Daily Current Affairs–MCQs-September 14, 15 – 2018

మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 130వ స్థానం

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల ర్యాంకింగ్స్ తో యూఎస్ డీపీ ఈ జాబితాను విడుదల చేసింది.

  • ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నార్వే, 2వ స్థానంలో స్విట్జర్లాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో ఐర్లాండ్, 5వ స్థానంలో జర్మనీ నిలిచాయి.

  • తాజా ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 136వ స్థానంలో, పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచాయి.

  • 2017 ర్యాంకింగ్స్ లో భారత్ కు 131వ స్థానం దక్కింది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నంబర్ – 1

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విమాన సేవల నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి నంబర్ 1 ఎయిర్ పోర్ట్ ట్రోఫీని అందుకుంది. ఏసీఐ ప్రపంచవ్యాప్తంగా 34 విమానాశ్రయ సేవలను అధ్యయనం చేసి ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.

  • సెప్టెంబర్ 12న కెనడాలోని హాలీ ఫాక్స్ లో నిర్వహించిన ఏసీఐ కస్టమర్ ఎక్స్ లెన్స్ సమ్మిట్ లో ఈ అవార్దు అందజేశారు.

ఏబీసీ చైర్మన్ గా హార్మూస్ జీ కామా

2018-19 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్ (ABC) నూతన కార్యవర్గాన్ని సెప్టెంబర్ 13న ఎన్నుకున్నారు. ముంబై సమాచార్ డైరెక్టర్ హార్మూస్ జీ కామా ఎన్నికయ్యారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో ఉంటారు. డిప్యూటీ చైర్మన్ గా డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మధుకార్ కామత్ ని ఎన్నుకున్నారు.

  • ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్పత్రికల సబ్ స్క్రిప్షన్స్ ని లెక్కిస్తుంది.

  • ఏబీసీని 1948లో ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.

46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 14న వెల్లడించింది. ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ పేరుని సీజేఐగా లా కమిషన్ కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీకి పంపగాఆయన రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయటంతో న్యాయమంత్రిత్వ శాఖ నియామక ప్రకటన విడుదల చేసింది.

  • ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి వ్యక్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నిలిచారు.

  • ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2న రిటైర్ అవుతారు.

కాళేశ్వరం సీఈకి ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లుకు ఉన్నత గౌరవం దక్కింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆయనకు ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2018 ప్రకటించింది. సెప్టెంబర్ 15న భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో వెంకటేశ్వర్లుకు ఈ అవార్దు ప్రదానం చేశారు.

మాదిరి ప్రశ్నలు

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

1) 130

2) 150

3) 136

4) 99

జవాబు: 130

కింది వాటిలోని ఏ విమానాశ్రయం ఇటీవల ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి నంబర్ 1 ఎయిర్ పోర్ట్ ట్రోఫీని అందుకుంది ?

  1. శంషాబాద్ విమానాశ్రయం

  2. ముంబై ఎయిర్ పోర్ట్

  3. ఢిల్లీ ఎయిర్ పోర్ట్

  4. బెంగళూరు ఎయిర్ పోర్ట్

జవాబు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇటీవల నియమితులయ్యారు ? ఆయన ఎన్నో సీజేఐ ?

  1. 45

  2. 46

  3. 50

  4. 43

జవాబు: 46

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ?

  1. న్యూఢిల్లీ

  2. ముంబై

  3. హైదరాబాద్

  4. బెంగళూరు

జవాబు: ముంబై

ఇటీవల ఇన్సిస్టిట్యూట్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్దు అందుకున్న నల్లా వెంకటేశ్వర్లు ఏ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ?

  1. నాగార్జున సాగర్

  2. శ్రీరాం సాగర్

  3. కాళేశ్వరం

  4. శ్రీశైలం

జవాబు: కాళేశ్వరం

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments