☛ పాక్ లో పురాతన హిందూ దేవాలయానికి అరుదైన గుర్తింపు పాకిస్తాన్ లోని పెశావర్ లో ఉన్న పంచ్ తీర్థ్ దేవస్థానాన్ని చారిత్రక జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ లోని కైబర్ పక్ తున్క్వా ప్రావిన్స్ ప్రభుత్వం ఈ మేరకు దేవాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. కేపీ ఆంక్విటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దేవాలయం వద్ద 5 చిన్నపాటి సరస్సలు ఉన్నాయి. అందుకే పంచ్ తీర్థ్ అనే పేరు వచ్చింది. మహాభారతం ప్రకారం పాండు రాజు ఈ ప్రాంతానికి చెందిన వారు. కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనేక మంది భక్తులు వచ్చే వారట. ☛ తెలంగాణ నీటిపారుదల శాఖకు CBIP అవార్డు తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్…
Read MoreTag: current affairs quiz
Weekly Current Affairs – October 24 – 31, 2018
జాతీయం ☛ న్యూఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కూమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ… బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని చెప్పారు. ☛ త్వరలో అతిపొడవైన రైలు–రోడ్డు వంతెన ప్రారంభం దేశంలోనే అత్యంత పొడవైన రైలు–రోడ్డు వంతెనను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 25న తెలియజేశారు. ‘బోగీబీల్ బ్రిడ్జ’ గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవైన…
Read MoreDaily Current Affairs – October 26, 2018
☛ 2020, ఏప్రిల్ 1 నుంచి BS – 4 బంద్ దేశంలో 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(BS)-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న ఆదేశించింది. అప్పటి నుంచి కేవలం బీఎస్-6 వాహనాలను మాత్రమే అమ్మాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తీర్పునిచ్చింది. దేశంలో వాయుకాలుష్యం నియంత్రించేందుకు కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. యూరో-6 ప్రమాణాలతో సమానమైన బీఎస్-6 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువస్థాయిలో వెలువడతాయి. ☛ లైంగిక వేధింపులపై జీవోఎం ఏర్పాటు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (GOM)ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఏర్పాటు చేసింది. ఈ బృందానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. రక్షణ మంత్రి…
Read MoreDaily Current Affairs – October 24, 25 – 2018
☛ గాంధీ నగర్ లో 27వ IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ 27వ International Atomic Energy Agency – IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్(FEC 2018) అక్టోబర్ 24న గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్ ల ద్వారా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అణు ఇంధన పరిశోధనలో సాంకేతిక, శాస్త్ర అభివృద్ధిని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తుంది. IAEA ని జూలై 29 1957లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ☛ దేవెగౌడకు వాల్మికి జయంతి అవార్డు 2018-19 శ్రీ మహర్షి వాల్మీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డుని 2018-19 సంవత్సరానికి మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 24న ప్రకటించింది. ఈ రోజున వాల్మీకి…
Read MoreWeekly Current Affairs – October 16 – 23, 2018
జాతీయం ☛ అలహాబాద్ ఇకపై “ప్రయాగ్‌రాజ్“ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న ఈ మేరకు తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కాలక్రమంలో దీన్నే అలహాబాద్ గా మారింది. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ ను ప్రయోగ్ రాజ్ గా మార్చారు. ☛ ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’(మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. 10,975.36 చదరపు…
Read MoreDaily Current Affairs – October 23, 2018
☛ షాంఘై చెస్ విజేత లలిత్ బాబు షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేతగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు నిలిచాడు. చైనాలో అక్టోబర్ 22న జరిగిన ఈ టోర్నీలో లలిత్ ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ లభించింది. రెండో స్థానంలో లీ డి… మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు. ☛ యూఎస్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలిచింది. 2010-17 కాలంలో అమెరికాలో ఇంగ్లీషు మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ అక్టోబర్ 22న వివరాలు వెల్లడించింది. 2017 నాటి…
Read MoreDaily Current Affairs – October 16 – 22, 2018
☛ తెలంగాణ దళిత రచయిత్రికి “శక్తి భట్” పురస్కారం అమెరికాలో స్థిరపడిన తెలంగాణ దళిత రచయిత్రి సుజాత గిడ్లకు 2018 సంవత్సరానికి గాను “శక్తి భట్” తొలి రచన పురస్కారం దక్కింది. ఆమె రచించిన “యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ : యాన్ అన్ టచెబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా” (Ants Among Elephants: An Untouchable Family and Making of Modern India) అనే పుస్తకానికి గాను ఈ అవార్డు ప్రకటించారు. అవార్డు కింద 2 లక్షల రూపాయలు అందిస్తారు. 6 పుస్తకాలు అవార్డు కోసం షార్ట్ లిస్ట్ కాగా… న్యాయనిర్ణేతలు సుజాత పుస్తకాన్ని ఎంపిక చేశారు. రచయిత్రి సుజాత… పేదల జీవితం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం తదితర అంశాలపై పుస్తకంలో వివరించారు. యువ రచయిత శక్తి స్మారకార్థం శక్తి…
Read MoreWeekly Current Affairs – October 8 – 15, 2018
జాతీయం ☛ లక్నోలో ఐఐఎస్ఎఫ్ – 2018 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2018 (IISF – 2018) జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 6న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ… దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. పతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమేఉన్నారని చెప్పారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి భారత్‌కి తిరిగి వచ్చారని రాష్ట్రపతి తెలిపారు. ☛ సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. రోహ్తక్…
Read MoreWeekly Current Affairs – October 1 – 7, 2018
జాతీయం ☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా గాంధీ హృదయ స్పందనలను ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాటు చేశారు. గాంధీ జివించి ఉన్న రోజుల్లో వివిధ సందర్భాల్లో సేకరించిన ECG(Electro Cardio Graphy) ఆధారంగా ఆయన హృదయ స్పందనలను పునర్ సృష్టి చేశారు. డిజిటల్ మోడల్ లో వాటిని ప్రజలు వినేందుకు ఏర్పాటు చేశారు. ☛ దేశంలో సాగు భూమి 157.14 మిలియన్ హెక్టార్లు 2015-16లో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. దీని ప్రకారం 2010-11లో దేశంలో సాగు భూమి 159.59 మిలియన్ హెక్టార్లుగా ఉండగా… 2015-16 గణనలో అది 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది.…
Read MoreDaily Current Affairs – October 15, 2018
☛ జయరాజుకు సుద్దాల జాతీయ పురస్కారం – 2018 ప్రజా కవి సుద్దాల హనుమంతు – జానకమ్మల జాతీయ పురస్కారం – 2018ని ప్రఖ్యాత ప్రజాకవి జయరాజుకు ప్రదానం చేశారు. సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ప్రదానం చేస్తున్నారు. ☛ ప్రపంచంలోనే వేగవంతమైన కెమెరాను కనుగొన్న అమెరికా వెలుతురు లేదా కాంతిని స్లో మోషన్ లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ ను కేప్చర్ చేయగలదని వెల్లడించారు. కాలఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ కెమెరాను అభివృద్ధి చేశారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నాయి.…
Read More