2018 Monthly Current Affairs – January – August (International)

2018 జనవరి ఆగస్టు కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయం

జకార్తాలో ఆసియాన్ఇండియా నె ట్ వర్క్ సమావేశం

ఆసియాన్ఇండియా నెట్వర్క్ మేధావుల ఐదో రౌండ్ టేబుల్ సమావేశం జకార్తాలో జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సమష్టి భద్రత, సమష్టి సంపద సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆమె ఆకాంక్షించారు. నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

సింగపూర్ లో ఆసియాన్ప్రవాసీ భారతీయ దివస్ 2018

సింగపూర్లో జనవరి 7న జరిగిన ఆసియాన్ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారని కొనియాడారు.

పాకిస్తాన్ కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా

2016 ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్కు ఇవ్వదలచిన రూ.17,000 కోట్ల(255 మిలియన్ డాలర్లు) సహాయాన్ని నిలిపేస్తున్నట్లు అమెరికా జనవరి 1న ప్రకటించింది. దీంతోపాటు 900 మిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని కూడా ఆపేస్తున్నట్లు జనవరి 4న వెల్లడించింది.

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అధికారిక చర్చలు

దాదాపు రెండేళ్ల తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అధికారిక చర్చలు 2018 జనవరి 9న జరిగాయి. ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్కు తమ క్రీడా బృందాలను పంపించేందుకు ఉత్తర కొరియా అంగీకరించింది. దక్షిణ కొరియాతో మిలటరీ హాట్లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. ఉభయదేశాల సరిహద్దులకు సమీపంలోని పాన్ముంజోమ్లో ఈ చర్చలు జరిగాయి. దక్షిణ కొరియా పరిధిలోకి వచ్చే ఈ గ్రామాన్ని శాంతి గ్రామంగా వ్యవహరిస్తారు.

ఢిల్లీలో భారత సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు

పపంచ వ్యాప్తంగా పార్లమెంటేరియన్లుగా ఉన్న భారత సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు ఢిల్లీలో జనవరి 9, 2018న జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఫ్రాన్స, ఫిజీ, స్విట్జర్లాండ్, మారిషస్ సహా 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ, దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చి 102 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారత్ బ్రిటన్ మధ్య రెండు ఒప్పందాలు

చట్ట విరుద్ధంగా బ్రిటన్లో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్బ్రిటన్లు లండన్లో 2018 జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్నోక్స్ సంతకాలు చేశారు.

అమెరికా షట్ డౌన్

అమెరికాలో జనవరి 19 అర్ధరాత్రి 12.01 గంటల(స్థానిక కాలమానం ప్రకారం)కు మొదలైన షట్డౌన్.. జనవరి 22న ముగిసింది. అమెరికా పాలనా యంత్రాంగ నిర్వహణా ఖర్చులను నిర్దేశించే వినిమయ బిల్లును ఆ దేశ సెనేట్ తిరస్కరించింది. దీంతో పెంటగాన్ సహా ఇతర కేంద్ర సంస్థల నిర్వహణకు అవసరమైన నిధులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య సయోధ్య కుదరడంతో ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ సెనేటర్లు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన దస్త్రంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. గతంలో 2013 అక్టోబర్లో 16 రోజులు, 1996లో 21 రోజులపాటు షట్డౌన్ కొనసాగింది.

ఆస్ట్రేలియా గ్రూప్ లో భారత్ కు సభ్యత్వం

భారత్కు జీవ, రసాయన ఆయుధాల నియంత్రణ సంస్థ.. ఆస్ట్రేలియా గ్రూప్లో చోటు దక్కింది. జీవ, రసాయన ఆయుధాల తయారీ నిరోధానికి ఈ గ్రూప్ కృషిచేస్తుంది. ఇందులో భాగంగా జీవాయుధాల తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపదార్థాలు, సాంకేతికత వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేస్తుంది.

మనిషి ఆయుర్థాయం 140 ఏళ్లకు !

పపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా జనవరి 24న దావోస్లో ఆరోగ్య రంగాన్ని మారుస్తున్న నాలుగో తరం పారిశ్రామిక విప్లవం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య రంగంలో వస్తోన్న ఆధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం 140 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

శరణార్థులపై నిషేధాన్ని ఎత్తివేసిన అమెరికా

11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఫిబ్రవరి 5న అత్యవసర పరిస్థితి విధించారు. అత్యవసర స్థితి 15 రోజుల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు

  • పశ్చిమాసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 9న జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ఆ దేశ రాజు అబ్దుల్లా2తో సమావేశమయ్యారు. రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

  • భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 10న పాలస్తీనాలో పర్యటించారు. ఆ దేశ పరిపాలనా రాజధాని రమల్లాలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య రూ.325 కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని ఆ దేశం అత్యున్నత పురస్కారంగ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనాతో సత్కరించింది.

  • దుబాయ్లో ఫిబ్రవరి 11న జరిగిన ప్రపంచ ప్రభుత్వాల(వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్) ఆరో శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 140 దేశాల నుంచి దాదాపు 4000 మంది ప్రతినిధులు హాజరైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవడాన్ని తనతోపాటు 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

  • భారత ప్రధాని నరేంద్రమోదీ యూఏఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 11న ఆ దేశ యువరాజు బిన్ జాయెద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10 శాతం రాయితీ కల్పించే కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2018 నుంచి 2057 వరకు అమల్లో ఉంటుంది. పర్యటనలో భాగంగా ప్రధాని అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

  • భారత ప్రధాని నరేంద్రమోదీ ఒమన్ పర్యటన ఫిబ్రవరి 12న ముగిసింది. పర్యటనలో భాగంగా సుల్తాన్ కాబూస్ బిన్ సయిద్తో ప్రధాని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాలు 8 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

ఇజ్రాయెల్ ప్రదానిపై నేరాభియోగాలు నమోదు

అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై రెండు కేసుల్లో నేరాభియోగాలు నమోదుకు ఆ దేశ పోలీసులు సిఫారసు చేశారు. 14 నెలల దర్యాప్తు అనంతరం నెతన్యాహుకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయని ప్రకటించిన పోలీసులు.. ప్రభుత్వ విచారణకు సిఫారసు చేశారు.

సైన్యంలోకి సౌదీ అరేబియా మహిళలు

సౌదీఅరేబియా మహిళలను సైన్యంలోకి అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఢిల్లీలో ప్రధాని మోదీతో జోర్డాన్ రాజు భేటీ

ఇస్లామిక్ సంస్కృతి, అవగాహన పెంపొందించడం, సంయమనం అనే అంశంపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2018, మార్చి1న పాల్గొన్నారు. రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, మెడిసిన్, రాక్ఫాస్ఫేట్, ఎరువుల దీర్ఘకాల సరఫరా, కస్టమ్స్ అంశంలో పరస్పర సహకారం తదితర వాటిపై రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది.

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డయ్ భారత పర్యటన

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డయ్ క్వాంగ్ భారత పర్యటనలో 2018, మార్చి 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అణుశక్తి, వాణిజ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పారదర్శకంగా, సుసంపన్నంగా ఇండోపసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని భారత్, వియత్నాం నిర్ణరుుంచారుు. మరోవైపు ఏషియాన్తో భారత్ బహుళ దృక్పథ బంధాన్ని తాము సమర్థిస్తామని, దక్షిణ చైనా వివాదం అంశాన్ని ప్రస్తావిస్తూ వియత్నాం అధ్యక్షుడు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో ఐఎస్ఏ తొలి సదస్సు

అంతర్జాతీయ సౌర కూటమి(ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్) తొలి సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రన్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 121 దేశాలను ఒకే వేదికపైకి తేవాలనే ఆలోచనకు రూపమే ఐఎస్ఏ.

పాక్ లో సెనేటర్ గా హిందూ మహిళ

పాకిస్థాన్లో తొలిసారి హిందూ దళిత మహిళ సెనేటర్గా ఎన్నికయ్యారు. మైనారిటీలకు ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి కృష్ణకుమారి కొహ్లి(39) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ప్రతినిధిగా పాక్ సెనేట్కు ఎన్నికైన విషయాన్ని పీపీపీ 2018 మార్చి 4న ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచ సంతోష నివేదికలో 133వ స్థానంలో భారత్

ప్రపంచ సంతోష నివేదిక 2018 మార్చిలో విడుదలైంది. మొత్తం 156 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా నిలిచింది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో డెన్మార్క్ నిలువగా, భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఎస్డీఎస్ఎన్ (సస్టయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్) ఏటా ఈ నివేదికను రూపొందిస్తుంది.

కుప్పకూలిన అర్జెంటీనా ఐస్ బ్రిడ్జ్

అర్జెంటీనాలో యునెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి మార్చి 11న కుప్పకూలింది. పెటగోనియాలోని లాస్ గ్లేసియర్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఐస్ బ్రిడ్జి భారీ తుపాను ధాటికి కూలిపోయింది.

ఏకైక మగ తెల్ల ఖడ్గమృగం సూడాన్ మృతి

పపంచంలో చివరిగా మిగిలిన ఏకైక మగ తెల్ల ఖడ్గమృగం సూడాన్ మృతి చెందింది. నలభై ఐదేళ్ల ఈ అరుదైన జీవి అనారోగ్యంతో మార్చి 20న మరణించిందని కెన్యాలోని ఓఎల్ పెజెటా సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. ఇక కేవలం రెండు ఆడ తెల్ల ఖడ్గమృగాలు మాత్రమే ఉన్నాయి.

చైనా దిగుమతులపై అమెరికా వార్షిక సుంకాలు

చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 22న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతయ్యే 1300(దాదాపు) వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థికవేత్తల అంచనా. దీనికి ప్రతిగా చైనా సైతం అమెరికా వస్తువులపై టారిఫ్లు పెంచింది.

రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన ఐరోపా సమాఖ్య

బిటన్లో రష్యా మాజీ గూఢచారిపై జరిగిన రసాయన దాడికి నిరసనగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, ఉక్రెయిన్, ఈయూ(ఐరోపా సమాఖ్య) దేశాలు మార్చి 26న ప్రకటించాయి. కొద్ది రోజుల క్రితం రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాపై విషప్రయోగం (నొవిచోక్నెర్వ్ ఏజెంట్ ప్రయోగం) జరిగింది. స్క్రిపాల్పై దాడి చేసింది రష్యా అధికారులేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. రష్యా మాత్రం వాటిని ఖండించింది.

చైనాలో రహస్యంగా పర్యటించిన కిమ్ జోంగ్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మార్చి 25 నుంచి 28 వరకు చైనాలో రహస్యంగా పర్యటించారు. పర్యటన వివరాలను కిమ్ ఉత్తర కొరియా తిరిగెళ్లిన తర్వాత చైనా అధికారిక పత్రిక జిన్హువా మార్చి 28న వెల్లడించింది.

పసిఫిక్ లో కూలిన టియాంగాంగ్ -1

నిరుపయోగంగా మారిన చైనా అంతరిక్ష కేంద్రం (టియాంగాంగ్1) ఏప్రిల్ 1న పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

బాకూలో నామ్ దేశాల 18వ మధ్యకాలిక సమావేశం

అజర్బైజాన్ రాజధాని బాకూలో ఏప్రిల్ 5న అలీనోద్యమ(నామ్) దేశాల 18వ మధ్యకాలిక సమావేశం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.

ఉగ్రవాదుల జాబితాలో తొలి స్థానంలో పాక్

ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 3న వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో 139 మందితో పాకిస్థాన్ అగ్రభాగాన నిలిచింది. పాకిస్తాన్లో నివసిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇందులో అల్ఖైదా నేత అల్ జవహరి ముందు వరుసలో ఉన్నారు.

చమురు పైప్ లైన్ నిర్మాణంపై భారత్ బంగ్లా మధ్య ఒప్పందం

భారత్లోని సిలిగురి, బంగ్లాదేశ్లోని పార్బతిపూర్ మధ్య 129.5 కిలోమీటర్ల చమురు(డీజిల్) పైప్లైన్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు ఏప్రిల్ 9న ఢాకాలో సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ప్రసారభారతిబంగ్లాదేశ్ బేతార్ మధ్య సహకారం, ఢాకా విశ్వవిద్యాలయంలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్) ఉర్దూ పీఠం ఏర్పాటు, బంగ్లాదేశ్లోని 500 పాఠశాలల్లో భాషాశాలల ఏర్పాటు, రంగ్పూర్ నగరంలో రహదారుల అభివృద్ధి తదితర కీలక ఒప్పందాలపై భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ షాహిదుల్ సంతకాలు చేశారు.

స్వీడన్ పర్యటనలో ప్రధాని మోదీ

అయిదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 16న స్టాక్హోంలో స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. గత 30 ఏళ్లలో స్వీడన్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీయే కావడం గమనార్హం.

  • స్వీడన్ రాజధాని స్టాక్హోంలో ఏప్రిల్ 17పరస్పర శ్రేయస్సు, విలువల బదలాయింపు పేరుతో భారత్ నార్డిక్ దేశాల తొలి సదస్సు జరిగింది. స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్లను నార్డిక్ దేశాలుగా పిలుస్తారు.

  • ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్తో ఏప్రిల్ 20న బెర్లిన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

గ్రహాల అన్వేషణకు నాసా వ్యోమనౌక

సౌర కుటుంబం వెలుపల గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 19న వ్యోమనౌకను ప్రయోగించారు.

బీజింగ్ లో ఎస్సీవో విదేశీ మంత్రుల సదస్సు

షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సభ్యదేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సదస్సు బీజింగ్లో ఏప్రిల్ 24న జరిగింది. ఈ సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ సహా మొత్తం 8 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 27న ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షుల భేటీ

ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షుల చారిత్రక భేటీ ఏప్రిల్ 27న జరిగింది. రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేసుకున్నారు. అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్ను తమ దేశంలోకి ఆహ్వానించారు. ఈ ద్వైపాక్షిక భేటీలో కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడాన్ని ఉమ్మడి లక్ష్యంగా పేర్కొన్నారు.

రష్యాలో తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం

రష్యా.. అకడమిక్ లోమనోసోవ్ అనే సముద్రంలో ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీన్ని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సెయింట్ పీటర్స్బర్గ్లోని షిప్యార్డ్లో నిర్మించి.. చుకోట్కా పోర్ట్ ఆఫ్ పెవెక్కు తరలిస్తోంది. దీని ద్వారా ఏటా 50 వేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించొచ్చని అంచనా.

వూహాన్ లో మోదీజిన్ పింగ్ మధ్య అనధికారిక సమావేశం

భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య చైనా పర్యాటక కేంద్రం వుహాన్లో ఏప్రిల్ 27, 28 తేదీల్లో అనధికారిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. దీన్ని హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్నారు.

అర్మేనియా ప్రధానిగా నికోల్ పషిన్యాన్

అర్మేనియా ప్రధానిగా నికోల్ పషిన్యాన్ ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటులో మే 8న జరిగిన ఎన్నికలో పషిన్యాన్కు అనుకూలంగా 59 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పషిన్యాన్ పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు.

మలేషియా ప్రధానిగా మహిథిర్ ఎన్నిక

మలేసియా ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. రాజకీయ కురువృద్ధుడు మహథిర్ మొహమ్మద్ 92 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. మహథిర్తో మలేసియా రాజు మే 10న ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన అత్యంత వయోధికుడిగా మహథిర్ రికార్డు సాధించారు.

ఇరాన్ అణుఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా

ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 8న ప్రకటించారు. 2015లో ఒప్పందం కుదిరినప్పుడు ఇరాన్పై ఎత్తివేసిన ఆంక్షలను తిరిగి విధిస్తామని ప్రకటించారు.

నేపాల్ లో పర్యటించిన ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 11 నుంచి రెండు రోజుల పాటు నేపాల్లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తూర్పు నేపాల్లో చేపట్టే 900 మెగావాట్ల అరుణ్3 జలవిద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు మోదీ, ఓలీ.. రిమోట్ వ్యవస్థ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం జనక్పుర్అయోధ్య మధ్య నేరుగా నడిచే బస్సు సర్వీసును ప్రారంభించారు.

మయన్మార్ లో పర్యటించిన సుష్మాస్వరాజ్

భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మే 10 నుంచి రెండు రోజుల పాటు మయన్మార్లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత్, మయన్మార్ మధ్య మొత్తం ఏడు ఒప్పందాలు కుదిరాయి. రోహింగ్యా ముస్లింల సంక్షోభం, రఖైన్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిని సుష్మా స్వరాజ్ అడిగి తెలుసుకున్నారు. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్సాన్ సూచీతోనూ చర్చలు జరిపారు.

రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ

రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ మే 21న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి వాటిలో రెండు దేశాల సంయుక్త కార్యక లాపాలను పుతిన్ కొనియాడారు. రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖలు పరస్పర సహకారంతో ముందుకె ళ్తున్నాయన్నారు.

వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ ముదురో

వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించారు. జాతీయ

ఎన్నికల కౌన్సిల్ మే 20న ప్రకటించిన ఫలితాల్లో యునెటైడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులాకు చెందిన మదురోకు 68 శాతం ఓట్లు లభించాయి.

సీఐఏ తొలి మహిళా డైరెక్టర్ గా గినా హాస్పెల్

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తొలి మహిళా డెరైక్టర్గా గినా హాస్పెల్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చిలో హాస్పెల్ను సీఐఏ డెరైక్టర్గా నామినేట్ చేయగానియామకానికి సెనేట్ మే 17న ఆమోదం తెలిపింది.

ఫ్లైట్స్ నవలకు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డు

పోలాండ్ రచయిత ఓగ్లా తొకర్జూ రాసిన ఫ్లైట్స్ అనే అనువాద నవలకు ఈ ఏడాది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ బహుమతి కింద వచ్చే 67 వేల డాలర్ల ప్రైజ్ మనీని ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రోఫ్ట్తో కలిసి పంచుకుంటారు.

ఐర్లాండ్ రిఫరెండం

ఐర్లాండ్లో గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని (అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దు) కోరుతూ నిర్వహించిన రిఫరెండంలో 66.4 శాతం మంది అనుకూలంగా, 33.6 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్లో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్)కి సంబంధించి కఠిన నిబంధనలున్నాయి. తాజా ప్రజాభిప్రాయ సేకరణకు ఐర్లాండ్లో భారతీయ మహిళ అయిన సవితా హాలప్పనవర్ (31) మృతి ప్రధాన కారణం కావడం గమనార్హం.

మోదీ తొలి ఇండోనేషియా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఇండోనేషియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తో జకార్తాలో సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించారు. భారత్ఇండోనేషియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్రసాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం తదితర 15 ఒప్పందాలు జరిగాయి.

ఇండో పసిఫిక్ కమాండ్

హవాయిలో ఉన్న పసిఫిక్ కమాండ్ సైనిక స్థావరం పేరును ఇండోపసిఫిక్ కమాండ్గా మార్చుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా సైనిక వ్యవహారాల్లో భారత్కు ఉన్న ప్రాధాన్యతకు గుర్తుగా ఈ మార్పు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ఈ అతిపెద్ద స్థావరాన్ని ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండోపసిఫిక్ ప్రాంతంగా పిలవడం ప్రారంభించారు. తాజాగా అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటి స్ ఈ అంశంపై స్పందిస్తూ హిందూ, పసిఫిక్ సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానాన్ని గుర్తిస్తూ పేరు మార్చినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మే 31 నుంచి రెండు రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్తో సమావేశమై ఆర్థిక, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల నావికా దళాల మధ్య సహకారంతో కలిపి మొత్తం 8 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మన దేశానికి చెందిన డిజిటల్ ట్రాన్సాక్షన్ యాప్లైన భీమ్, రూపే, ఎస్బీఐ యాప్లను ఆవిష్కరించి సింగపూర్కు చెందిన నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ (నెట్స్)తో అనుసంధానించారు. ఫలితంగా రూపే వినియోగదారులు సింగపూర్ వ్యాప్తంగా నెట్స్ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయొచ్చు.

