Daily Current Affairs, January 02 – 04, 2019

అనిన్దింతా నియోగి అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు

కటక్ కు చెందిన ప్రముఖ నృత్య కారిణి అనిన్దింతా నియోగ్ అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు దక్కింది. జనవరి 3న జరిగిన 10వ కటక్ మహోత్సవ్ లో భాగంగాఆమెకు ఈ అవార్డుని ప్రదానం చేశారు.

 • కటక్ మహోత్సవ్ అనేది అంతర్జాతీయ నృత్య, సంగీత ఉత్సవం.

 • కటక్ నృత్య అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను అనిన్దింతా కు ఈ అవార్డు ఇచ్చారు.

Green Ag కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం

వ్యవసాయం విధానంలో మార్పుల ద్వారా పర్యావరణం, జీవావరణ అభివృద్ధి, అటవీ రక్షణ వంటి లక్ష్యాలను సాధించడం కోసం భారత ప్రభుత్వం గ్రీన్ ఆగ్ (Green Ag) అనే కార్యక్రమాన్ని జనవరి 2న ప్రారంభించింది. గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ (GEF) సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

 • ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ (FAO) ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుంది.

 • కొండ ప్రాంతాలు అధికంగా ఉన్న మధ్యప్రదేశ్ లోని చంబల్, మిజోరంలోని డంపా, ఒడిశాలోని సిమిలాపాల్, రాజస్థాన్ లోని డెజర్ట్ నేషనల్ పార్క్ లాండ్ స్కేప్, ఉత్తరాఖాండ్ లోని కార్బెట్ రాజాజీ లాండ్ స్కేప్ లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

6 చారిత్రక కట్టడాలకు జాతీయ ప్రాముఖ్యత

The Archaeological Survey of India (ASI)… దేశంలోని 6 చారిత్రక కట్టడాలను 2018లో జాతీయ ప్రాముఖ్యత ఉన్న కట్టడాలుగా గుర్తించింది.

 • మహారాష్ట్ర నాగపూర్ లోని పాత హైకోర్టు బిల్డింగ్

 • ఆగ్రాలోని హవేలీ ఆఫ్ అగా ఖాన్

 • ఆగ్రాలోని హవేలీ ఆఫ్ హాథి ఖానా

 • రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని నీమ్రన్ బావోరి

 • ఒడిశా బొలంగిర్ జిల్లాలోని రాణిపూర్ ఝారాల్లి దేవాలయాల సమూహం

 • ఉత్తరాఖండ్ పిథోరాఘర్ జిల్లా కొటాలిలోని విష్ణు దేవాలయం

చారిత్ర ఆనవాళ్లు, కట్టడాలు ఉన్న ప్రాంతం, దాని సంరక్షణకు చేపట్టిన చర్యల ఆధారంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడాలను గుర్తిస్తారు.

 • The Ancient Monuments and Archaeological Sites and Remains Act, 1958

సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు

దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ 2018 డిసెంబర్ 30న పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ అరుణ్ మిశ్రా కొలిజియంలోకి వచ్చారు.

 • 2018, నవంబర్ 30న జస్టిస్ కురియన్ జోసెఫ్ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ ఎన్‌వీ రమణ కొలీజియంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

 • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ ప్రకారం తొలి ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలిజియంలో ఉంటారు.

BOB, విజయ, దేనా బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 2న ఆమోదం తెలిపింది. 2019, ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

 • ఈ విలీనంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది.

 • విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది.

కొలువుదీరిన తెలంగాణ, ఏపీ హైకోర్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు కొలువుదీరాయి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హైకోర్టును ప్రారంభించారు.

 • ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

 • 1961, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ జన్మించారు. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్‌కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2012, జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2013, డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తెలంగాణ కొత్త హైకోర్టు

తెలంగాణ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టులో తన సహచర న్యాయమూర్తులు 12 మందితో రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.

సీసీఐ కార్యదర్శిగా పి.కె. సింగ్

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) కొత్త కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్‌ను నియమించినట్లు జనవరి 1న సీసీఐ తెలిపింది. ఇప్పటివరకు సీసీఐ న్యాయసలహాదారుగా పి.కె.సింగ్ వ్యవహరించారు. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగంలో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులు, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు వంటి వాటిని సీసీఐ నియంత్రిస్తుంది.

సచిన్ కోచ్ అచ్రేకర్ కన్నుమూత

ప్రముఖ క్రికెట్ కోచ్, సచిన్ టెండూల్కర్ గరువు రమాకాంత్ అచ్రేకర్(87)అనారోగ్యంతో ముంబైలో జనవరి 2న కన్నుమూశారు. ఆటగాడిగా తన కెరీర్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను అచ్రేకర్ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్‌బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.

 • అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన వారిలో సచిన్ టెండూల్కర్‌తోపాటు వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ దిఘే, బల్వీందర్ సింగ్ సంధూ, చంద్రకాంత్ పండిత్, అజిత్ అగార్కర్, రమేశ్ పొవార్ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు.

జలంధర్ లో 106వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు.

 • ఫ్యూచర్ ఇండియా: సైన్స్‌ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా 5 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

 • ఈ కాంగ్రెస్‌కు దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది పాల్గొననున్నారు. వీరిలో నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

 • దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే ఉద్దేశంతో ఏటా జనవరిలో సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.

చంద్రుడి చీకటి ప్రాంతాన్ని చేరుకున్న చైనా స్పేస్ క్రాఫ్ట్

చైనా 2018 డిసెంబర్ 7న ప్రయోగించిన ‘ది చాంగ్ ఈ – 4’ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై విజయంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే ‘ఐన్‌క్యూన్’ బేసిన్‌లో 2019 జనవరి 3న చాంగ్ ఈ-4 దిగినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది.

 • చంద్రుడి దక్షిణ దృవానికి(చంద్రుడికి అవతలి వైపు చీకటి ప్రాంతం) చేరుకున్న మొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా చాంగ్ ఈ-4 నిలిచింది.

 • చంద్రుడిపై ఉండే అత్యల్ప గురుత్వాకర్షణ వాతావరణంతో పాటు చంద్రుడి ధృవాలు, నీటి లభ్యతపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనలు చేయనుంది.

సులభతర వాణిజ్యంలో ఏపీకి అగ్రస్థానం

సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. వర్సిటీకి చెందిన ఆసియా కాంపిటీటివ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్(ఏసీఐ) కోడెరైక్టర్ టాన్ ఖీ జియాప్ జనవరి 3న ఒక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటిస్థానంలో ఉండగా మహారాష్ట్ర, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణ 9వ స్థానంలో ఉంది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments