☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం
భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ నిర్మాణ పనులని ప్రారంభించారు.
-
ఈ పైప్ లైన్ ద్వారా భారత్ నుంచి బంగ్లాకు ఆయిల్ ను సరఫరా చేస్తారు. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ను సరఫరా చేసే సామర్థ్యం ఉంటుంది.
-
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ జిల్లాలోని పర్సతిపూర్ ను ఈ పైప్ లైన్ అనుసంధానం చేస్తుంది.
☛ ద్యుతీచంద్ పై పుస్తకం రాయనున్న సందీప్ మిశ్రా
భారత స్ట్రింటర్ ద్యుతీ చంద్ ఆత్మకథను జర్నలిస్ట్ సందీప్ మిశ్రా పుస్తకం రూపంలో తీసుకొస్తున్నారు. పరుగు కోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లను వివరిస్తూ పుస్తకం రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పేదరికాన్ని జయించి ట్రాక్ పై పరుగు అందుకున్న ఒడిశాకు చెందిన ద్వితీ చంద్ లో పురుష లక్షణాలున్నాయని నిషేధం విధించారు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ కి దూరమయ్యారు. ఆ తర్వాత నిషేధంపై అర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది.
-
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ చంద్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రెండు రజతాలు నెగ్గింది.
-
ఒడిశాలో పుట్టిన ద్యుతీ చంద్, హైదరాబాద్ లో పెరిగింది.
☛ హిమదాస్ కు అడిడాస్ స్పాన్సర్ షిప్
భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్ షిప్ చేయనుంది. అస్సాం కు చెందిన హిమదాస్ తో అడిడాస్ సంస్థ సెప్టెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకుంది.
-
హిమదాస్ భారత్ ప్రముఖ అథ్లెట్లలో ఒకరు.
-
ఫిన్ లాండ్ లో జరిగిన అండర్ – 20 ఛాంపియన్ షిప్ లో ఆమె బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది.
-
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది.
-
ఈ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ ఆమె కోసం ప్రత్యేకంగా షూస్ ను తయారు చేసింది. ఒక బూటుపై హిమదాస్ అని.. ఇంకో బూటుపై క్రియేటివ్ హిస్టరీ అని ముద్రించింది.
☛ 4 గంటల్లో 2 కేజీలు తగ్గిన మేరీ కోమ్
5 సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్.. తానేంటో మరోసారి నిరూపించారు. 48 కేజీల కేటగిరీలో పోటీ పడేందుకు 4 గంటల్లో 2 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోలాండ్ లో జరిగిన బాక్సింగ్ చాంపియన్ షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి మేరీకోమ్ బరువు 50 కేజీల బరువు ఉంది. వేయింగ్ కి మరో 4 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. బరువు తగ్గాలని నిశ్చయించుకున్న ఆమె… ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. సరిగ్గా వేయింగ్ సమయానికి 2 కేజీలు తగ్గి 48 కేజీలకు వచ్చి… పోటీకి అర్హత సాధించింది. తద్వారా సునాయాసంగా గెలిచి.. స్వర్ణం సాధించింది.
-
మణిపూర్ కు చెందిన మేరీ కోమ్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి మహిలా బాక్సర్ గా రికార్డు సృష్టించింది.
-
2018 కామన్ వెల్త్ గేమ్స్ లోను స్వర్ణం గెలిచి రికార్డు నమోదు చేసింది.
-
2016 ఏప్రిల్ లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మేరీ కోమ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు.
-
2017లో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ.. మేరీ కోమ్ ను జాతీయ బాక్సింగ్ పరీశలకురాలిగా నియమించింది.
-
2003లో అర్జున అవార్డు, 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు.
☛ కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ – 2018
కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ (అభివృద్ధి నిబద్ధత సూచీ) – 2018లో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాల ఆధారంగా చేసుకొని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ (CGD) 27 ధనిక దేశాలతో ఈ జాబితాను విడుదల చేసింది.
-
ఈ జాబితాలో స్వీడన్ తర్వాత 2వ స్థానంలో డెన్మార్, 3వ స్థానంలో జర్మనీ, ఫిన్లాండ్ సంయుక్తంగా నిలిచాయి.
-
అమెరికా 23వ స్థానంలో ఉంది.
-
27వ స్థానంలో జపాన్ ఉంది.
☛ చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకం విధించిన ట్రంప్
అమెరికా, చైనా మధ్య మొదైలన వాణిజ్య యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. సుంకాల పెంపుతో వాణిజ్య పోటీకి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… మరోసారి సుంకాల విధించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు (TARRIF) విధించారు. 2018 చివరి నాటికి ఈ మొత్తాన్ని 25 శాతానికి పెంచనున్నారు. దీనికి ప్రతీకార చర్యగా చైనా సైతం అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.
-
చైనాకు చెందిన 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా గతంలోనే సుంకం విధించింది.
-
దీంతో చైనా సైతం అదే స్థాయిలో అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించింది.
☛ భారత తొలి ఐఏఎస్ మహిళా అధికారిణి అన్నా రాజం కన్నుమూత
స్వతంత్ర భారత దేశ ప్రథమ మహిళా IAS అధికారిణి అన్నా రాజం మల్హోత్రా (91) ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 18న ముంబై సబర్బణ్ అంధేరీలో ని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
-
అన్నా రాజం 1927 జులైలో కేరళలో జన్మించారు. ఉన్నత విద్యను మద్రాస్ లో అభ్యసించారు.
-
1951లో అన్నా రాజం భారత సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. మద్రాస్ కేడర్ ను ఎంపిక చేసుకున్నారు. అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి సి. రాజగోపాలచారి ప్రభుత్వంలో అధికారిణిగా పనిచేశారు.
-
అన్నా రాజం భర్త ఆర్ ఎన్ మల్హోత్రా. ఆయన 1985 నుంచి 1990 వరకు భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు.
☛ తొలి హైడ్రోజన్ రైలుని ప్రారంభించిన జర్మనీ
ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలుని జర్మనీ సెప్టెంబర్ 17న ప్రారంభించింది. ఫ్రెంచ్ టీజీవీ గ్రూప్ ఈ రైలుని తయారు చేసింది. 100 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను నడపాలని జర్మనీ నిర్ణయించింది.
-
ఎలక్ట్రిక్ ట్రాక్ వ్యవస్థ లేని చోట డీజిల్ రైళ్ల స్థానంలో వీటిని వినియోగిస్తారు.
-
హైడ్రోజన్ రైళ్ల నుంచి ఎలాంటి కర్బణ ఉద్గారాలు విడుదల కావు. అందుకే వీటిని పర్యావరహణ హితమైనవిగా గుర్తిస్తారు.
-
హైడ్రోజన్ రైళ్లలో ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. ఇవి.. హైడ్రోజన్ ను ఆక్సిజన్ తో అనుసంధానించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రైళ్లు నడుస్తాయి.
☛ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్
ప్రముఖ శాస్త్రవేత్త, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్.. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(DAE) కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. 2021 మే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
ప్రస్తుత చైర్మన్ శేఖర్ బసు స్థానంలో కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ బాధ్యతలు చేపడతారు. శేఖర్ బసు 2015 అక్టోబర్ లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2018 సెప్టెంబర్ తో ఆయన పదవికాలం ముగిసింది.
-
కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందారు.
-
అణు పరిశోధన రంగంలో సేవలకు గాను కమ్లేశ్.. 2011లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ నుంచి ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు, 2006లో హోమీ బాబా సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు పొందారు.
-
అటామిక్ ఎనర్జీ కమిషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నింగ్ బాడీ. ఇది నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు.
☛ 5 రాష్ట్రాల్లో 33.5 మిలియన్ డాలర్లతో వ్యవసాయ పథకం
జీవవైవిధ్యం, అటవీ భూములను రక్షించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో… కేంద్ర వ్యవసాయ శాఖ, ఐరాస అనుబంధ సంస్థ FAO 5 రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాన్ని ప్రారంభించాయి. మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి.