స్పెయిన్ ప్రధాని పదవికి మరియానో రాజోయ్ రాజీనామా

అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్ ప్రధాని మరియానో రాజొయ్ జూన్ 1న పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత పెడ్రో సాంచెజ్ బాధ్యతలు చేపట్టారు. రాజొయ్కు చెందిన పాపులర్ పార్టీపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సోషలిస్టులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సోషలిస్టులను వ్యతిరేకించే ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో రాజొయ్ ఓటమి అనివార్యమైంది.

ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్ సిసి

ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్సిసీ జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 97% ఓట్లతో ఆయన విజయం సాధించారు. మహమ్మద్ మోర్సీని సైన్యం పదవీచ్యుతుడిని చేసిన అనంతరం 2014లో సీసీ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టారు.

ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా ఫెర్నాండా

198 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ ఎన్నికయ్యారు. జూన్ 5న రహస్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో మరియాకు 128 ఓట్లు దక్కగా.. ఫ్లేక్కు 62 ఓట్లు పడ్డాయి. ఏడు దశాబ్దాల ఐరాస చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళ మరియా. 1953లో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. 1969లో లైబీరియాకు చెందిన ఎలిజిబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్కు చెందిన షేక్ హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు.

శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ సమిట్

సమిట్గా పిలిచే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా జూన్ 8న ఆవిష్కరించింది. చైనాకు చెందిన సన్వే తైహులైట్ (సెకనుకు 93 వేల ట్రిలియన్ల గణనలు చేయగలదు) రికార్డులను అధిగమించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఈ సమిట్ సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల గణనలు చేయగలదు.

జీ జిన్ పింగ్ తో ప్రధాని మోదీ సమావేశం

చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో వీరిద్దరు భేటీ కావడం ఇది 14వ సారి. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సు వీరి భేటీకి కారణమైంది. ఈ సందర్భంగా బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి, చైనాకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై ఒప్పందం, వుహాన్ సదస్సులో బంధాల బలోపేతం దిశగా బ్లూప్రింట్ తయారీ, ఇరు దేశాల మధ్య అమలవుతున్న కార్యక్రమాల పురోగతి, డోక్లాం వివాదంపై చర్చించారు.

బీఆర్ఐ డిక్లరేషన్ ఆమోదానికి భారత్ నిరాకరణ

చైనాలోని చింగ్దావ్లో రెండు రోజుల పాటు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) డిక్లరేషన్ ఆమోదానికి భారత్ నిరాకరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోంచి వెళ్లే చైనాపాకిస్తాన్ ఆర్థిక నడవాలో భాగంగా ఉన్న బీఆర్ఐ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.

గ్వాటెమాలాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు

మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు కావడంతో 25 మంది మరణించారు. గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ. దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మడంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడుతుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

క్వెటెక్ లో జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు కెనడాలోని క్వెబెక్ సిటీలో జూన్ 9న జరిగింది. కెనడా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూరోపియన్ యూనియన్లు ఈ సదస్సులో పాల్గొన్నాయి. అందరికీ స్వచ్ఛమైన నీరు, గాలి, పర్యావరణ సాధన, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సుస్థిర భవిష్యత్తు ఏర్పాటు, స్వేచ్ఛతో కూడిన, న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం, పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు ఈ సదస్సులో ఉమ్మడి ప్రకటన చేశారు.

ప్రముఖ రచయిత షాజహాన్ బచ్చు హత్య

బంగ్లాదేశ్లోని ప్రముఖ రచయిత, లౌకికవాది, ప్రచురణ కర్త షాజహాన్ బచ్చు (60) ను గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 11న మున్షీగంజ్ జిల్లాలో కాల్చి చంపారు. బిషాకా ప్రకాశణ్ అనే ప్రచురణ సంస్థను నడుపుతున్న షాజహాన్ లౌకికవాదిగా, బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ నాయకుడిగా సుపరిచితులు.

చైనాలో పర్యటించిన కిమ్ జోంగ్

కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు అంగీకరించిన అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండు రోజుల పాటు చైనాలో పర్యటించారు. కిమ్ చైనా పర్యటన ఈ ఏడాది మార్చి నుంచి ఇది మూడోసారి. అణు నిరాయుధీకరణ, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత పరిస్థితులపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చించారు.

