Daily Current Affairs–MCQs-September 16, 2018

20 రోజుల పాటు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అనుకునే వారు, వినూత్న ఆవిష్కర్తలను కలిసి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ యాత్ర సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 వరకు 20 రోజుల పాటు జరిగే ఈ యాత్రను రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు.

  • ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో 20 మందిని ఎంపిక చేస్తారు.

  • 12 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.

నీల్ బసుకి ఆసియాన్ అచీవర్స్ అవార్డు

బ్రిటన్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు .. ప్రతిష్టాత్మక ఆసియన్ అచీవర్స్ అవార్దుకు ఎంపికయ్యారు. ఆసియాన్ బిజినెస్ పబ్లికేషన్స్ లిమిటెడ్ (ABPL) అనే మీడియా సంస్థ ఏటా ఈ అవార్డులని ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14న నిర్వహించిన కార్యక్రమంలో నీల్ బసు తరపున సహ ఉద్యోగి అవార్దు అందుకున్నారు.

  • నీల్ బసు బ్రిటన్ లోని స్కాట్లాండ్ యార్డ్ లో తీవ్రవాద నిరోధక దళానికి నేతృత్వం వహిస్తున్న తొలి భారత సంతతి అధికారి.

స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని పహాడ్ గంజ్ లో ఉన్న అంబేడ్కర్ మాధ్యమిక పాఠశాలలో చీపురి పట్టుకొని ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్ముడికి నివాళులర్పించడానికి చేపట్టిన అద్భుత కార్యక్రమమిదని మోడీ ట్వీట్‌ చేశారు.

మాదిరి ప్రశ్నలు

తెలంగాణలో వినూత్న ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇటీవల 20 రోజుల స్టార్టప్ యాత్రని ఎవరు చేపట్టారు ?

  1. టీఎస్ ఐపాస్

  2. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ

  3. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్

  4. హైదరాబాద్ మెట్రో

జవాబు: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్

ఇటీవల ఆసియాన్ బిజినెస్ పబ్లికేషన్స్ లిమిటెడ్ నుంచి ప్రతిష్టాత్మక ఆసియాన్ అచీవర్స్ అవార్డు – 2018ని అందుకున్న భారత సంతతి అధికారి నీల్ బసు.. ఏ దేశంలో పోలీసు అధికారిగా ఉన్నారు ?

  1. అమెరికా

  2. బ్రిటన్

  3. చైనా

  4. ఆస్ట్రేలియా

జవాబు: బ్రిటన్

స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు ?

  1. సెప్టెంబర్ 1 – సెప్టెంబర్ 15

  2. సెప్టెంబర్ 1 – డిసెంబర్ 31

  3. సెప్టెంబర్ 15- అక్టోబర్ 2

  4. జనవరి 1 – డిసెంబర్ 31

జవాబు: సెప్టెంబర్ 15 – అక్టోబర్ 2

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments