Current Affairs in Telugu – August 1 – 2019

☛  నవయుగతో పోలవరం కాంట్రాక్టు రద్దు

ఆంధ్రప్రదేశ్ జీవధారగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల నుంచి తప్పించి.. కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని 89.3 క్లాజును అనుసరించి కాంట్రాక్ట్ ను ప్లీ క్లోజూర్ చేస్తున్నామని పేర్కొంటు కంపెనీకి నోటీసు పంపింది.

పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు ఏడాదిలో పూర్తి చేసేందుకు జల వనరుల శాఖ గతంలో నవయుగతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1,244 కోట్లు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. కాంట్రాక్ట్ రద్దుకి కేంద్రం అమోదం తప్పనిసరి.

☛  సెప్టెంబర్ 28న ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించి.. ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టాక.. ఐరాస సమావేశాలకు హాజరుకావడం ఇదే మొదటిసారి.

సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగుతాయి.

ఆర్బిట్రేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ఆర్బిట్రేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. “మధ్యవర్తిత్వం, రాజీ (సవరణ) బిల్లు – 2019” పేరుతో కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. రాజ్యసభ ఇప్పటికే బిల్లుకు ఆమోదం తెలపగా.. లోక్ సభ ఆగస్టు 1న ఆమోదించింది.

కేన్సర్ చికిత్సకు 1.5 లక్షల క్లినిక్ లు

కేన్సర్ చికిత్సకు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి 1.5 లక్షల క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ జులై 31న వెల్లడించారు. ఇప్పటికే 20 వేల వరకు క్లినిక్ ల ఏర్పాటు పూర్తయిందని, 2020 మార్చి నాటికి 40 వేల క్లినిక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 482 కేంద్రాల్లో టెలిథెరపీ మెషిన్ల ద్వారా కేన్సర్ చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లుకు లోక్ సభ ఆమోదం

అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లుకు లోక్ సభ జూలై 31న ఆమోదం తెలిపింది. 1956 నాటి చట్టానికి సవరణలు తెచ్చే ఈ బిల్లుకు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వివిధ బెంచ్ లతో ఒకే ట్రైబ్యునల్ ఏర్పాటు, తీర్పు ఇవ్వడానికి నిర్ధిష్ట గడువు నిర్దేశించారు.

రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారంలో ప్రస్తుత ట్రైబ్యునళ్లు విఫలమయ్యాయని, ఈ అంశంలో కొత్త విధానం అవసరమని, అందుకే చట్టానికి సవరణలతో బిల్లు ప్రవేశపెట్టామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.

బిల్లులో ఏముంది ?

  • ట్రైబ్యునల్ కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యం వహిస్తారు.

  • అవసరమైనప్పుడు బెంచ్ ల ఏర్పాటు జరుగుతుంది

  • వివాదం పరిష్కారమయ్యాక సంబంధిత బెంచ్ ఉండదు

  • ట్రైబ్యునల్ తుది తీర్పుని రెండేళ్ల లోపు ఇవ్వాల్సి ఉంటుంది

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments