గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. గాల్లోనే ప్రయాణిస్తూనే IAF IL 78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఘనత సాధించింది. దీంతో.. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపకలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది.
-
తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.
-
123 తేజస్ మార్క్ – 1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన 2017 డిసెంబర్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు రూ.50,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.
గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష
హైదరాబాద్ లుంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులు అనీల్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చొదరిలకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ కు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఈ మేరకు ప్రత్యేక హైకోర్టు హైదరాబాద్ జంట పేలుళ్లపై సెప్టెంబర్ 10న దోషులకు శిక్ష ఖరారు చేసింది.
-
అనీక్, ఇస్మాయిల్ చొదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే శిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది.
-
2007 డిసెంబర్ 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లలో వరుస పేలుళ్లు జరిగాయి. దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన మరో బాంబుని పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబీనీ పార్కు పేలుళ్లలో 12 మంది, గోకుల్ చాట్ పేలుళ్లలో 32 మంది మృతి చెందారు.
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 10న జరిగిన న్యూయార్క్ లో జరిగిన ఫైనల్లో.. అర్జెంటీనా ప్లేయర్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో ను ఓడించి జకోవిచ్ టైటిల్ విజేతగా నిలిచాడు. తద్వారా మూడోసారి యూఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్నాడు.
-
టైటిల్ విజేత జకోవిచ్ కు 38 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ, రన్నరప్ డెల్ పొట్రోకు 18 లక్షల 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది.
మిస్ అమెరికా – 2019 గా నియా ఇమానీ
మిస్ అమెరికా – 2019 కిరీటాన్ని 25 ఏళ్ల నియా ఇమానీ ప్రాంక్లిన్ గెలుచుకుంది. ఈ మేరకు అట్లాంటిక్ సిటీలో జరిగిన తుదిపోరులో గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. నార్త్ కరోలినా యూనివర్సిటీలో ఆర్ట్స్ లో గ్రాడ్యుయేట్ అయిన ఈమె సింగర్ కూడా.
అలీబాబా కొత్త చైర్మన్ గా డేనియల్ జాంగ్
ఈ – కామర్స్ దిగ్గజం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జాక్ మా సెప్టెంబర్ 10న వెల్లడించారు. తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కంపెనీ సీఈవో డేనియల్ జాంగ్ ను ప్రకటించారు. డేనియల్.. అత్యంత ప్రజాదరణ పొందిన “సింగిల్ డే సేల్” ప్రచార రూపకర్త గా గుర్తింపు పొందారు. 2019 సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.
-
అలీబాబా ప్రస్తుత మార్కెట్ విలువ 420 బిలియన్ డాలర్లు.
మాదిరి ప్రశ్నలు
తేజస్ యుద్ధ విమానాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
-
ఇస్రో
-
హెచ్ఏఎల్
-
డీఆర్డీవో
-
బీహెచ్ఈఎల్
జవాబు: హెచ్ఏఎల్ ( హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ )
మిస్ అమెరికా – 2019 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
-
ప్రియాంకా చోప్రా
-
అదితి రావ్
-
దీపికా పడుకోన్
-
నియా ఇమానీ
జవాబు: నియా ఇమానీ
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని ఎవరు చేపట్టనున్నారు ?
-
డేనియల్ జాంగ్
-
సుందర్ పిచాయ్
-
ప్రియా సుదర్శన్
-
జాక్ మా
జవాబు: డేనియ్ జాంగ్
యూఎస్ ఓపెన్ – 2018 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరిని ఓడించి నొవాక్ జకోవిచ్ టైటిల్ విజేతగా నిలిచాడు ?
-
రోజర్ ఫెడరర్
-
రాఫెల్ నాదల్
-
మార్టిన్ డెల్ పొట్రో
-
నిషికోరి
జవాబు: మార్టిన్ డెల్ పొట్రో