☛ “ట్రిపుల్ తలాక్” ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 19న ఆమెదం తెలిపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిపై సంతకం చేయటంతో వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యింది. దీని ప్రకారం ముస్లింలకు తక్షణ విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే భర్తకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
-
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చింది. ఇది లోక్ సభ ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్ లో ఉంది.
-
తక్షణ ట్రిపుల్ తలాక్ ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లో కూడా ట్రిపుల్ తలాక్ పై నిషేధం ఉంది. పాకిస్తాన్ లో 1961లో చేసిన చట్టం ద్వారా ట్రిపుల్ తలాక్ ను నిషేధించారు.
-
భారత్ లో ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం షయారా బానో 2015లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇష్రత్ జహాన్, ఆప్రీన్ రెహ్మాన్, ఫరా ఫైజ్, అతియా సాబ్రీ, గుల్షన్ పర్వీన్ కూడా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాడారు.
☛ హైదరాబాద్ లో గర్భస్థ శిశువుకు గుండె శస్త్రచికిత్స
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రి వైద్యులు గర్భంలోని శిశువుకి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్రసాదించారు.
☛ పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ చెల్లింపులు చేయడంలో ఆలస్యం జరిగితే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 19న మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని ఆయా రాష్ట్రాలకు పంపింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి.
-
సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలకు ఆదేశం.
-
కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసిన కేంద్రం.
-
రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది.
-
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులు ఖరీఫ్ బీమా ప్రీమియంలో కేవలం 2 శాతం, రబీ ప్రీమియంలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
☛ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు
అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఆయన కూతురు మర్యం, అల్లుడు మహ్మద్ సఫ్దార్ ల జైలు శిక్షలను నిలిపివేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. వారు ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు.
☛ మోర్ ఇకపై అమెజాన్ చేతుల్లోకి
అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్ లో సుప్రసిద్ధ ఆఫ్ లైన్ రీటైల్ మార్కెట్ మోర్ ను కొనుగోలు చేస్తోంది. సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కలిసి మోర్ ను చేజిక్కించుకోనుంది. ఈ మేరకు సమర సంస్థతో మోర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.4,200 కోట్లు.
-
మోర్ కు దేశవ్యాప్తంగా 509 బ్రాండెడ్ సూపర్ మార్కెట్లు, 20 హైపర్ మార్కెట్లు ఉన్నాయి.
-
గతంలో త్రినేత్ర సూపర్ మార్కెట్ బ్రాండ్ నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్ గా నామకరణం చేసింది.
☛ “స్వయం ప్రభ“ద్వారాఫోన్లోజేఈఈ, నీట్ పాఠాలు
జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్, నీట్ పాఠ్యాంశాలతో ఐఐటీ ఆచార్యులు రూపొందించిన పాఠాలను నేరుగా విద్యార్థులకు అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ “స్వయం ప్రభ” పేరుతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఐటీ ఢిల్లీ నేతృత్వంలో 600 పాఠాలు తయారు చేశారు. వాటిని యాప్ లో పొందుపరిచారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను ఉచితంగా డౌన్ లోడు చేసుకోవచ్చు.
-
స్వయం ప్రభ పేరిట 2017లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఛానెళ్లను ప్రారంభించింది. ఇటీవల స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరగటంతో.. యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
-
పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నెలకొల్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్ సైట్ WWW.NTA.AC.IN లోను పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
☛ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ(100) సెప్టెంబర్ 19న అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా పామర్రులో జన్మించిన ఆమె.. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
-
ఆమె భర్త నక్సల్ బరీ కీలక నేత కొండపల్లి సీతారామయ్య
-
స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ పామర్రు సందర్శించినప్పుడు కోటేశ్వరమ్మ తన నగలన్నింటినీ విరాళంగా ఇచ్చారు.
-
తెలంగాణ సాయుధ పోరాటంలో 3 ఏళ్ల పాటు అజ్ఞానంతో ఉన్నారు.
-
నక్సల్ బరీ ఉద్యమంలో తన కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ ను పోగొట్టుకున్నారు.
-
92 ఏళ్ల వయసులో తన జీవిత విశేషాలతో “నిర్జన వారధి” పుస్తకాన్ని రచించారు.
☛ భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు AVIAINDRA – 2018 ప్రారంభం
AVIAINDRA – 2018 పేరుతో భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యాయి. రష్యాలోని లిపెట్స్ క్ లో జరుగుతున్న ఈ విన్యాసాలు సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయి. రెండో విడత విన్యాసాలు 2018 డిసెంబర్ 10 నుంచి 22 వరకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతాయి.
-
AVIAINDRA పేరుతో భారత్, రష్యా వైమానిక సంయుక్త విన్యాసాలు తొలిసారి 2014లో జరిగాయి. అప్పటి నుంచి ఏటా రెండు సార్లు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
☛ మాదిరి ప్రశ్నలు
☛ ట్రిపుల్ తలాక్ కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి ?
A) ట్రిపుల్ తలాక్ రాజ్యంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు ప్రకటించింది
B) ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది
C)ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ 2018 సెప్టెంబర్ 19న జారీ అయ్యింది
-
A Only
-
B only
-
A, B, C
-
A & C only
జవాబు: A, B, C
☛ దేశంలోనే తొలిసారిగా కింది వాటిలోని ఏ నగరంలో గర్భస్థ శిశువుకి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు ?
-
కోల్ కతా
-
హైదరాబాద్
-
విజయవాడ
-
బెంగళూరు
జవాబు: హైదరాబాద్
☛ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ప్రీమియంలో రైతు తన వాటాగా ఎంత శాతం చెల్లించాల్సి ఉంటుంది ?
-
1 శాతం
-
2 శాతం
-
1.5 శాతం
-
3 శాతం
జవాబు: 2 శాతం
☛ ఈ కింది వారిలో ఇటీవల జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఎవరు ?
-
నవాజ్ షరీఫ్
-
ఇమ్రాన్ ఖాన్
-
ఆరీఫ్ అల్వీ
-
హఫీజ్ సయీద్
జవాబు: నవాజ్ షరీఫ్
☛ మోర్ సూపర్ మార్కెట్ సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మండ్ ఫండ్ ఏ సంస్థతో కలిసి కొనుగోలు చేయనుంది ?
-
ఫ్లిప్ కార్ట్
-
అమెజాన్
-
గూగుల్
-
వాల్ మార్ట్
జవాబు: అమెజాన్
☛ జేఈఈ, నీట్ తదితర పరీక్షల సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన యాప్ ఏది ?
-
స్వయం ప్రభ
-
స్వయం శిక్షా
-
స్వయం అభియాన్
-
స్వయం విద్యా
జవాబు: స్వయం ప్రభ
☛ ఈ కింది వారిలో “నిర్జన వారధి” పుస్తక రచయిత ఎవరు ?
-
సుంకిరెడ్డి నారాయణరెడ్డి
-
సుద్దాల అశోక్ తేజ
-
కొండపల్లి కోటేశ్వరమ్మ
-
గోరటి వెంకన్న
జవాబు: కొండపల్లి కోటేశ్వరమ్మ
☛ AVIAINDRA – 2018 పేరుతో భారత్, రష్యా వాయుసేన సంయుక్త సైనిక విన్యాసాలను తొలిసారి ఎప్పుడు నిర్వహించారు ?
-
2014
-
2016
-
2018
-
2017
జవాబు: 2014