Daily Current Affairs – MCQs – September 21 – 2018

విరాట్, మీరాలకు ఖేల్ రత్నఅవార్డు

కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ క్రీడా అవార్డులు – 2018ని సెప్టెంబర్ 20న అధికారికంగా ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 8 మంది కోచ్ లకు ద్రోణాచార్య, నలుగురికి జీవితకాల పురస్కారం, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డు ప్రకటించింది.

 • క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో క్రికెటర్ విరాట్ కోహ్లీ

 • తెలుగువారైన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణా చార్య అవార్డు దక్కింది.

 • తెలంగాణ డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

అవార్డు విజేతలు

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న : విరాట్ కోహ్లీ(క్రికెటర్), మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టర్)

ద్రోణాచార్య : ఆచయ్య కుట్టప్ప(బాక్సింగ్), విజయ్ శర్మ(వెయిట్ లిఫ్టింగ్), శ్రీనివాసరావు(టేబుల్ టెన్నిస్), సుఖ్ దేవ్ సింగ్(అథ్లెటిక్స్)

ధ్యాన్ చంద్ అవార్డు : సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ చెత్రీ(హాకీ), బాబి అలోయ్ సియన్(అథ్లెటిక్స్), చౌగలే దాడు దత్తాత్రేయ (రెజ్లింగ్).

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ : విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్), జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్, ఇషా ఔట్ రీచ్.

☛  లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు పోర్టల్ ప్రారంభం

చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా వేదిక కల్పించింది. cybercrime.gov.in పేరుతో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సెప్టెంబర్ 20న ఈ పోర్టల్ ను ప్రారంభించారు.

 • చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఎవరైనా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే వారు తమ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒక వేళ వెల్లడించినా.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

☛  ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా పురందేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి.. ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సెప్టెంబర్ 20న నియామ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు.

 • యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పురందేశ్వరి, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.

☛  2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు భారత జీడీపీ: మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీ మరో నాలుగేళ్లలో రెట్టింపు అవుతుందని ప్రకటించారు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (IICC) ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

 • రూ.25,706 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

☛ జపాన్ ప్రధానిగా మరో 3 ఏళ్ల పాటు షింజో అబే

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(LDP) అధ్యక్షుడిగా మరో 3 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో… 2021 ఆగస్టు వరకు ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగుతారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో 807 ఓట్లకు గాను అబేకు 553 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు వచ్చాయి.

 • విజయం తర్వాత షింజో అబే మాట్లాడుతూ.. ఇక తన కర్తవ్యం జపాన్ రాజ్యాంగాన్ని సవరించడమే అని ప్రకటించారు.

 • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించారు.

☛  ప్రహార్ క్షిపణి పరీక్ష విజయవంతం

స్వల్ప శ్రేణి క్షిపణి ప్రహార్ను భారత సెప్టెంబర్ 20న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి నిర్దేశిత 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది.

 • ఈ క్షిపణిని ఉపరితరం తలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.

 • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ – DRDO ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.

☛  ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో 130 కోట్ల మంది

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం(USDP).. ఆక్సఫర్డ్ పేదరిక, మానవ అభివృద్ధి కార్యక్రమం(OPHI) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ మేరకు “2018 – ప్రపంచ బహుల పరిమాణ పేదరిక సూచి – MPI” ని సెప్టెంబర్ 20న విడుదల చేశాయి.

 • నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారత్ లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

 • ఈ పదేండ్లలో భారత్ లో పేదరికం రేటు 55 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోయింది.

 • పేదరిక నిర్మూలనలో కాలక్రమేణా పురోగతి సాధించిన మొదటి దేశం భారత్ అని నివేదిక పేర్కొంది.

☛ ఇస్రోతో కేంద్రం ఒప్పందం

అత్యాధునిక అత్యవసర ప్రతిస్పందన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖ.. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రోతో సెప్టెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుంది. దేశ అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ అంశంలో కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇస్రో అందిస్తుంది. ఏడాదిన్నరలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

మాదిరి ప్రశ్నలు

దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన ఏవి ?

a) 1998లో సచిన్ టెండూల్కర్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు

b) 2008లో మహేంద్ర సింగ్ ధోని ఖేల్ రత్న అవార్డుని అందుకున్నారు

c)2018లో విరాట్ కోహ్లీ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు

 1. A, B, C

 2. A only

 3. C only

 4. B only

జవాబు: A, B, C

చైల్డ్ పోర్నో గ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవల ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది.

 1. cybercrime.gov.in

 2. cyber.nic.in

 3. complaintonline.gov.in

 4. mha.cyber.gov.in

జవాబు: cybercrime.gov.in

ఇటీవల ఎయిరిండియా స్వతంత్ర డైరెక్టర్ గా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి.. ఎన్నేళ్లు ఈ పదవిలో ఉంటారు ?

 1. ఏడాది పాటు

 2. 2 ఏళ్లు

 3. 3 ఏళ్లు

 4. 5 ఏళ్లు

జవాబు: 3 ఏళ్లు

2022 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు ?

 1. 5 లక్షల కోట్ల డాలర్లు

 2. 15 లక్షల కోట్ల డాలర్లు

 3. 2.5 లక్షల కోట్ల డాలర్లు

 4. 7 లక్షల కోట్ల డాలర్లు

జవాబు: 5 లక్షల కోట్ల డాలర్లు

ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి

a) జపాన్ ప్రధాని షింజో అబే

b) జపాన్ రాజ్యాంగాన్ని 1947లో రూపొందించారు

c)జపాన్ అధికార పార్టీ ఎన్నిఅధ్యక్ష ఎన్నికల్లో షింజో అబే ఓడిపోయారు

 1. A, B, C

 2. A & B only

 3. A & C only

 4. B & C only

జవాబు: A & B only

భారత్ ఇటీవల ప్రహార్ స్వల్ప శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు ?

 1. ఉపరితలం నుంచి గగనతలానికి

 2. ఉపరితలం నుంచి ఉపరితలానికి

 3. గగనతలం నుంచి గగనతలానికి

 4. గగనతలం నుంచి ఉపరితలానికి

జవాబు: ఉపరితలం నుంచి ఉపరితలానికి

USDP, OPHI ఇటీవల విడుదల చేసిన “2018 – ప్రపంచ బహుల పరిమాణ పేదరిక సూచి – MPI” నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారత్ లో ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ?

 1. 35 కోట్ల మంది

 2. 27 కోట్ల మంది

 3. 40 కోట్ల మంది

 4. 50 కోట్ల మంది

జవాబు: 27 కోట్ల మంది

అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణలో అత్యవసర ప్రతిస్పందనలో సాంకేతిక సహకారం కోసం కేంద్ర హోంశాఖ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

 1. డీఆర్డీవో

 2. హెచ్ఏఎల్

 3. ఇస్రో

 4. ఐఐసీటీ

జవాబు: ఇస్రో

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments