2018 జనవరి – ఆగస్టు కరెంట్ అఫైర్స్ -జాతీయం2018 Monthly Current Affairs – January – August (National)

జాతీయం

అసోం ఎన్ఆర్సీ తొలి ముసాయిదా

జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీనేషనల్రిజిస్టర్ఆఫ్సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ట్రంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.

జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు, పంచదార

ఈ ఏడాది జూన్వరకు ఆహార ధాన్యాలు, పంచదారను తప్పనిసరిగా జౌళి సంచుల్లోనే ప్యాక్చేయాలని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) జనవరి 3న నిర్ణయించింది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, పంచదార ఉత్పత్తుల్లో 20 శాతాన్ని జౌళి సంచుల్లో ప్యాక్చేస్తే 40 లక్షల మంది రైతులు; 3.7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ కు ఎయిమ్స్

హిమాచల్ప్రదేశ్కు ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ఆఫ్మెడికల్సైన్సెస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్రంలోని బిలాస్పూర్వద్ద రూ.1,350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు.

గ్వాలియర్ లో డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్(సమీపం) బీఎస్ఎఫ్అకాడమీలో జనవరి 7న జరిగిన డీజీపీ, ఐజీల వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు 250 మంది పోలీసు అధికారులు హాజరయ్యారు. సమావేశం జనవరి 6 నుంచి 8 వరకు జరిగింది.

ఉదయ్ పూర్ లో అఖిల భారత విప్ ల సదస్సు

18వ అఖిల భారత విప్ల సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్జనవరి 8న ఉదయ్పూర్లో ప్రారంభించారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల విప్లు హాజరయ్యారు.

60 శాతం కామన్ సిలబస్ కు ఆమోదం

సివిల్స్, గ్రూపు1లకు ఉమ్మడి సిలబస్యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల పబ్లిక్సర్వీస్కమిషన్లు నిర్వహించే గ్రూప్1 లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు 60 శాతం ఉమ్మడి (కామన్) సిలబస్ఉండాలన్న ప్రతిపాదనకు గోవాలో జరిగిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు 2018, జనవరి 12న ఆమోదించింది.

జాతీయ గీతాలాపన తప్పనిసరికాదు

సినిమా హాళ్లలో చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి ముందు జాతీయ గీతాలాపన తప్పనిసరికాదని సుప్రీంకోర్టు 2018, జనవరి 9న స్పష్టం చేసింది. ఇది ఐచ్ఛికమని తెలిపింది.

2020 మార్చి 31 వరకు ఎంపీ ల్యాడ్స్

పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసే తేదీ అయిన 2020 మార్చి 31వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్కమిటీ 2018 జనవరి 10 ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.11,850కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఆధార ధ్రువీకరణకు కొత్త పద్ధతి

ఆధార్వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ.. ఆందోళన వ్యక్తమవుతుండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐయూనిక్ఐడెంటిఫికేషన్అథారిటీ ఆఫ్ఇండియా)ఆధార్ధృవీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు 2017, జనవరి 10న ప్రకటించింది. ఆధార్స్థానంలో తాత్కాలికంగా ఉండే 16 అంకెల ఒక వర్చువల్గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే సరిపోతుందని యూఐడీఏఐ పేర్కొంది.

నోయిడాలో 22వ జాతీయ యువజనోత్సవం

గ్రేటర్నోయిడాలోని గౌతమ్బుద్ధ విశ్వవిద్యాలయంలో 22వ జాతీయ యువజనోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ 2018 జనవరి 12న వీడియో కాన్ఫరెన్స్లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

సమ్మిళిత అభివృద్ధి సూచీలో 62వ స్థానంలో భారత్

అభివృద్ధి చెందుతున్న దేశాల సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్కు 62వ స్థానం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత సమ్మిళిత ఆధునిక వ్యవస్థల జాబితాలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో లిథ్వేనియా తొలి స్థానంలో నిలిచింది. ఈ సూచీని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో(జనవరి 22) విడుదల చేశారు. భారత్కు అభివృద్ధిసుస్థిర ప్రగతిలో 66వ స్థానం, తరాల మధ్య సమానత్వంలో 44వ స్థానం దక్కింది.

కొత్తగా 9 ఆకర్షణీయ నగరాలు

ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా తొమ్మిది నగరాలు చేరాయి. దీంతో వీటి సంఖ్య 99కి చేరింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ, మొరాదాబాద్, సహరన్పూర్; తమిళనాడులోని ఈరోడ్; బిహార్లోని బిహార్షరీఫ్, దాద్రా నగర్హవేలీలోని సిల్వాసా, లక్షద్వీప్లోని కవరత్తి; అరుణాచల్ప్రదేశ్లోని ఈటానగర్తదితర నగరాలు తాజా జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్పూరీ జనవరి 19న ప్రకటన చేశారు.

ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్అనర్హత వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం జనవరి 21న నోటిఫికేషన్జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఆప్ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేయడంతో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.

హజ్ యాత్రకు రాయితీ రద్దు

హజ్యాత్రలో భాగంగా మక్కా వెళ్లేవారికి ఇక నుంచి రాయితీ ఉండదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్అబ్బాస్నఖ్వీ జనవరి 16న ప్రకటించారు. సుప్రీంకోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. భారత్నుంచి ఓడల ద్వారా హజ్యాత్రికులను అనుమతించేందుకు సౌదీ అరేబియా సూత్రప్రాయంగా అంగీకరించింది.

భారత్ ఆసియాన్ సంబంధాలకు 25 ఏళ్లు

భారత్ఆసియాన్సంబంధాలకు 25 ఏళ్లు పూర్తవుతుండటాన్ని పురస్కరించుకొని జనవరి 25న న్యూఢిల్లీలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ.. ఆసియాన్నేతల సమక్షంలో స్మారక తపాల బిళ్ల విడుదల చేశారు. ఇందులో 10 ఆసియాన్దేశాధినేతలు పాల్గొన్నారు.

2018 జాతీయ ఓటరు దినోత్సవం

అర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకొని భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ఏర్పాటైంది. దీన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు.

2018 గ్రీన్ ర్యాంకింగ్స్ లో 177వ స్థానంలో భారత్

వాయు కాలుష్య నియంత్రణలో పేలవ పనితీరు, నామమాత్ర అటవీ సంరక్షణ చర్యలు.. భారత్ను 2018 గ్రీన్ర్యాంకింగ్స్లో 177వ స్థానంలో నిలబెట్టాయి. వరల్డ్ఎకనమిక్ఫోరం (డబ్ల్యూఈ ఎఫ్)180 దేశాలతో కూడిన పర్యావరణ పనితీరు సూచీ(ఈపీఐ)ని జనవరి 23న స్విట్జర్లాండ్లోని దావోస్లో విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్తొలి ఐదు స్థానాల్లో; బురుండీ(180), బంగ్లాదేశ్(179), కాంగో (178), భారత్(177), నేపాల్(176) చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.

ఉరిశిక్ష ఖరారైన ఖైదీలు భారత్ లో 371 మంది

ఉరిశిక్ష ఖరారైన ఖైదీలు 2017 చివరి నాటికి భారత్లో 371 మంది ఉన్నట్లు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. భారత్లో మరణశిక్ష వార్షిక గణాంకాలు పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం జనవరి 25న నివేదిక విడుదల చేసింది.

2017 సంవత్సరపు హిందీ పదం.. ఆధార్

ఆధార్.. 2017 సంవత్సరపు హిందీ పదంగా ఎంపికైంది. జైపూర్సాహితీ వేడుకలో భాగంగా జనవరి 27న ఆక్స్ఫర్డ్డిక్షనరీ అంశంపై జరిగిన చర్చలో ఈ మేరకు గుర్తించారు.

ప్రజాస్వామ్య సూచీలో భారత్ కు 42వ స్థానం

ఎకనమిస్ట్ఇంటెలిజెన్స్యూనిట్(ఈఐఈ) 165 దేశాలతో రూపొందించిన ప్రజాస్వామ్య సూచీ2017లో భారత్కు 42వ స్థానం దక్కింది. జాబితాలో నార్వే అగ్రస్థానంలో ఉంది. అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ స్థానం, చైనాకు 139వ స్థానం దక్కాయి.

ఐఎన్ఎస్ కరంజ్ జలప్రవేశం

స్కార్పీన్శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్కరంజ్జలప్రవేశం చేసింది. దీన్ని జనవరి 31న ముంబాయిలోప్రారంభించారు. ఫ్రెంచ్నౌకా తయారీ సంస్థ డీసీఎన్ఎస్భాగస్వామ్యంతో ముంబైలోని మజ్గావ్డాక్షిప్బిల్డర్స్లిమిటెడ్ఈ జలాంతర్గామిని నిర్మించింది.

ముంబై విమానాశ్రయం అరుదైన ఘనత

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల సింగిల్రన్వే విమానాశ్రయంగా వరుసగా రెండో ఏడాది గుర్తింపు పొందింది. ఈ ఘనత జనవరి 20న సాధించినట్లు ఎయిర్పోర్ట్అధికార ప్రతినిధి ఫిబ్రవరి 4న ప్రకటించారు. అయితే, జూన్524 గంటల్లో 1003 విమానాల రాకపోకలతో ఇదే ఎయిర్పోర్టు తన గత రికార్డును అధిగమించింది.

భారత్ లో పర్యటించిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్

యూఎస్ఎయిర్ఫోర్స్చీఫ్జనరల్డేవిడ్ఎల్గోల్డ్ఫీన్మూడు రోజుల భారత పర్యటన ఫిబ్రవరి 3న ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన జోద్పూర్వైమానిక స్థావరం నుంచి భారత స్వదేశీ తయారీ యుద్ధవిమానం తేజస్లో విహరించారు.

న్యాయమూర్తుల వేతనాల పెంపు

సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల వేతనాల పెంపు అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి జనవరి 30న సంబంధిత బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీంతో సుప్రీంకోర్టు సీజేఐ వేతనం నెలకు రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు; సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు; హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు రూ.80,000 నుంచి రూ.2.25 లక్షలకు పెరిగాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

నేపాల్ లో విదేశాంగ మంత్రి సుష్మ పర్యటన

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్బహదూర్దేవ్బా, సీపీఎన్మావోయిస్టు సెంటర్చైర్మన్ప్రచండతో సమావేశమయ్యారు.

భారత అటవీ నివేదిక 2017

భారత అటవీ నివేదిక 2017ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్థన్ఫిబ్రవరి 12న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 201517 మధ్యకాలంలో భారత అటవీ విస్తీర్ణం 0.21 శాతం మేర పెరిగింది. దేశం మొత్తం అటవీ విస్తీర్ణం 7,08,273 .కి.మీ.గా ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.53 శాతం వాటాను కలిగి ఉంది.

ఐపీ సూచీ 2018లో 44వ స్థానంలో భారత్

భారత్కు అంతర్జాతీయ మేధోహక్కుల(ఐపీ)సూచీ2018 లో 44వ స్థానం దక్కింది. ఈ సూచీని యూఎస్చాంబర్ఆఫ్కామర్స్కి చెందిన గ్లోబల్ఇన్నోవేషన్పాలసీ సెంటర్(జీఐపీసీ) 50 దేశాలతో రూపొందించింది. ఈ సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రిటన్, స్వీడన్తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో అగ్రస్థానంలో కేరళ

నీతి ఆయోగ్ఫిబ్రవరి 9న విడుదల చేసిన ఆరోగ్య సూచీలో కేరళ తిరిగి అగ్రస్థానం నిలబెట్టుకుంది. కేరళ తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, తమిళనాడు, గుజరాత్ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి.

ఇరాన్ అధ్యక్షుడి భారత పర్యటన

ఇరాన్అధ్యక్షుడు హసన్రౌహానీ భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం రెండు దేశాల మధ్య ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితర అంశాలకు సంబంధించి 9 ఒప్పందాలు కుదిరాయి.

ముంబైలో నూతన విమానాశ్రయానికి ప్రధాని శంకుస్థాపన

భారత ప్రధాని నరేంద్రమోదీ నవీ ముంబైలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు. దీన్ని నాలుగు విడతల్లో దాదాపు రూ. 16,700 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 2031 నాటికి 6 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతారు.

అంతరించిపోయే ప్రమాదంలో 40కిపైగా భాషలు

దేశంలోని 40కి పైగా భాషలు/ మాండలికాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 17న వెల్లడించింది. ఈ జాబితాలో అండమాన్ నికోబార్దీవులకు చెందిన భాషలు/ మాండలికాలు 11 ఉండగా, తర్వాతి స్థానాల్లో మణిపూర్7; హిమాచల్ప్రదేశ్4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన గడాబా, నైకీ భాషలు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ప్రైవేటు కంపెనీలకు బొగ్గు తవ్వేందుకు అనుమతి

ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ)వాణిజ్య అవసరాలకు బొగ్గును తవ్వేందుకు ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ ఫిబ్రవరి 20న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కోల్ఇండియా గుత్తాధిపత్యానికి తెరపడింది.

అవినీతి సూచీ – 2018

ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ అవినీతి సూచీ2017 నివేదికను ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ సూచీలో భారత్81వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్, డెన్మార్క్అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

జలవివాదాల పరిష్కారానికి హైదరాబాద్ లో సమావేశం

దక్షిణాది రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్రాం మేఘవాల్నేతృత్వంలో ఫిబ్రవరి 20న హైదరాబాద్లో సమావేశం జరిగింది. దీనికి 6 దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జలవివాదాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్ఏర్పాటు చేసే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భారత పర్యటన

భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ట్రుడో ఫిబ్రవరి 23న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పౌర అణు పరిజ్ఞానం, విద్య, ఐటీ, మేధోహక్కులు, క్రీడలు వంటి అంశాల్లో ఆరు ఒప్పందాలు కుదిరాయి.

అమ్మ టూవీలర్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 24న అమ్మ టూవీలర్పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తమిళనాడులోని మహిళలకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందిస్తారు.

ఎంపీల అలవెన్సులు..

పార్లమెంటు సభ్యులకు అందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్2018, ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం ఎంపీలకు ప్రతినెలా చెల్లించే నియోజకవర్గ అలవెన్స్రూ.45వేల నుంచి రూ.70వేలకు చేరుకోనుంది. ఆఫీస్ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్స్రూ.45వేల నుంచి రూ.60వేలకు చేరుకోనుంది. ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను కేబినెట్ఆమోదించింది.

కర్ణాటక పావగడలో సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం

కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలోని భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి దశను అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2018 మార్చి 1న ప్రారంభించారు. ఈ కేంద్రం సామర్థ్యం 2,000 మెగావాట్లు. రూ.16,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సౌర పార్క్మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించింది.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలను 2018 మార్చి 3న ప్రకటించారు.

త్రిపుర: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమ భాగస్వామి ఐపీఎఫ్టీ(ఇండీజినెస్పీపుల్స్ఫ్రంట్ఆఫ్త్రిపుర)తో కలసి ఆధిక్యాన్ని సాధించింది. 60 శాసన సభ స్థానాలకుగానూ ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో 43 భాజపా కూటమికి దక్కాయి. దీంతో 25ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం ఓటమి పాలైంది.

నాగాలాండ్: నాగాలాండ్లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించలేదు. 60 స్థానాలు గల శాసన సభలో అధికార ఎన్పీఎఫ్(నాగా పీపుల్స్ఫ్రంట్)కు 27 స్థానాలు లభించాయి. బీజేపీకి 11, ఎన్డీపీపీ(నేషనలిస్ట్డెమోక్రటిక్ప్రోగ్రెసివ్పార్టీ) 16 స్థానాలు లభించాయి.

మేఘాలయ: మేఘాలయలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం∙దక్కలేదు. 60 స్థానాలున్న సభలో.. అధికార కాంగ్రెస్21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. బీజేపీకి కేవలం రెండు సీట్లే దక్కినా.. ఆ పార్టీ భాగస్వామి నేషనల్పీపుల్స్పార్టీ (ఎన్పీపీ) మాత్రం 19 చోట్ల నెగ్గింది. నేషనల్పీపుల్స్పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్సంగ్మా మార్చి 6న మేఘాలయ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

కర్ణాటక ప్రత్యేక జెండా ఆవిష్కరణ

కర్ణాటక రాష్ట్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మువ్వన్నెల(ఎరుపు, తెలుపు, పసుపు) జెండాను నాటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య మార్చి 8న బెంగళూరులో ఆవిష్కరించారు.

స్వల్ప ధరకే శానిటరీ నేప్కిన్లు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం స్వల్ప ధరకే శానిటరీ నేప్కిన్లు విక్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) కేంద్రాల్లో మే 28 నుంచి రూ.10కే నాలుగు నేప్కిన్లను విక్రయిస్తారు.

కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఓకే

మరణాన్ని వాయిదా వేయడం మినహా మరే ఆశ లేని, శారీరక బాధ భరించలేని దయనీయ స్థితిలో ఉన్నప్పుడు.. రోగి లేదా అతని తరపు నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణంప్రసాదించొచ్చని సుప్రీంకోర్టు మార్చి9న తీర్పు చెప్పింది. ఈ మేరకు పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్యుథనేసియా) సమ్మతించింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటన

ఫ్రాన్స్అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్మేక్రన్భారత పర్యటన సందర్భంగా మార్చి 10న ఇరు దేశాల మధ్య మొత్తం 14 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్అణు విద్యుత్ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల విలువ 16 బిలియన్డాలర్లు.

105వ ఇండియన్సైన్స్కాంగ్రెస్

105వ ఇండియన్సైన్స్కాంగ్రెస్మణిపూర్రాజధాని ఇంఫాల్లో మార్చి 16 నుంచి 20 వరకు జరిగింది. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 105వ సైన్స్కాంగ్రెస్ను శాస్త్ర, సాంకేతికత ద్వారా నేటికీ చేరుకోలేని వర్గాలకు దగ్గరవటంఅనే ఇతివృత్తంతో నిర్వహించారు.

ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో భారత్

దేశ రక్షణకు అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారత్ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 200812; 201317 మధ్యకాలంలో భారత్ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగినట్లు స్టాక్హోమ్కు చెందిన ఇంటర్నేషనల్పీస్రీసెర్చ్ఇన్స్టిట్యూట్(సిప్రీ) మార్చి 13న వెల్లడించింది.

జీవనానికి అత్యంత చౌకైన మెట్రో నగరం బెంగళూరు

భారత్లో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందింది. ఎకనమిక్ఇంటెలిజెన్స్యూనిట్(ఈఐయూ) మార్చి 15న విడుదల చేసిన గ్లోబల్కాస్ట్ఆఫ్లివింగ్రిపోర్ట్2018లో బెంగళూరు ప్రపంచంలోనే ఐదో చౌకైన నగరంగా నిలిచింది.

చెన్నైలో అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్

దేశంలో ఫిక్స్డ్బ్రాడ్బ్యాండ్ఇంటర్నెట్ను వాడుతున్న నగరాల్లో.. చెన్నై అత్యంత వేగవంతమైన నెట్స్పీడ్లభిస్తున్న నగరంగా నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. అమెరికాలోని సీటెల్కేంద్రంగా పనిచేస్తున్న ఊక్లా సంస్థ ఈ నివేదికను మార్చి 13న విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్వేగం పరంగా భారత్కు 67వ స్థానం లభించడం గమనార్హం.

ఆయుష్మాన్ భారత్ కు కేబినెట్ ఆమోదం

అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం..ఆయుష్మాన్భారత్కు కేంద్ర కేబినెట్మార్చి 21న ఆమోదం తెలిపింది. ఈపథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. దీంతోపాటు పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించేందుకు కేబినెట్గ్రీన్సిగ్నల్ఇచ్చింది.

ఆప్ ఎమ్మెల్యేపై అనర్హత వేటుని కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

లాభదాయక పదవుల కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే(20 మంది)లపై అనర్హత వేటువేయడాన్ని ఢిల్లీ హైకోర్టు మార్చి 23న కొట్టేసింది. ఈ మేరకు వెలువరించిన నోటిఫికేషన్చట్ట ప్రకారం సరికాదని జస్టిస్సంజీవ్ఖన్నా, జస్టిస్చందర్శేఖర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఏప్రిల్ 1 నుంచి న్యూఢిల్లీలో యూరో 6 ఇంధనం

దేశంలో తొలిసారిగా న్యూఢిల్లీలో ఏప్రిల్1 నుంచి యూరో6(బీఎస్6) ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్ను విక్రయిస్తున్నారు. దీంతో యూరో4 నుంచి నేరుగా యూరో6 ఇంధన వినియోగానికి వెళ్లిన మొదటి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.

వెనుకబడిన 101 జిల్లాల ర్యాంకులు

దేశంలో అత్యంత వెనుకబడిన 101 జిల్లాల ర్యాంకులను నీతి ఆయోగ్మార్చి 28న విడుదల చేసింది. ఈ జిల్లాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ట్రాన్స్ఫర్మేషన్ఆఫ్యాస్పిరేషనల్డిస్ట్రిక్ట్స్ కార్యక్రమంలో ఉన్నాయి. తాజా ర్యాంకుల్లో హరియాణలోని మెవత్అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలవగా, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం అత్యుత్తమ పనితీరు కనబరచింది. మెవత్తర్వాత తెలంగాణలోని కుమ్రంభీమ్అసిఫాబాద్అత్యంత వెనకబడిన జిల్లాగా నిలిచింది.

ఈశాన్య రాష్ట్రాల్లో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు

ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టే రూ. 4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మార్చి 28న సమావేశమైన కేబినెట్2020 వరకు ఈశాన్య రాష్ట్రాల మండలి కింద చేపట్టబోయే వివిధ రకాల ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ఇచ్చింది.

ఎస్సీ, ఎస్టీ కోటాపై కేంద్రం..

ఎస్సీ, ఎస్టీ కోటా ప్రయోజనాల వర్తింపులో ఆయా వర్గాలకు చెందిన సంపన్న శ్రేణిని మినహాయించలేమని కేంద్రం మార్చి 28న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల్లో సంపన్న శ్రేణిని సదరు కోటా ప్రయోజనాల నుంచి మినహాయించాలంటూ సమతా ఆందోళన్సమితి అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది.

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత పర్యటన

నేపాల్ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్7న ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, అనుసంధానం, వాణిజ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య నిర్మాణంలో ఉన్న రైలు మార్గాల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఇరువురు నేతలు భారత్నేపాల్పెట్రోలియం ఉత్పత్తుల పైప్లైన్ను రిమోట్ద్వారా ప్రారంభించారు.

దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐఎస్సీ

బెంగళూరులోని ఇండియన్ఇన్స్టిట్యూట్ఆఫ్సైన్స్(ఐఐఎస్సీ) దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. నేషనల్ఇన్స్టిట్యూట్ర్యాంకింగ్ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ద్వారా దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ఇచ్చిన ర్యాంకులను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్జవదేకర్ఏప్రిల్3న విడుదల చేశారు. ఎన్ఐఆర్ఎఫ్మొత్తం 9 విభాగాల్లో విద్యాసంస్థలకు ర్యాంకుల కేటాయించింది. ఇందులో ఐఐఎస్సీ ఓవరాల్గా తొలి స్థానాన్ని దక్కించుకోగా, అత్యుత్తమ ఇంజనీరింగ్విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్విద్యాసంస్థగా ఐఐఎం అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీ ఎయిమ్స్నిలిచాయి.

భారత తొలి హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్

భారతదేశ తొలి హైస్పీడ్ఎలక్ట్రికల్రైలు ఇంజన్ను ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్10న బిహార్లోని మోతిహరీ నుంచి రిమోట్ద్వారా ప్రారంభించారు. మేక్ఇన్ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే, ఫ్రెంచ్తయారీ సంస్థ అల్స్టోమ్సంయుక్తంగా 12,000 హార్స్పవర్సామర్థ్యం గల రైలు ఇంజన్ను తయారుచేశాయి. వచ్చే 11 ఏళ్లలో మరో 800 రైలు ఇంజన్లను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

ఆయుష్మాన్భారత్కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఏప్రిల్14న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రమణ్సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు.

గగన శక్తి

గగన శక్తి పేరుతో ఏప్రిల్8 నుంచి 20 వరకు భారీ స్థాయిలో చేపట్టిన విన్యాసాలు అద్భుతంగా సాగాయని వైమానిక దళాధిపతి మార్షల్బీఎస్ధనోవా ఏప్రిల్23న తెలిపారు.

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం

కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నుంచి మేఘాలయలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్ప్రదేశ్లోనూ పాక్షికంగా తొలగించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్23న ప్రకటన విడుదల చేసింది.

అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష

12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఏప్రిల్22న ఆమోదించారు.

రాష్ట్రీయ గ్రామ్స్వరాజ్అభియాన్ను ప్రారంభం

జాతీయ పంచాయతీరాజ్దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్24న మధ్యప్రదేశ్లోని రామ్నగర్(మండ్లా జిల్లా)లో రాష్ట్రీయ గ్రామ్స్వరాజ్అభియాన్ను ప్రారంభించారు.

మై జర్నీ ఫ్రమ్మార్క్సిజం లెనినిజం….

మై జర్నీ ఫ్రమ్మార్క్సిజం లెనినిజం టు నెహ్రూవియన్సోషలిజం: సమ్మెమోరీస్, రిఫ్లెక్షన్స్ఆన్ఇంక్లూజివ్గ్రోత్ పేరుతో ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్సీహెచ్హనుమంతరావు రాసిన పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ఏప్రిల్26న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.

జాతీయ వెదురు కార్యక్రమం

పునర్వ్యవస్థీకరించిన జాతీయ వెదురు కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ఏప్రిల్25న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమానికి రూ.1,290 కోట్లు ఖర్చు చేయనున్నారు.

పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్కు 138వ స్థానం

పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్138వ స్థానంలో నిలిచింది. లండన్లో ఏప్రిల్25న రిపోర్టర్స్వితౌట్బార్డర్స్వార్షిక నివేదిక విడుదల చేసింది. సూచీలో సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ కలిగిన దేశంగా నార్వే వరుసగా రెండో ఏడాది మొదటి స్థానం దక్కించుకోగా, ఉత్తర కొరియా అట్టడుగున నిలిచింది.

న్యూఢిల్లీలో 15వ ఏఎంఎస్ సదస్సు

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆతిథ్యంలో 2018 మే 10 నుంచి మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో 15వ ఆసియా మీడియా సదస్సు (ఏఎంఎస్) జరిగింది. టెల్లింగ్అవర్స్టోరీస్ఏషియా అండ్మోర్ ఇతివృత్తంతో సదస్సు కొనసాగింది. ఏటా ఈ సదస్సును ఆసియాపసిఫిక్ప్రసార అభివృద్ధి సంస్థ (ఏఐబీడీ) కౌలాలంపూర్నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు భారత్తొలిసారి ఆతిథ్యమిచ్చింది.

ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటా వాల్ మార్ట్ చేతికి

అమెరికా రిటైల్దిగ్గజం వాల్మార్ట్.. భారత ఈకామర్స్సంస్థ ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటాను 16 బిలియన్డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు మే 9న ప్రకటించింది. 2007లో అమెజాన్మాజీ ఉద్యోగులైన సచిన్బన్సల్, బిన్నీ బన్సాల్కలసి ఫ్లిప్కార్ట్ను స్థాపించారు.

కిషన్ గంగ జలవిద్యుత్ కేంద్రం జాతికి అంకితం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్పర్యటనలో భాగంగా మే 19న రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవాలు చేశారు. గురేజ్ప్రాంతంలో నిర్మించిన 330 మెగావాట్ల కిషన్గంగ జలవిద్యుత్కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. గలందర్బందిపొరా మధ్య 42.1 కిలోమీటర్ల శ్రీనగర్రింగ్రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పరిశుభ్ర నగరంగా ఇండోర్

దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్గుర్తింపు పొందింది. 2018 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్సర్వేలో ఇండోర్మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండోర్తర్వాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్నిలిచాయి.

అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలవనున్న ఢిల్లీ

భారత రాజధాని న్యూఢిల్లీ 2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి మే 16న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. జనాభా పరంగా ప్రస్తుతం 37 మిలియన్ల మందితో టోక్యో అతి పెద్ద నగరంగా నిలవగా, 29 మిలియన్ల మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది.

నూతన జాతీయ జీవ ఇంధన విధానం

నూతన జాతీయ జీవ ఇంధన విధానానికి కేంద్ర కేబినెట్మే 16న ఆమోదం తెలిపింది. దీంతో పాడైన ఆహార ధాన్యాలు, కుళ్లిన బంగాళదుంపలు, చెరకు, మొక్కజొన్న తదితరాలతో తయారుచేసే ఇథనాల్ను పెట్రోల్లో కలపడానికి మార్గం సుగమమైంది. నూతన విధానం ప్రకారం జీవ ఇంధనాలను మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటి తరం (జీ 1).. మొలాసిస్, నూనె గింజలు (వంట నూనెలు కాకుండా)తో తయారుచేసే ఇథనాల్; రెండో తరం (జీ 2).. వ్యర్థాల నుంచి తయారుచేసే ఇంధనం; మూడో తరం (జీ 3).. జీవసీఎన్జీ వంటి ఇంధనాలు.

బిలియనీర్ల జాబితాలో 3వ స్థానంలో భారత్

ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్ల గల దేశాల జాబితాలో భారత్మూడో స్థానంలో నిలిచింది. ఆఫ్రాసియా బ్యాంకు గ్లోబల్వెల్త్మైగ్రేషన్తాజా రివ్యూ ప్రకారం 2027 నాటికి భారత్బిలియనీర్ల సంఖ్య ప్రస్తుతమున్న 119 నుంచి 357కు, అమెరికా బిలియనీర్ల సంఖ్య 884కు, చైనా బిలియనీర్ల సంఖ్య 697కు పెరగనున్నట్లు సమాచారం.

పీటీఐ చైర్మన్ గా చంద్రమౌళి కుమార్ ప్రసాద్

ప్రెస్కౌన్సిల్ఆఫ్ఇండియా (పీసీఐ) చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్చంద్రమౌళి కుమార్ప్రసాద్రెండోసారి నియమితులయ్యారు. ప్రింట్మీడియా నిర్వహణను పర్యవేక్షించే ఈ చట్టబద్ధ సంస్థ నిబంధనల ప్రకారం చైర్మన్తో పాటు మరో 28 మంది సభ్యులుంటారు.

ఆరోగ్య సేవల సూచీలో 145వ స్థానంలో భారత్

ఆరోగ్య సేవల సూచీలో భారత్కు 145వ స్థానం దక్కింది. ఆరోగ్య సేవల నాణ్యత, అందుబాటుపై లాన్సెట్ సంస్థ 195 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఐస్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు అత్యధిక స్కోరు సాధించి ముందు వరుసలో ఉన్నాయి.

నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ భారత పర్యటన

భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ప్రధాని మార్క్రూట్మే 24న భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి నెదర్లాండ్స్మద్దతిస్తుందని ఈ సందర్భంగా రూట్ప్రకటించారు.

మిజోరాం, ఒడిశాకు కొత్త గవర్నర్లు

మిజోరాం గవర్నర్గా కుమ్మనం రాజశేఖరన్, ఒడిశా గవర్నర్గా ప్రొఫెసర్గణేషిలాల్ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్మే 25న ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీమీరట్ ఎక్స్ ప్రెస్ వే తొలి దశ ప్రారంభం

కేంద్రప్రభుత్వం చేపట్టిన ఢిల్లీమీరట్ఎక్స్ప్రెస్వే తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ మే 27న ప్రారంభించారు. నిజాముద్దీన్బ్రిడ్జ్నుంచి యూపీ బార్డర్వరకు నిర్మించ తలపెట్టిన 14 లైన్ల ఈ ఎక్స్ప్రెస్వేలో తొలి దశగా 8.360 కి.మీ.ను కేవలం 18 నెలల్లో నిర్మించి రికార్డు నెలకొల్పారు. నాలుగు దశల్లో పూర్తిచేయనున్న ఈ ఎక్స్ప్రెస్వే పొడవు 82 కి.మీ. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.4975.17 కోట్లు.

డాక్టర్టెస్సీ థామస్

క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళా శాస్త్రవేత్తగా పేరుగాంచిన ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్టెస్సీ థామస్రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరెక్టర్జనరల్గా నియమితులయ్యారు. డాక్టర్సీపీ రామనారాయణన్స్థానంలో జూన్1న ఆమె ఈ నూతన బాధ్యతల్ని చేపట్టారు.

రెపో, రివర్స్ రెపో రేట్ల పెంపు

రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా (ఆర్బీఐ) తొలిసారి రెపో, రివర్స్రెపో రేట్లను పావు శాతం పెంచుతూ ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6% నుంచి 6.25% శాతానికి, రివర్స్రెపో 5.75% నుంచి 6 శాతానికి పెరిగింది.

కమల్ జిత్ బవాకు లిన్నేయన్ మెడల్

భారత వృక్ష శాస్త్రవేత్త కమల్జిత్బవాకు ప్రఖ్యాత లిన్నేయన్మెడల్లభించింది. సొసైటీ ఆఫ్అండన్ప్రధానం చేసే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు. ఉష్ణ ప్రదేశాల్లో మొక్కల పరిణామ క్రమం, అటవీ క్షీణత, కలప రకానికి చెందిన అటవీ ఉత్పత్తులు, మధ్య అమెరికా, పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాల్లోని అడవుల్లో జీవ వైవిధ్యంపై చేసిన కృషికి గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.

గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 49వ సదస్సు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జూన్4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, దేశంలో ఉన్న 10 కోట్ల మంది ఆదివాసీల విద్యా ప్రమాణాలను పెంచడం, వీరి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గవర్నర్లు వారధుల్లా నిలవాలని రాష్ట్రపతి సూచించారు.

తాజ్ డిక్లరేషన్ కు ఆమోదం

ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్మహల్చుట్టూ ప్లాస్టిక్కాలుష్యాన్ని నిషేధించడానికి ఉద్దేశించిన తాజ్డిక్లరేషన్ఈ జూన్3న ఆమోదం పొందింది. దీని ప్రకారం తాజ్చుట్టూ 500 మీటర్ల మేర చెత్తాచెదారం లేకుండా చూడటంతో పాటు వాడిపారేసే ప్లాస్టిక్ను క్రమంగా విడనాడాలి. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్శర్మ, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) సుహృద్భావ రాయబారి దియా మీర్జా ఈ తాజ్డిక్లరేషన్ను ప్రకటించారు.

ప్రపంచ శాంతి సూచీ2018

ప్రపంచ శాంతి సూచీ2018లో భారత్కు 136వ స్థానం దక్కింది. లండన్కు చెందిన ఇన్స్టిట్యూట్ఫర్ఎకనామిక్స్అండ్పీస్(ఐఈపీ) నివేదిక ప్రకారం ఐస్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలకు తొలి మూడు స్థానాలు దక్కాయి. మొత్తం 163 దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించగా సిరియా శాంతిలేని దేశంగా చివరి స్థానంలో నిలిచింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2018

ఈ ఏడాది జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీట్ప్లాస్టిక్పొల్యూషన్ అనే ఇతివృత్తంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్లీనరీ కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవాళికి ప్లాస్టిక్ముప్పుగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పర్యావరణ రహితంగా ఉండాలని, ప్రకృతిని పణంగా పెట్టి దాన్ని సాధించకూడదన్నారు.

బిందేశ్వర్ పాఠక్ కు నిక్కీ ఆసియా అవార్డు

ప్రముఖ భారత సామాజిక సేవకుడు, సులభ్ఇంటర్నేషనల్వ్యవస్థాపకుడు బిందేశ్వర్పాఠక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన నిక్కీ ఆసియా ప్రైజ్ఫర్కల్చర్అండ్కమ్యూనిటీ పురస్కారాన్ని జూన్13న టోక్యోలో ప్రదానం చేశారు. పర్యావరణ హితమైన, తక్కువ వ్యయంతో కూడిన మరుగుదొడ్లను లక్షలాది మందికి అందుబాటులోకి తెచ్చారు. ఆసియాలో ప్రాంతీయ వృద్ధి, సైన్స్, టెక్నాలజీ, నవకల్పన, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే ఈ బహుమతిని గతంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఇన్ఫోసిస్వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అందుకున్నారు.

కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా శరద్ కుమార్

కేంద్ర విజిలెన్స్కమిషనర్గా సీనియర్ఐపీఎస్అధికారి, ఎన్ఐఏ మాజీ సారథి శరద్కుమార్(62) నియమితులయ్యారు. 1979 బ్యాచ్హరియాణా కేడర్ఐపీఎస్అధికారి అయిన శరద్2022 వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.

యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా అరవింద్సక్సేనా

యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా అరవింద్సక్సేనా నియమితులయ్యారు. జూన్20 నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు లేదా 2020, ఆగస్టు 7న ఆయన పదవీ కాలం ముగిసే వరకు పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్ కు అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి యూఎస్ ఆమోదం

అత్యాధునికమైన ఆరు అపాచీ ఎటాక్హెలికాప్టర్ల(ఏహెచ్64)తో పాటు హెల్ఫైర్, స్టింగర్క్షిపణులను భారత్కు విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫైర్కంట్రోల్రాడార్లు, హెల్ఫైర్లాంగ్బో, స్టింగర్బ్లాక్ఐ92 హెచ్క్షిపణులు, నైట్విజన్సెన్సార్లు, ఆధునిక నావిగేషన్సిస్టమ్లను కూడా అమెరికా విక్రయించనుంది.

రాష్ట్రాలకు ఉమ్మడి జల యాజమాన్య సూచీ

రాష్ట్రాలకు ఉమ్మడి జల యాజమాన్య సూచీ (సీడబ్ల్యూఎంఐ)లను కేటాయిస్తూ నీతి ఆయోగ్రూపొందించిన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ విడుదల చేశారు. భూగర్భ జలనిర్వహణ, జల వనరుల పరిరక్షణ, వ్యవసాయం, తాగునీరు, విధానాల రూపకల్పన అమలు వంటి 28 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఈ ర్యాంకులు కేటాయించారు. అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టిన గుజరాత్ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏపీ మూడు, తెలంగాణ ఎనిమిదో స్థానాలను దక్కించుకున్నాయి.

ఆనకట్టల భద్రత బిల్లు2018కి ఆమోదం

డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం ఉద్దేశించిన ఆనకట్టల భద్రత బిల్లు2018కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆనకట్టల భద్రతకు పాటించాల్సిన విధానాలపై పరిశోధనలు జరిపి సిఫార్సులు చేసేందుకు జాతీయ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. దేశంలో ఆనకట్టల భద్రతా ప్రమాణాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు, నిబంధనలను అమలు చేసేందుకు జాతీయ ఆనకట్టల రక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ) ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు.

రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ సయ్యద్ షుజాత్ హత్య

సీనియర్జర్నలిస్ట్, రైజింగ్కశ్మీర్ఆంగ్ల దినపత్రిక ఎడిటర్సయ్యద్షుజాత్బుఖారి (53) జూన్14న శ్రీనగర్లో హత్యకు గురయ్యారు. కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరు మరణించారు.

జమ్ముకశ్మీర్, పాక్ఆక్రమిత కశ్మీర్ పై ఐరాస నివేదిక

జమ్ముకశ్మీర్, పాక్ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి జూన్14న తొలిసారి ఒక నివేదికను విడుదల చేసింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్చేసింది.

ఈ నివేదికపై భారత్స్పందిస్తూ.. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో కూడిన నివేదికని ఆరోపించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఐరాసకు లేఖ రాసింది.

నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం

నీతి ఆయోగ్పాలక మండలి నాలుగో సమావేశం న్యూఢిల్లీలో జూన్17న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. 201718 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక రంగం ఆరోగ్యకరమైన రీతిలో 7.7% వృద్ధిని సాధించిందని చెప్పారు.

జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన

జూన్19న జమ్ముకశ్మీర్ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ఎన్.ఎన్.వోహ్రా సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్గవర్నర్పాలన విధించారు. ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉప సంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతోనే మద్దతు ఉపసంహరించుకున్నట్లు బీజేపీ వెల్లడించింది. 2014 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాల్లో పీడీపీ28, బీజేపీ25, నేషనల్కాన్ఫరెన్స్పార్టీ15, కాంగ్రెస్12, ఇతరులు7 స్థానాలు దక్కించుకున్నారు. అనంతరం 2015, మార్చిలో పీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

సాగు, ఉపాధి హామీ అనుసంధానం..

వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలను అనుసంధానం చేసి సమన్వయ విధానాల రూపకల్పన కు కేంద్రం ఏడుగురు ముఖ్యమంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్సీఎం శివరాజ్సింగ్చౌహాన్కన్వీనర్గా వ్యవహరించే ఈ ఉప సంఘంలో ఏపీ సీఎం, గుజరాత్, యూపీ, పశ్చిమ్బెంగాల్, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్సభ్యుడు రమేశ్చాంద్సభ్యులుగా ఉన్నారు. ఈ ఉప సంఘానికి అవసరమైన సమాచారాన్ని నీతి ఆయోగ్అందించనుంది. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా ఈ సంఘం సూచనలిస్తుంది.

మిస్ఇండియా2018గా అనుకృతి వాస్

మిస్ఇండియా (2018)గా తమిళనాడుకు చెందిన అనుకృతి వాస్(19) ఎంపికైంది. ముంబైలో జూన్19న జరిగిన మిస్ఇండియా గ్రాండ్ఫినాలేలో 30 మంది ఫైనలిస్ట్లు పాల్గొనగా అనుకృతి విజేతగా నిలిచింది. ఈ పోటీలో మొదటి రన్నరప్గా హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరీ, రెండో రన్నరప్గా ఏపీకి చెందిన శ్రేయా రావ్లు నిలిచారు.

లద్దాఖ్లో భారత తొలి రోబోటిక్టెలిస్కోప్

లద్దాఖ్లో ఏర్పాటు చేసిన భారత తొలి రోబోటిక్టెలిస్కోప్తన సేవలను ప్రారంభించింది. సమీపంలోని దేదీప్యమాన ఖగోళ వస్తువులతో కూడిన మెస్సియర్క్యాటలాగ్నుంచి కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసి, వాటిపైకి ఈ టెలిస్కోప్దృష్టిని మళ్లించారు. ఈ ప్రాజెక్టులో అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, తైవాన్, ఇజ్రాయెల్శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యం వహించారు. రూ.3.5 కోట్లతో ఏర్పాటైన ఈ టెలిస్కోపును బెంగళూరులోని ఇండియన్ఇన్స్టిట్యూట్ఆఫ్ఆస్ట్రోఫిజిక్స్, ఐఐటీముంబైలు సంయుక్తంగా నిర్మించాయి.

ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు-2018’ (fugitive economic offender bill) కు పార్లమెంటు జూలై 25న ఆమోదం తెలిపింది. వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వారికి ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. చట్టాలను తప్పించుకుని దేశం నుంచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల కట్టడికి దీనిని రూపొందించినట్లు తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 19న ఆమోదించగా, రాజ్యసభ జూలై 25న మూజువాణి ఓటుతో ఆమోదించింది.

పశ్చిమబెంగాల్ పేరు మార్పునకు తీర్మానం
పశ్చిమబెంగాల్ పేరు మార్పునకు ఆ రాష్ట్ర అసెంబ్లీ జూలై 26న తీర్మానం చేసింది. ఈ మేరకు బెంగాలీలో బంగ్లా, ఇంగ్లిష్‌లో బెంగాల్, హిందీలో బంగాల్‌గా మూడు పేర్లుండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బెంగాల్ కోరినట్లు 3 భాషల్లో 3 పేర్లు కాకుండా బెంగాల్‌ను ఒక్క పేరుతోనే సూచించాలని కేంద్రం ఆ రాష్ట్రానికి సూచించింది. ప్రస్తుతం ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ పేరు చివరన ఉంది.

గంగా’ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య హెచ్చరికలు
సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై నది పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ)ను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టీటీ) జూలై 27న ఆదేశించింది.
ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తుండటంతో ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలపడానికి ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నదీ తీరంలో ప్రతి 100 కి.మీ. కు అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని ఈ బోర్డుల్లో స్పష్టంగా పేర్కొంటారు. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని ఎన్జీటీ వ్యాఖ్యానించింది.

సమాచార భద్రతపై కేంద్రానికి ముసాయిదా
వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శ్రీకృష్ణ కమిటీ జూలై 27న ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాను సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు వంటి అంశాలను పొందుపరిచారు. సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాలని కమిటీ సూచించింది.

అస్సాంలో ఎన్నార్సీ ముసాయిదా ప్రకటన
అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నార్సీ ముసాయిదా వివరాలను భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేశ్ గువాహటిలో జూలై 30న వెల్లడించారు. ఈ ముసాయిదా ప్రకారం మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07 లక్షల మంది తమ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. అలాగే జాబితాలో పేర్లు లేనివారు విదేశీయుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు.
ప్రజలు ఎన్నార్సీ సేవా కేంద్రాలను సందర్శించి తమ దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలుసుకోవచ్చు. నాలుగు కేటగిరీల (అనుమానాస్పద ఓటర్లు, వారి వంశస్థులు, విదేశీయుల ట్రిబ్యునల్స్‌లో రిఫరెన్సులు పెండింగ్‌లో ఉన్నవారు, వీరి వంశస్థులు)కు సంబంధించిన ప్రజల అర్హతను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో తుది ముసాయిదాలో వీరెవరికీ చోటు దక్కలేదు. మరోవైపు ‘తుది జాబితాలో లేని వారిని మేం భారతీయులుగానో, భారతీయేతరులుగానో పిలవడం లేదు. వీరిపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేం’ అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ స్పష్టం చేశారు.
త్రైపాక్షిక ఒప్పందం
1985
ఆగస్టు 15న ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్, అస్సాం ప్రభుత్వం, నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం (3డీ ఫార్ములా) ప్రకారం (డిటెక్షన్ (గుర్తింపు), డిలీషన్ (తొలగింపు), డిపోర్టేషన్(బంగ్లాకు పంపించేయడం)) అమలు చేయాలని నిర్ణయించారు.
1951-61
మధ్య దేశంలోకి వచ్చినవారికి ఓటు హక్కుతో కూడిన పౌరసత్వం ఇస్తారు. 1961-71 మధ్య వచ్చిన వారికి భారత పౌరసత్వం ఉంటుంది. కానీ ఓటు హక్కుండదు. 1971 మార్చి 24 తర్వాత సరైన పత్రాల్లేకుండా ప్రవేశించిన వారిని వెనక్కి పంపించేయాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పౌరసత్వ గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిల్ వేయడంతో సుప్రీంకోర్టు నిర్ణీత గడువును విధించింది.
అక్రమ వలసల వివాదం
1971
లో పాకిస్తాన్ యుద్ధం సమయంలో లక్షలాది మంది అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అప్పటినుంచి వలసదారులు తమ భూములు, ఉద్యోగాలు లాక్కుంటారని, తమ సంస్కృతిని నాశనం చేస్తారని స్థానికుల ఆందోళన. ఈ పరిణామాలతో అస్సాం ఆరేళ్ల పాటు ఘర్షణలతో అట్టుడికింది. చివరికి 1985 ఆగస్టు 15న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి జాతీయ పౌరసత్వ గణన చెయ్యాలని మూడు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.
ముసాయిదా రూపకల్పనలో ప్రతీక్
ఎన్‌ఆర్‌సీ ముసాయిదా జాబితా రూపొందించడంలో అసోం హోం శాఖ ప్రధాన కార్యదర్శి ప్రతీక్ హజేలా కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చేసి, ఐఏఎస్ అయిన ప్రతీక్ ఎన్నార్సీ అనుసంధాన కర్తగా ముసాయిదా రూపకల్పన ప్రక్రియను 2014 సెప్టెంబర్ నుంచి చేపట్టారు.

క్రిమినల్ లా బిల్లు-2018కు లోక్‌సభ ఆమోదం
క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2018కు లోక్‌సభ జూలై 30న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్ నిందితులకు జీవితాంతం జైలు శిక్ష పడనుంది. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష అమలవుతుంది. అలాగే అత్యాచార కేసులన్నింటిలో రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

చెక్‌బౌన్స్ బిల్లుకు సవరణ
చెక్‌బౌన్స్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881కి ప్రభుత్వం జూలై 30న సవరణలు చేసింది. ఈ మేరకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో త్వరలోనే సవరణ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 45 లక్షలకు పైగా చెక్‌బౌన్స్ కేసులున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది.
తాజా ఎన్‌ఐ యాక్ట్ చట్ట సవరణ (సెక్షన్ 143, సెక్షన్ 148) ప్రకారంఫిర్యాదుదారుకు మధ్యంతర పరిహారంగా చెక్కు మొత్తంలో కనీసం 20 శాతం చెల్లించాలని సెక్షన్ 138 కింద కేసును విచారిస్తున్న ఒక కోర్టుచెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆదేశాలు జారీ చేయవచ్చు. విచారణ కోర్టు ఆదేశాలు వెలువరించిన 60 రోజుల లోపు చెక్కు జారీ చేసిన వ్యక్తి ఈ 20 శాతం మొత్తాన్ని ఫిర్యాదుదారుకు చెల్లించాలి. ఒకవేళ దీనిపై చెక్కు జారీ చేసిన వ్యక్తి అప్పీల్‌కు వెళ్లదలిస్తే, అదనంగా మరో 20 శాతాన్ని మధ్యంతర పరిహారంగా చెల్లించాలి. చెక్కు జారీచేసిన వ్యక్తి నిర్దోషిగా కేసు నుంచి బయటపడితే, పరిహారంగా చెల్లించిన మొత్తాన్ని అతనికి తిరిగి ఫిర్యాదుదారు వడ్డీతోసహా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు.
చెక్‌బౌన్స్ కేసుల సత్వర విచారణకు వీలు కల్పిస్తున్న నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (సవరణ)-2018 బిల్లుకు జూలై 23న పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లొచ్చు: సుప్రీంకోర్టు
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు వెళ్లి పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది మహిళలకు ఆర్టికల్స్ 25, 26 ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వమ్ బోర్డు నిషేధం విధించటంపై దాఖలైన పిటిషన్పై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం జూలై 18న విచారణ చేపట్టింది. మహిళలను ఆలయంలోకి రానివ్వక పోవటం ప్రాథమిక హక్కులను నిరాకరించడం, అంటరానితనం పాటించడం వంటిదేనని కోర్టు తెలియజేసింది.
1965
నాటి కేరళలోని హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికారం)నిబంధన 3(బి) కింద ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధానికి చట్టబద్ధత కల్పించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 2008 మార్చి7న ఈ కేసును త్రిసభ్య బెంచ్‌కు అప్పగించింది. 2016 జనవరి 11న సుప్రీంకోర్టు బెంచ్ మళ్లీ కేసు విచారణను చేపట్టి 2017లో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

నో డిటెన్షన్’ రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పాఠశాలల్లో ‘నో డిటెన్షన్ విధానం’ రద్దుకు ఉద్దేశించిన విద్యాహక్కు సవరణ బిల్లు-2017ను లోక్‌సభ జూలై 18 ఆమోదించింది. అయితే పాఠశాలల్లో ఈ విధానం కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్రం తెలిపింది.
తాజా బిల్లు ప్రకారం 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిలైన వారికి మరో అవకాశంగా రెండు నెలల్లో పరీక్షలు పెడతారు. లేదంటే అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులను 8వ తరగతి వరకు డిటెయిన్ చేయకుండా తర్వాతి తరగతులకు పంపిస్తున్నారు.

సమర్థత ఉంటేనే పార్టీ ఇన్ పర్సన్’లుగా అనుమతి
ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సహా వివిధ కేసుల్లో సొంతంగా వాదనలు వినిపించుకునే సామర్థ్యం ఉందని నిరూపించుకున్న వ్యక్తులనే ‘పార్టీ ఇన్ పర్సన్’లుగా అనుమతించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జూలై 19న నిర్ణయించింది. ఈ మేరకు అప్పిలేట్ సైడ్ నిబంధనలకు సవరణలు చేసిన హైకోర్టు అందులో కొత్తగా చాప్టర్ 3ఏ ను చేర్చింది. కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండానే ‘పార్టీ ఇన్ పర్సన్’ల పేరిట స్వీయ వాదనలకు దిగుతున్న కక్షిదారుల కట్టడికి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇష్టారీతిన మాట్లాడకుండా ఆరోపణలు చేసేందుకు వీల్లేకుండా కఠిన నిబంధనలు రూపొందించింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవడంతోపాటు నిర్దిష్ట కాలంపాటు ‘పార్టీ ఇన్ పర్సన్’లుగా హాజరు కాకుండా నిషేధం విధించనుంది.
పార్టీ ఇన్ పర్సన్ అంటే
న్యాయవాదితో సంబంధం లేకుండా తనే కేసు దాఖలు చేసి కేసును సొంతంగా వాదించుకునే వ్యక్తిని న్యాయ పరిభాషలో పార్టీ ఇన్ పర్సన్ అంటారు. సాధారణంగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వ్యక్తి, న్యాయవాదికన్నా కేసును తానే సమర్థంగా వాదించుకోగలనన్న నమ్మకంగల వ్యక్తి ‘పార్టీ ఇన్ పర్సన్’ రూపంలో కోర్టు ముందు హాజరవుతారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఎక్కువగా ‘పార్టీ ఇన్ పర్సన్’లు వాదనలు వినిపిస్తుంటారు. న్యాయవాదులు సైతం తామే పిటిషనర్లుగా ఉంటూ కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదిస్తుంటారు.

అవినీతి నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో రూపొందించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ జూలై 19న ఆమోదించింది. దీంతో ప్రభుత్వాధికారులకు లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారులపై ఎటువంటి కేసులకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టరాదు.
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు-2013’ను లోక్‌సభ జూలై 19న ఆమోదించింది. దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది.

కొత్త వంద నోటుపై ‘రాణీ కీ వావ్’
త్వరలో విడుదల కానున్న రూ.100 నోటుపై గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి ’రాణీ కీ వావ్’ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది. ఈ మేరకు కొత్త వంద నోటు నమూనాను ఆర్బీఐ జూలై 19న అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వంద నోటు సైజు 73 ఎంఎం × 157 ఎంఎం కాగా లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న కొత్త నోటు 66 ఎంఎం × 142 ఎంఎం పరిమాణంలో ఉంది. త్వరలో బ్యాంకుల ద్వారా కొత్త వంద నోటు అందుబాటులోకి రానుందని, పాత వంద నోటు కూడా చెల్లుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

వీగిన అవిశ్వాస తీర్మానం
లోక్‌సభలో జూలై 20న ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కాంగ్రెస్ కూటమితోపాటు టీడీపీ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి అనూకూలంగా ఓటేయగా టీఆర్‌ఎస్, బీజేడీ, శివసేన సభ్యులు సభలో లేరు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభమయ్యాయి.

ఉత్తమ పాలనలో కేరళకు అగ్రస్థానం
దేశంలో అత్యుత్తమ పాలన సాగిస్తున్న రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. ఈ జాబితాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్‌లు చివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) ప్రజా వ్యవహారాల సూచిక (పీఏఐ)-2018 ను బెంగళూరులో జూలై 21న విడుదల చేసింది.

చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు అగ్రస్థానం
పీఏసీ నివేదిక ప్రకారం మెరుగైన పాలన సాగిస్తున్న చిన్న రాష్ట్రాల్లో (జనాభా రెండు కోట్ల కంటే తక్కువ ) హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మిజోరం, సిక్కిం, త్రిపుర వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ సూచికలో చివరి స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభా ఆధారంగా అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని పీఏసీ చైర్మన్ కస్తూరిరంగన్ పేర్కొన్నారు.
ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్ పాల్ 1994లో స్థాపించిన పీఏసీ దేశంలో మెరుగైన పాలన సాధించడం కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై అధ్యయనం చేసి గత మూడేళ్లుగా ర్యాంకులను ఇస్తోంది.

ముగిసిన బహుడా యాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర (రథయాత్ర) జూలై 22న ముగిసింది. శ్రీ గుండిచా మందిరంలో 9 రోజుల కొలువు ముగించుకుని దేవతలు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, వారి సోదరి సుభద్ర లు మూడు చెక్క రథాలపై తిరిగి శ్రీ మందిరం (జగన్నాథుని ఆలయం) సింహ ద్వారం ఆవరణకు రావడంతో యాత్ర సమాప్తమైంది.

మూకహత్యలపై ఉన్నత స్థాయి కమిటీ
దేశంలో జరుగుతున్న మూకహత్యల నియంత్రణకు తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 23న ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి హోంశాఖ కార్యదర్శి రాజీవ్ నేతృత్వం వహిస్తారు.
కమిటీ సిఫార్సులను పరిశీలించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో విదేశాంగ, న్యాయ, రవాణా, జలవనరుల శాఖ మంత్రులు సభ్యులుగా మంత్రుల బృందం (జీవోఎం)ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 15 రోజుల్లోగా జీవోఎంకు సమర్పిస్తుంది. మరోవైపు శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది.

శబరిమలలో ప్లాస్టిక్‌పై నిషేధం
కేరళలోని శబరిమల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంను నిషేధిస్తూ కేరళ హైకోర్టు జూలై 23న ఆదేశాలు జారీ చేసింది. భూమిలో కలసిపోయే ఉత్పత్తులను మాత్రమే మాలధారులు తమ ఇరుముడిలో వాడుకోవచ్చని జస్టిస్ రామచంద్ర మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పర్యావరణపరంగా అత్యంత సునిశితమైన శబరిమలలో విచక్షణారహితంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయనే నివేదికల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
దట్టమైన అడవులకు నిలయమైన శబరిమల ప్రాంతంలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్ల విక్రయంపై రెండేళ్ల కిందట ఉన్నత న్యాయస్థానం నిషేధం విధించింది.

మహిళ లపై ఫిర్యాదులకు ‘సైబర్‌క్రైమ్
అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు సహా మహిళలపై జరిగే సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ‘సైబర్‌క్రైమ్’ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర హోంశాఖ జూలై 24న అందుబాటులోకి తెచ్చింది. దీంతో సోషల్ మీడియా వేధింపులు, గ్యాంగ్‌రేప్‌లు, అత్యాచారాలు, ఫొటోల మార్ఫింగ్, లైంగిక దూషణల సందేశాలు, వంటి వాటిపై పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా అశ్లీల వెబ్‌సైట్‌కు సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే దానికి సంబంధించిన యూఆర్‌ఎల్ లింక్‌ను ఫిర్యాదుకు జతపరచవచ్చు.

సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ దోస్త్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణ, వాటి ద్వారా మోసపోకుండా ఉండేందుకు సైబర్ దోస్త్ (@cyber dost )పేరుతో ట్విట్టర్ ఖాతాను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లోని దర్యాప్తు విభాగాలు, ప్రజలకు అవగాహన కల్పించడం, ఎదురయ్యే సమస్యలపై సూచనలు, సలహాలు అందిస్తారు. నెటిజన్లు నేరుగా ఈ ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోఘాజీపూర్‌లను అనుసంధానించే 340 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఆజంగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 14న శంకుస్థాపన చేశారు. రూ.23వేల కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ సమీపంలో బాణ్‌సాగర్ కెనాల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ జూలై 15న ప్రారంభించారు. అలాగే మిర్జాపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన (మొత్తంగా రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులకు) చేశారు.

తైవాన్ పేరును మార్చిన ఎయిరిండియా
తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) పేరును ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) తన అధికారిక వెబ్‌సైట్‌లో చైనీస్ తైపీగా జూలై 5న మార్పు చేసింది. తైవాన్ భౌగోళిక స్థితితో పాటు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంపై తైవాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

మాస్టర్ రోస్టర్ సీజేఐనే: సుప్రీంకోర్టు
మాస్టర్ రోస్టర్’ ప్రధాన న్యాయమూర్తే అని సుప్రీకోర్టు జూలై 6న మరోసారి స్పష్టం చేసింది. ‘సీజేఐ సమానుల్లో ప్రథముడు, కోర్టు పరిపాలన వ్యవహారాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టడంతో పాటు సుప్రీంకోర్టులోని వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించే అధికారం ఆయనకు ఉందని వెల్లడించింది. కేసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది.

ఢిల్లీ చుట్టూ హరిత వలయం ఏర్పాటు
వాయు కాలుష్యం, గాలి దుమారాల నుంచి న్యూఢిల్లీని కాపాడటానికి నగరం చుట్టూ హరిత వలయం (ట్రీవాల్) ఏర్పాటును చేపట్టారు. ఇందులో భాగంగా రెండేళ్లలో 31 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జూలై 7న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పాలుపంచుకుంటున్నాయి.
ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల వెంట ఆరావళి, యమునా అటవీ ప్రాంతాల చుట్టూ మొక్కలతో ట్రీవాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పొడవైన, దట్టమైన ఆకులతో కూడిన వేప, మర్రి, ఉసిరి, రావి, జామ వంటి మొక్కలను నాటనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 21 లక్షలు, అటవీ శాఖ 4 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లు 4 లక్షలు, ఎడీఎంసీ 3 లక్షల మొక్కలు నాటనున్నాయి.

