పీఎస్ఎల్వీ – సీ42 ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని షార్ కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ISRO చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 42 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో విజయాల రాకెట్ గుర్తింపు సాధించిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(PSLV) 889 కిలోల బరువున్న 2 బ్రిటన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
క్లుప్తంగా
రాకెట్ పేరు – పీఎస్ఎల్వీ సీ – 42
ఎత్తు – 44. 4 మీటర్లు
బరువు – 230.4 టన్నులు
ఉపగ్రహాలు
నోవాసర్ ఎస్ : 455 కిలోలు
ఎస్ 1 – 4 : 444 కిలోలు
-
ఈ ప్రయోగంతో ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 239 కి చేరింది. వీటిలో 143 అమెరికా, 12 జర్మనీ, 12 12 కెనడా, 14 బ్రిటన్, 8 సింగపూర్ తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి.
-
పీఎస్ఎల్వీ సీ – 42 ఇస్రో 7వ వాణిజ్య ప్రయోగం.
రాజ్యసభ, మండలి ఎన్నికల్లో నో “నోటా“
రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో నోటా(నన్ ఆఫ్ ది ఎబో) గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తొలగించింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ ఆప్షన్లకు నోటా వర్తించదని స్పష్టం చేస్తూ ఆగస్టు 21న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ సెప్టెంబర్ 11న వెల్లడించింది.
-
కోర్టు సూచన మేరకు లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో నోటాను వినియోగిస్తారు.
-
రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ తీర్పు చెప్పింది.
సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్
సింగపూర్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో మెర్సిడిస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 16న జరిగిన ఈ రేసుని పోల్ పోజిషన్ నుంచి ఆరంభించిన హామిల్టన్.. అందరికంటే ముందుగా పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు.
-
రెండో స్థానంలో రెడు బుల్ డ్రైవర్ మాక్స్ వెర్ స్టాపన్, మూడో స్థానంలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నిలిచారు.
మారథాన్ రేసులో కెన్యా అథ్లెట్ సరికొత్త రికార్డు
మారథాన్ రేసులో కెన్యా స్టార్ అథ్లెట్, రియో ఒలింపిక్ చాంపియన్ ఎలియడ్ కిప్పోగె సరికొత్త రికార్డు సృష్టించాడు. సెప్టెంబర్ 16న జరిగిన బెర్లిన్ మారథాన్ రేసుని కిప్పోగె.. 2 గంటల 1 నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి.. కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో డెన్నిస్ కమిట్లో 2 గంటల 2 నిమిషాల 57 సెకన్ల పేరిట ఉన్న రికార్డుని ఎలియడ్ బద్దలు గొట్టాడు.
-
33 ఏళ్ల కిప్పోగె.. ఇప్పటి వరకు 11 మారథాన్లలో పోటీ పడి 10 గెలుచుకున్నాడు.
-
2004, 2008 ఒలింపిక్స్ లో 5000 మీటర్ల రేసులో కాంస్య, రజత పతకాలు సొంతం చేసుకున్నాడు.
జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ – 2018
-
జపాన్ ఓపెన్ – 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ ను జపాన్ స్టార్ షట్లర్ కెంటో మొమొటా గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన ఫైనల్లో మొమొటా.. థాయిలాండ్ షట్లర్ ఖోసితోను ఓడించి.. టైటిల్ విజేతగా నిలిచాడు.
-
మహిళల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కరోలినా మారిన్ గెలుచుకుంది. ఫైనల్లో జపాన్ ప్లేయర్ ఒకుహరను ఓడించి మారిన్ టైటిల్ విజేతగా నిలిచింది.
మాదిరి ప్రశ్నలు
ఇస్రో ఇటీవల పీఎస్ఎల్వీ సీ – 42 ద్వారా ఏ దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది ?
-
బ్రిటన్
-
అమెరికా
-
కెనడా
-
సింగపూర్
జవాబు: బ్రిటన్
కింది వాటిలో ఏ ఎన్నికలకు నోటా వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది ?
-
లోక్ సభ
-
శాసనసభ
-
రాజ్యసభ
-
స్థానిక సంస్థలు
జవాబు: రాజ్యసభ
సింగపూర్ గ్రాండ్ ప్రీ – 2018 టైటిల్ విజేత ఎవరు ?
-
సెబాస్టియన్ వెటెల్
-
వెర్ స్టాపన్
-
లూయిస్ హామిల్టన్
-
రిక్కియార్డో
జవాబు: లూయిస్ హామిల్టన్
ఇటీవల బెర్లిన్ మారథాన్ రేసుని రికార్డు సమయంలో పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేసిన స్టార్ అథ్లెట్ ఎలియడ్ కిప్పోగె.. ఈ కింది వాటిలో ఏ దేశానికి చెందిన వారు ?
-
అమెరికా
-
కెన్యా
-
భారత్
-
జపాన్
జవాబు: కెన్యా
జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
-
పీవీ సింధు
-
సైనా నెహ్వాల్
-
కరోలినా మారిన్
-
ఒకుహర
జవాబు: కరోలినా మారిన్