Daily Current Affairs–MCQs-September 9 – 10, 2018

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నవోమి

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా గెలుచుకుంది. న్యూయార్క్ లో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో నవోమి ఒసాకా.. అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ను ఓడించి.. టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నవోమి ఒసాకా గుర్తింపు సాధించింది.

 • ఈ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ మ్యాచ్ చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. నువ్వొక దొంగ.. అబద్దాల కోరు అంటు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పసిఫిక్లో చెత్త ఏరివేత మిషన్ ప్రారంభం

పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయిన 5 లక్షల కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ద ఓషీయన్ క్లీన్ అప్ అనే స్వచ్ఛంద సంస్థ చెత్త ఏరివేత మిషన్ ను ప్రారంభించింది. నెదర్లాండ్స్ కు చెందిన 24 ఏళ్ల బోయన్ స్లాట్ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ప్రాంతంలో చేపడుతున్నారు.

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో అంకుర్ కు స్వర్ణం

భారత షూటర్ అంకుర్ మిట్టల్ దక్షిణ కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ప్రపంచ సీనియన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుపొందాడు. సెప్టెంబర్ 8న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించాడు.

వారసత్వ కట్టడాలుగా సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువు

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువుని కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. ఈ రెండింటిని మనుగడలో ఉన్న పురాతన నీటిపారుదల ఆనకట్టలుగా గుర్తిస్తూ ఈ మేరకు సమాచారన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

 • సదర్మాట్ ఆనకట్టను 1891-92 మధ్య కాలంలో గోదావరి నదిపై శ్రీరాంసాగర్ దిగువన నిర్మించారు. ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం , మేడం పల్లి గ్రామంలో ఉంది.

 • కామారెడ్డి పెద్ద చెరువుని 1897లో నిర్మించారు. దీని పరిధిలో 858 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది.

బీమా రంగంలో తపాలా శాఖ

భారత తపాల శాఖ బీమా రంగంలోకి అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 1న పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన తపాల శాఖ.. వచ్చే రెండేళ్లలో బీమా సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా సెప్టెంబర్ 9న వెల్లడించారు.

 • ప్రస్తుతం తపాలా శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు, మహిళలకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తోంది.

సేఫ్ సిటీనగరాలకు రూ.2,919 కోట్ల నిధులు

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టుని చేపట్టిన కేంద్రంప్రాజెక్టు అమలు కోసం రూ.2,919.55 కోట్ల నిర్భయ నిధులు కేటాయించింది. ఈ జాబితాలో ఉన్న నగరాలుహైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లఖ్ నవూ.

 • ఈ మొత్తం నిధుల్లో హైదరాబాద్ నగరానికి రూ. 282 కోట్లు కేటాయించారు.

 • ప్రాజెక్టులో భాగంగా ఆయా నగరాల్లో తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, క్రైం మ్యాపింగ్ చేస్తారు. ఆ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్, మఫ్తీ బృందాలు, షీటీంలు తిరుగుతుంటాయి. క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

 • ఆయా ప్రాంతాల్లో పానిక్ బటన్ లు ఏర్పాటు చేస్తారు. వాటిని మహిళలు నొక్కగానే.. రెప్సాన్స్ బృందాలు తక్షణం అక్కడికి చేరుకుంటాయి.

మాదిరి ప్రశ్నలు

ద ఓషీయన్ క్లీన్ అప్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఈ కింది వాటిలోని ఏ అంశంపై వార్తల్లో నిలిచింది ?

1) సముద్ర మట్టాల అధ్యయనం

2) సముద్రంలో నిధుల వెలికితీత

3) సముద్రం నావిగేషన్

4) సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల వెలికితీత

జవాబు: సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల వెలికితీత

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ – 2018లో పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన షూటర్ ఎవరు ?

 1. అంకుర్ మిట్టల్

 2. అభినవ్ బింద్రా

 3. షాహర్ రిజ్వి

 4. గగన్ నారంగ్

జవాబు: అంకుర్ మిట్టల్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించిన సదర్మాట్ ఆనకట్ట తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది ?

 1. కామారెడ్డి

 2. భద్రాద్రి

 3. యాదాద్రి

 4. నిర్మల్

జవాబు: నిర్మల్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మహిళల భద్రత కోసం ఉద్దేశించిన సేఫ్ సిటీ ప్రాజెక్టులో లేని నగరం ఏది ?

 1. హైదరాబాద్

 2. ఢిల్లీ

 3. విజయవాడ

 4. చెన్నై

జవాబు: విజయవాడ

యూఎస్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?

 1. సెరెనా విలియమ్స్

 2. నవోమి ఒసాకా

 3. సిమోనా హాలెప్

 4. పెట్రా క్విటోవా

జవాబు: నవోమి ఒసాకా

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments