అంపశయ్య నవీన్ కు కాళోజీ పురస్కారం – 2018
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం – 2018కి అంపశయ్య నవీన్ ఎంపికయ్యారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 9న కాళోజీ 104వ జయంతిని పురస్కరించుకొని నవీన్ కు పురస్కారాన్ని అందజేశారు.
-
నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
-
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు.
-
నవీన్ స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం
ఢిల్లీలో ప్రపంచ రవాణా సదస్సు – 2018
తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్(ప్రపంచ రవాణా సదస్సు) – MOVE, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తు.. మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 15 శాతానికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమోబైల్ సంస్థల సీఈవోలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
-
తొలి గ్లోబల్ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను నీతి ఆయోగ్ నిర్వహించింది.
తెలంగాణలో 0.39 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని భూగర్భ జనరుల విభాగం సెప్టెంబర్ 7న వెల్లడించింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన పనులతో చెరువులతో సమృద్ధి నీరు చేరి.. భూమిలోకి ఇంకుతోందని.. దీని ఫలితంగానే భూగర్భ జలమట్టం పెరిగిందని వివరించింది.
మాదిరి ప్రశ్నలు
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం – 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
-
నెలిమెల భాస్కర్
-
అంపశయ్య నవీన్
-
గోరటి వెంకన్న
-
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
జవాబు: అంపశయ్య నవీన్
తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను ఎవరు నిర్వహించారు ?
-
కేంద్ర రవాణా శాఖ
-
నీతి ఆయోగ్
-
ఎన్ హెచ్ ఏ ఐ
-
ఆర్బీఐ
జవాబు: నీతి ఆయోగ్