-
పథకం అమలు కోసం 33.5 మిలియన్ డాలర్ల నిధులను గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ(GEF) గ్రాంట్ గా ఇచ్చేందుకు అంగీకరించింది. GEF ను 1992లో రియో ఎర్త్ సమ్మిట్ లో ఏర్పాటు చేశారు. పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టుల అమలు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
-
FAO – Food and Agriculture Organisation
☛ మాదిరి ప్రశ్నలు
భారత – బంగ్లాదేశ్ మధ్య నిర్మించనున్న ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ భారత్ లోని ఏ రాష్ట్రం నుంచి మొదలవుతుంది ?
-
పశ్చిమ బెంగాల్
-
ఒడిశా
-
అస్సోం
-
మిజోరం
జవాబు: పశ్చిమ బెంగాల్
భారత్ కు చెందిన ప్రముఖ అథ్లెట్ ద్యుతీ చంద్ కింది వాటిలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
-
ఆంధ్రప్రదేశ్
-
తెలంగాణ
-
ఒడిశా
-
తమిళనాడు
జవాబు: ఒడిశా
కింద పేర్కొన్న భారత అథ్లెట్లలో ఎవరికి ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్ షిప్ అందిస్తోంది ?
-
నీరజ్ చోప్రా
-
హిమ దాస్
-
పీవీ సింధు
-
సీమా పునియా
జవాబు: హిమదాస్
భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కు సంబంధించి.. ఈ కింది పేర్కొన్న అంశాల్లో ఏవి సరైనవి ?
a) మేరీ కోమ్ 5 సార్లు ప్రపంచ బాక్సింగ్ విజేత
b) మేరీ కోమ్ ఖేల్ రత్నా పురస్కారం పొందారు
-
A Only
-
B Only
-
A & B
-
None
జవాబు: A Only
సెంటర్ ఫర్ గ్లోబల్ డెవల్ మెంట్ ఇటీవల 27 దేశాలతో విడుదల చేసిన కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ – 2018లో ఆఖరి స్థానంలో నిలిచిన దేశం ఏది ?
-
అమెరికా
-
జపాన్
-
స్వీడన్
-
జర్మనీ
జవాబు: జపాన్
అమెరికా ఇటీవల ఏ దేశంపై విధించిన సుంకాలు.. ప్రపంచ దేశాలపై ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి ?
-
భారత్
-
చైనా
-
రష్యా
-
జపాన్
జవాబు: చైనా
ఈ కింది వారిలో స్వతంత్ర భారత దేశ ప్రథమ మహిళా ఐఏఎస్ అధికారిణి ఎవరు ?
-
కల్పనా చావ్లా
-
సౌమ్యా స్వామినాథన్
-
అన్నా రాజం మల్హోత్రా
-
విజయ లక్ష్మీ పండిట్
జవాబు: అన్నా రాజం మల్హోత్రా
కింది వాటిలోని ఏ దేశంలో ఇటీవల ప్రపంచంలోని తొలి హైడ్రోజన్ రైలుని ప్రారంభించింది ?
-
చైనా
-
జపాన్
-
జర్మనీ
-
భారత్
జవాబు: జర్మనీ
అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
-
కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్
-
శేఖర్ బసు
-
శివన్
-
సత్తీశ్ రెడ్డి
జవాబు: కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్
దేశంలోని 5 రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ, UNO అనుబంధ సంస్థ FAO కలిసి అమలు చేయనున్న వ్యవసాయ పథకానికి గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ ఎన్ని మిలియన్ డాలర్ల గ్రాంట్ ని అందించనుంది ?
-
33.5 మిలియన్ డాలర్లు
-
20 మిలియన్ డాలర్లు
-
100 మిలియన్ డాలర్లు
-
500 మిలియన్ డాలర్లు
జవాబు: 33.5 మిలియన్ డాలర్లు