సింగపూర్ లో సమావేశమైన ట్రంప్స కిమ్ జోంగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల చరిత్రాత్మక కలయిక జూన్ 12న సింగపూర్లో జరిగింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సరికొత్త సంబంధాల స్థాపన, కొరియన్ ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం సంయుక్త కృషి, పూర్తి అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉండటం, యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధ సమయంలో తప్పిపోయిన వారిని స్వదేశాలకు అప్పగించడం, డీపీఆర్కే (డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా)కు భద్రతా పూచీకత్తు తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు.

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (92.9 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో, వారెన్ బఫెట్ (82.2 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో నిలిచారు. ఆన్లైన్ రిటైలింగ్లో అమెజాన్ దూసుకెళ్తుండటంతో బెజోస్ సంపద కూడా శరవేగంగా పెరుగుతోంది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో టాప్100లో నలుగురు భారతీయులకు (ముకేశ్ అంబానీ, అజిమ్ ప్రేమ్జీ, లక్ష్మీ మిట్టల్, శివ నాడార్) మాత్రమే చోటు దక్కింది.

కుటుంబాల కలియకకు ఉత్తర, దక్షిణ కొరియా అంగీకారం

1950-53లో జరిగిన కొరియా యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోవడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు జూన్ 22న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టులో కలుసుకోవడానికి అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొన్నాయి. ఎంపికైన వారు తమ బంధువులతో 3 రోజులు గడిపేందుకు సమయమివ్వనున్నారు. విడిపోయిన తమ బంధువులను కలుసుకోవడానికి ద.కొరియాలో 57 వేల మంది రెడ్ క్రాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు.

టర్కీ అధ్యక్షుడిగా రెపెప్ తయ్యిప్ ఎర్డోగన్

టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (ఏకేపీ) అభ్యర్థి రెపెప్ తయ్యిప్ ఎర్డోగన్ (64) మరోసారి ఘన విజయం సాధించారు. తాజా విజయంతో ఎర్డోగన్ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ ఎర్డోగన్కు చెందిన ఏకేపీ పార్టీ విజయం సాధించింది. 600 సీట్లున్న టర్కీ పార్లమెంటులో ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్పీ 50 సీట్లలో విజయం సాధించింది.

పాకిస్థాన్ ఎన్నికలు – 2018

పాకిస్థాన్‌లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం జూలై 28న విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్థాన్ తెహ్రీకీ ఇన్సాఫ్’ (పీటీఐ) 115 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్(ఎన్) పార్టీ 64 సీట్లు గెలుపొందగా, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 సీట్లను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 13 స్థానాలు గెలుపొందారు. పాకిస్తాన్ పార్లమెంటు దిగువ సభలో మొత్తం 342 సీట్లు ఉండగా అందులో 272 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. తాజాగా 270 స్థానాలకే ఎన్నికలు జరిగాయి.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 సీట్లు ఉండాలి.అక్కడి చట్టాల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు 21 రోజుల సమయం ఇస్తారు. మరోైవె పు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీంతో ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందిన పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
తొలి హిందూ ఎంపీ
పాకిస్థాన్‌లో తొలిసారిగా ఒక హిందువు ఎంపీగా గెలిచాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్లోని థార్‌పార్కర్-2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20 వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003-08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు.

హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ సదస్సు

వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు 2019 అక్టోబర్‌లో నిర్వహించే ఈ సదుస్సుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) జూలై 24న వెల్లడించింది. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులపాటు నిర్వహించే ఈ సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వామ్యం వహించనుంది. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. డబ్ల్యూడీఓ ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషి చేస్తుంది.
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉన్నందున నగరాన్ని సదస్సుకు ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో తెలిపారు.

అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌గా హాంకాంగ్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్ (ప్రైమ్ ఆఫీస్ మార్కెట్)గా హాంకాంగ్ నిలిచింది. హాంకాంగ్ సెంట్రల్‌లో చదరపు అడుగు కు వార్షిక అద్దె రూ.21,067 గా ఉంది. హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్ (రూ.16,149), బీజింగ్‌లోని ఫైనాన్స్ స్ట్రీట్ (రూ.13,806), హాంకాంగ్‌లోని కౌవ్‌లూన్ (రూ.13,026), చైనాలోని సీబీడీ (రూ.13,018), న్యూయార్క్‌లోని మన్‌హటన్ (రూ.12,629), మిడ్‌టౌన్ (రూ.11,789), టోక్యోలోని మరూంచీ (రూ.11,784) ప్రాంతాలు నిలిచాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సీబీఆర్‌ఈ నివేదిక జూలై 11న విడుదలైంది.

ఈ జాబితాలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (రూ.10,532) 9వ స్థానంలో నిలవగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) (రూ.6,632) 26, ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) (రూ.5,002) లు 37వ స్థానంలో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా 120 నగరాల్లో ఆక్యుపెన్సీ స్థాయి, ధరలపై ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ సర్వే చేసింది. గత ఏడాది కాలంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఆక్యుపెన్సీ వ్యయ వృద్ధి అన్ని రీజియన్లలోనూ స్థిరంగా ఉందని నివేదికలో తేలింది. అద్దెలు, పన్నులు, సర్వీస్ చార్జీలు ఇతరత్రా ఆఫీస్ వ్యయాలను కలిపిన ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఏటా 2.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.

బ్రిటన్ పర్యటనలో ట్రంప్
నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 13న తొలిసారిగా బ్రిటన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని థెరిసా మేతో బ్రెగ్జిట్‌తో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికాబ్రిటన్‌ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ తొలిసారిగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో ఉన్న అధ్యక్ష భవనంలో జూలై 16న జరిగింది. ఈ సందర్భంగా అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు ప్రకంటించారు.

పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ

పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న పాక్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే.

అమెరికా డ్రగ్స్ నియంత్రణ అధికారిగా ఉత్తమ్ ధిల్లాన్
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయవాది ఉత్తమ్ ధిల్లాన్ మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న ‘డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ’ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంపికయ్యారు. గతంలో ధిల్లాన్ శ్వేతసౌధంలో అధ్యకుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ, కాంగ్రెస్‌ల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశారు.

చిన్నారులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారు: ఐరాస
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులు చిన్నారులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు ఈ కార్యకలాపాలను చేస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి తయారు చేసిన ఐరాస వార్షిక నివేదికను జూన్ 28న విడుదల చేసింది.
2017
లో ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అలాగే అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను ఉగ్ర సంస్థలు నియమించుకున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అలాగే చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

ఫిన్‌లాండ్‌లో ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర సమావేశం
ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు జూలై 16న సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు అమెరికా, రష్యాలు జూన్ 28న తెలిపాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, పుతిన్‌లు మాస్కోలో జూన్ 27న సమావేశమయ్యారు.

ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లో పాకిస్థాన్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్’లో పెట్టింది. ఈ మేరకు పారిస్‌లో జూన్ 27న జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. ఇప్టటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలు గ్రే లిస్ట్‌లో ఉన్నాయి.
1989
లో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్ గ్రూపులో 37 దేశాలుండగా మనీ లాండరింగ్ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది.

ఇంధనం దిగుమతిపై అమెరికా హెచ్చరిక
ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడాన్ని భారత్, చైనా సహా అన్నీ దేశాలు నవంబర్ 4 నాటికి పూర్తిగా నిలిపివేయాలని అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా ఇరాన్ నుంచి ముడిచమురును పొందే దేశాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత భారత్ అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. 2017, ఏప్రిల్– 2018, జనవరి మధ్య కాలంలో 1.84 కోట్ల టన్నుల ముడి చమురును ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ విజయం

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ మునంగాగ్వా (75) విజయం సాధించారు. 50.8 శాతం ఓట్లు సాధించి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్పేట్రియాటిక్ ఫ్రంట్ (జానుపీఎఫ్) పార్టీకి 144 స్థానాలు, మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (ఎండీసీ) కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి.
జింబాబ్వేను 37 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించిన రాబర్ట్ ముగాబేను 2017 నవంబర్‌లో పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే.

ఇరాన్ పై అమెరికా ఆంక్షలు
అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ 2018 మే నెలలో రద్దు చేశారు. మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments