Daily Current Affairs–MCQs-September 12, 13 – 2018

PM-AASHA కు కేంద్ర కేబినెట్ ఆమోదం

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ (ఆదాయ) సంరక్షణ అభియాన్ – PM AASHA పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పథకానికి అంగీకార ముద్ర వేసింది.

 • పీఎం ఆశ పథకాన్ని అమలు చేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

 • ఈ ఏడాది కేంద్రం ఉత్పత్తి వ్యయంలో 1.5 రెట్లు ప్రాతిపదికన కనీస మద్దతు ధర నిర్ణయించింది.

 • మద్దతు ధర కోసం ప్రస్తుతంధర మద్దతు పథకం (PSS), ధర లోటు చెల్లింపు పథకం(PDPS), ప్రైవేటు ప్రొక్యూర్ మెంట్ మరియు స్టాకిస్ట్ పథకం(PPS) అమల్లో ఉన్నాయి.

 • ఈ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ కేంద్రం రూపొందించిందే.. పీఎం ఆశ పథకం.

ఆశా, అంగన్ వాడీలకు మోదీ వేతన కానుక

ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 11న ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

 • ప్రస్తుతం రూ.3వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 వేతనం అందుతుంది.

 • రూ.2,200 పొందుతున్న వారికి వేతనం రూ.3,500 లభిస్తుంది.

 • అంగన్ వాడీల సహాయ గౌరవ వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.2,500 కు పెంచారు.

ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు కరిష్మ

సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినున్న ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు పేరుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11న వెల్లడించారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. జార్ఖండ్ లో ప్రధాని మోదీ సెప్టెంబర్ 23న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.

అవినీతి మూల్యం.. ప్రపంచ జీడీపీలో 5 శాతం

అవినీతి కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లంచ కారణంగా హింస పెరగడం, శాంతి భద్రతలను కాపాడుకునేందుకు అవినీతిని అంతమొందించటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సెప్టెంబర్ 11న నిర్వహించిన సమావేశంలో గ్యూటెరస్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనాలను అంటకిస్తు.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేల మూల్యం చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.

అంతర్జాతీయ క్రికెట్ కు అలిస్టర్ కుక్ గుడ్ బై

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత్ తో టెస్ట్ సీరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ కుక్ ఆఖరి మ్యాచ్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో సెంచిరీ (147) సాధించిన కుక్.. అరుదైన రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రంతో పాటు చివరి మ్యాచ్ లో సెంచరీ సాధించిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.

 • 2006లో నాగపూర్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అలిస్టర్ కుక్.. 104 పరుగులు సాధించాడు.

 • ఇంతముందు అరంగేట్ర, చివరి టెస్టులో రెగీ డఫ్‌ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్‌ (ఆస్ట్రేలియా), గ్రెగ్‌ చాపెల్‌ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్‌ (భారత్‌) లు సెంచరీలు చేశారు. అయితే అరంగేట్ర, చివరి టెస్టు ఒకే జట్టుపై ఆడి సెంచరీలు చేసింది మాత్రం రెగీ డఫ్‌ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్‌ (ఆస్ట్రేలియా), అలిస్టర్ కుక్(ఇంగ్లాండ్)లు మాత్రమే.

మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన తెలంగాణ

డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సహా ఇతర వైద్య సిబ్బంది నియామకం కోసం తెలంగాణలో ప్రత్యేకంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (MHSRB)ని ఏర్పాటు కానుంది . ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

 • బోర్డు చైర్మన్ గా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.

 • సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమిస్తారు.

 • జాయింట్ కలెక్టర్ కేడర్ అధికారి సభ్యుడిగా ఉంటారు.

మాదిరి ప్రశ్నలు

2022 నాటికి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన పథకం ఏది ?

 1. PM – AASHA

 2. PM – PDPS

 3. PPS

 4. PSS

జవాబు: PM – AASAH

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారైన కరిష్మ అనే చిన్నారి.. ఏ రాష్ట్రానికి చెందినవారు ?

 1. బిహార్

 2. రాజస్థాన్

 3. జార్ఖండ్

 4. హరియాణా

జవాబు: హరియాణా

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలను ఏ బోర్డు ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ?

 1. TSPSC

 2. JNTUH

 3. MHSRB

 4. RRB SECUNDERABAD

జవాబు: MHSRB

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అలిస్టర్ కుక్.. ఈ కింది వాటిలో ఏ ఘనతను సొంతం చేసుకున్నారు ?

 1. టెస్టుల్లో అత్యధిక పరుగులు

 2. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు

 3. టెస్టుల్లో అరంగేట్రం, ఆఖరి టెస్టులో సెంచరీ

 4. అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్

జవాబు: టెస్టుల్లో అరంగేట్రం, ఆఖరి టెస్టులో సెంచరీ

అవినీతి వల్ల ప్రపంచం జీడీపీలో ఎంత శాతం మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్ ఇటీవల వెల్లడించారు ?

 1. 10 శాతం

 2. 5 శాతం

 3. 15 శాతం

 4. 20 శాతం

జవాబు: 5 శాతం

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments