☛ స్మృతి మందనకు ఐసీసీ అవార్డ్ – 2018
భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2018 సంవత్సరానికిగాను “ఉత్తమ మహిళా క్రికెటర్”, “వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్” అవార్డులు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ డిసెంబర్ 31న ఐసీసీ అవార్డులు ప్రకటించారు.
-
భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి (2007)లో ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’దక్కించుకుంది.
-
దీంతో ఈ అవార్డు గెలుచుకున్న రెండో భారత మహిళా క్రికెటర్‌గా 22 ఏళ్ల స్మృతి రికార్డులకెక్కింది.
-
2018లో స్మృతి 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్ రేట్ 130.67) చేసింది.
-
ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్’ అవార్డు దక్కింది.
-
‘ఐసీసీ టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’ కెప్టెన్‌గా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రపంచ వన్డే జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ఎంపికయ్యారు.
☛ గిన్నిస్ బుక్ లో తెలంగాణ MNJ ఆసుపత్రి
హైదరాబాద్ లోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి MNJ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ అరుదైన గుర్తింపు సాధించింది. ప్రొస్టేట్ క్యాన్సర్ పై ఒకే రోజు ఎక్కువ మంది పురుషులకు అవగాహన కల్పించినందుకు గాను MNJ ఆసుపత్రి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో కెక్కింది.
-
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కడం ఇదే తొలిసారి.
-
హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి కూడా ఎంఎన్‌జే ఆసుపత్రికి గుర్తింపు లభించింది.
☛ జీహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు – 2018
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుంది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధాని నగరంగా నిలిచింది. ఈ మేరకు స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకింగ్స్ ను డిసెంబర్ 31న ప్రకటించారు. మొత్తంగా దేశంలోని 4,041 నగరాల్లో హైదరాబాద్ 27వ స్థానంలో నిలిచింది. రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది.
☛ ఆంధ్రప్రదేశ్ లో “తల్లి సురక్ష” పథకం
ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లి సురక్ష“’ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో డిసెంబర్ 30న ప్రారంభించారు. ఏపీ – 108 మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా సహజ ప్రసవానికి రూ.8 వేలు, సిజేరియన్‌కు రూ.14,500 అందిస్తారు. ఇందుకోసం రూ.500కోట్లు వెచ్చిస్తారు.
☛ ఆక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా అమితాబ్ చౌదరీ
ఆక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గా శిఖా శర్మ డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు. ఆమె స్థానంలో అమితాబ్ చౌదరీ ఎండీ, సీఈవోగా జనవరి 1, 2019న బాధ్యతలు చేపట్టారు.
☛ సీఐసీ ఛీఫ్ కమిషనర్‌గా సుధీర్ భార్గవ
కేంద్ర సమాచార కమిషన్ (Central Information Commission – CIC) ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్ భార్గవ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. భార్గవ ఇప్పటివరకు సీఐసీ సమాచార కమిషనర్‌గా పని చేశారు.
-
ఐఎఫ్ఎస్ అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమించారు.
-
కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు.
☛ పశ్చిమ బెంగాల్ లో తెలంగాణ రైతుబంధు
తెలంగాణలోని రైతుబంధు పథకం తరహాలో పశ్చిమబెంగాల్‌లలో ‘క్రిషక్ బంధు’ ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. పథకం కింద ఏటా ఎకరానికి రూ. 5 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. దీన్ని రెండు విడతల్లో ఇస్తారు. రైతుబీమా తరహాలో మరో పథకం ద్వారా రైతులకు రూ. 2 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. పంట బీమా ప్రీమీయంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
-
ఒడిశా ప్రభుత్వం కలియా పేరుతో రైతుబంధు తరహా పథకాన్ని ప్రారంభించగా, జార్ఖండ్‌లోనూ ఈ తరహా పథకాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. తెలంగాణ బాటలో పయనిస్తున్న మూడో రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది.
☛ రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ స్థానంలో ఈ వినోద్‌కుమార్ 2019 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు.
-
1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టిన వినోద్‌కుమార్ రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి సంస్థల్లో పనిచేశారు.
-
2017-18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన విశేష కృషి చేశారు.
-
2018లో ఆరు ఎక్స్అఫీషియో అవార్డులు, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారాలను దక్షిణమధ్య రైల్వే అందుకుంది.
☛ బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనా కూటమి విజయం
బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 30న జరిగిన 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధించింది. డిసెంబర్ 31న వెలువడిన ఫలితాల్లో… 299 పార్లమెంటు స్థానాలకుగాను( మొత్తం 300 స్థానాలు కాగా 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి) హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయం సాధించాయి.
-
విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(NUF) 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
-
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.