒకటి
-
రెండు
-
మూడు
-
నాలుగు
జవాబు: రెండు
☛ UN Solar Project కోసం ఆర్థిక సాయాన్ని అందించిన మొదటి దేశం ఏది ?
-
అమెరికా
-
చైనా
-
జపాన్
-
భారత్
జవాబు: భారత్
☛ Steel Authority of India చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
-
అనిల్ కుమార్ చౌదరి
-
అనుబ్రాతా బిశ్వాస్
-
సంజయ్ మిత్రా
-
పంకజ్ షరన్
జవాబు: అనిల్ కుమార్ చౌదరి