తాజ్ మహల్ లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
తాజ్‌మహల్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు జూలై 9న ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది.

ఆరు విద్యా సంస్థలకు ఐవోఈ హోదా
దేశంలోని ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదాను కల్పించింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌లకు ఐవోఈ హోదా లభించింది. ప్రపంచ స్థాయి వర్శిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ఈ మేరకు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఈఈసీ) తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ హోదాను జూలై 9న ప్రకటించింది.
ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయి్య కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. మిగిలిన మూడు ప్రైవేటు సంస్థలకు నిధులు అందవు. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు) ఐవోఈ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాజ్యసభలో మరో 5 భాషల్లో మాట్లాడే అవకాశం
రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు జూలై 10న తెలిపారు. జూలై 18న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి సభ్యులు డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పొందిన అనువాదకులను నియమించారు. ప్రస్తుతం రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 22 భాషల్లో తెలుగు సహా 12 భాషల్లో మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంది.

యూజీసీ స్థానంలో హెచ్‌ఈసీఐ ఏర్పాటు
దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు నిధులను అందజేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దు చేసి దాని స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జూన్ 27న నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్‌ఈసీఐ కోసం ముసాయిదా బిల్లును రూపొందించామని, యూజీసీ చట్టం-1951ను రద్దు చేస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు – 2018ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం విద్యా సంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్‌ఈసీఐకి ఉంటుంది. దీంతో విద్యాసంస్థలకు గ్రాంట్లు జారీచేసే అధికారం మానవవనరుల శాఖకు దక్కనుంది.

చెత్త ఉత్పత్తిలో తొలిస్థానంలో హైదరాబాద్‌
తలసరి చెత్త ఉత్పత్తిలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తిపై నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(నీరి) చేసిన అధ్యయనంలో జూన్ 29న వెల్లడైంది. అధ్యయనం ప్రకారం నగరంలో ఒక వ్యక్తి రోజుకు 570 గ్రాముల చెత్తను ఉత్పత్తి చేస్తుండగా బెంగళూరులో 440 గ్రాములు, ఢిల్లీలో 410 గ్రాముల చెత్తను ఉత్పత్తి చేస్తున్నారు. నగరంలో రోజూ సుమారు 4,500 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమౌతుండగా ఇందులో 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.

జూలై 1న జీఎస్టీ దినోత్సవం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా పాటిస్తామని కేంద్ర ప్రభుత్వం జూన్ 30న చెప్పింది. ‘ఒక దేశం, ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకొచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా జీఎస్టీ అమలుకు కృషి చేసిన దేశవ్యాప్తంగా 35 మంది అధికారులకు జీఎస్టీ అవార్డులను కేంద్రం ప్రదానం చేసింది.

యునెస్కో జాబితాలో విక్టోరియన్ గోథిక్‌కు స్థానం
ముంబైలోని విక్టోరియన్ గోథిక్ (19వ శతాబ్దం), ఆర్ట్ డెకో (20వ శతాబ్దం) నిర్మాణ శైలిలో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది. ఈ మేరకు బెహరైన్‌లోని మనామాలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 42వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్‌లో ఉన్న డబ్ల్యూహెచ్‌సీ కట్టడాల సంఖ్య 37కు చేరింది.
ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లాంబా.. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు. జాబితా రూపకల్పన సమయంలో డబ్ల్యూహెచ్‌సీలోని 21 సభ్యదేశాలు ఈ రెండు కట్టడాలకు ఏకగ్రీవంగా ఓటు వేశాయి. ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ (2004), ఎలిఫెంటా గుహలు (1987) ఈ జాబితాలో ఉన్నాయి.

లోక్‌సభలో రోజుకు ఐదు ప్రశ్నలకే అనుమతి
రాబోయే పార్లమెంటు సమావేశాల నుంచి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రోజుకు కేవలం ఐదు ప్రశ్నల్ని మాత్రమే అడగాలని లోక్‌సభ కార్యాలయం జూలై 1న వెల్లడించింది. ఒక వేళ సభ్యుడు ఐదుకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగేందుకు నోటీసులు ఇస్తే వాటిని తర్వాతి రోజు అడిగేందుకు అనుమతిస్తారు. ఇప్పటివరకు ఒక సభ్యుడు రోజుకు పది ప్రశ్నలు అడిగే అవకాశముంది.

భారత్‌లో మాట్లాడే భాషల సంఖ్య 19500
2011
జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 19,569 మాతృభాషలు ఉన్నాయని ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, ఇండియా అధికారులు జూలై 1న వె ల్లడించారు. మొత్తం 96.71 శాతం మంది జనాభా అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో ఏదో ఒకదాన్ని మాతృభాషగా మాట్లాడుతుండగా 3.29 శాతం మంది ప్రజలు మిగిలిన భాషలను మాట్లాడుతున్నారు. వీటిలో 1,369 హేతుబద్ధీకరించిన మాతృభాషలను 1,474 పేర్లతో అవిభాజ్యిత ఇతర భాషలుగా పేర్కొన్నారు. 10,000 లేదా అంతకంటే ఎక్కువమంది మాట్లాడే భాషలను 2011 జనాభా రికార్డుల్లో నమోదు చేశారు.
ప్రస్తుతం 10,000 లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్న సమూహం మాట్లాడే భాషల సంఖ్య 121. ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22 కాగా గుర్తింపు పొందని భాషల సంఖ్య 99 వీటిని ఇతర భాషల కేటగిరీలో చేర్చారు. 2001 జనాభా లెక్కల సమయంలో గుర్తింపు పొందని భాషల సంఖ్య 100గా ఉండగా 2011లో మాత్రం 99గా నమోదైంది. సిమ్టే, పర్షియన్ భాషలను 2011 జనాభా లెక్కల్లో మినహాయించడం, మవో భాషను కలపడం వల్ల ఈ సంఖ్య 99 కి చేరింది. అధికారిక భాషల సంఖ్య మాత్రం 2001 నుంచి 2011 వరకు 22గానే ఉంది.

యూపీఎస్సీ ద్వారా డీజీపీ ఎంపిక
డీజీపీలు లేదా పోలీస్ కమిషనర్లుగా నియమించదగ్గ సీనియర్ పోలీసు అధికారులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంపిక చేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్రాలు మూడు నెలలు ముందుగానే ఆ పదవుల్లో నియమించదగ్గ అధికారుల పేర్లను పంపాలని, వారిలో యూపీఎస్సీ ముగ్గురు అర్హులైన అధికారులను ఎంపిక చేస్తుందని వీరి నుంచి ఒకరిని పోలీస్ చీఫ్‌గా రాష్ట్రాలు నియమించుకోవచ్చని పేర్కొంది. అలాగే డీజీపీగా ఎంపిక చేసే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగవచ్చని అయితే పొడిగించిన కాలవ్యవధి సహేతుకంగా ఉండాలని తెలిపింది.
అదే విధంగా డీజీపీ ప్యానల్ పేర్లను ఎంపిక చేసేటప్పుడు వారి పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉండేలా చూసుకోవాలని యూసీఎస్సీకి సూచించింది. ప్యానెల్ పేర్ల ఎంపికలో ప్రతిభ, సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. పోలీసు సంస్కరణలపై సుప్రీం కోర్టు 2006లో ఇచ్చిన చారిత్రక తీర్పును అనుసరించి తాజా మార్గదర్శకాలను ధర్మాసనం విడుద ల చేసింది.

మద్దతు ధరలను పెంచిన కేంద్రం
2018
ఖరీఫ్ సీజన్‌కు ప్రధాన పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం జూలై 4న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వరి, కందులు, వేరుశనగ, పత్తి, రాగి, జొన్న, సజ్జ వంటి పంటల మద్దతు ధరలను సవరించింది. సాధారణ రకం వరి ఎమ్మెస్పీని క్వింటాల్‌కు రూ. 1550 నుంచి రూ. 1750కి, గ్రేడ్ఏ రకం వరికి క్వింటాల్‌కు రూ. 1590 నుంచి రూ. 1770కి పెంచారు. ఒక క్వింటాల్ వరి పండించడానికి రైతులకు రూ. 1,166 వ్యయం అవుతున్నట్లు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) లెక్కించింది. అలాగే పత్తి ఎమ్మెస్పీని రూ.4020 నుంచి రూ.5,150 రూపాయలకు పెంచారు.

అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డులు
అంధులకు త్వరలోనే బ్రెయిలీ ఓటర్ కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ జూలై 4న తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో దేశవ్యాప్తంగా సమన్వయకర్తలను నియమించనున్నట్లు ప్రకటించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ సర్వాధికారి కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు జూలై 4న తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదని, జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రత్యేకమైనది, భిన్నమైనది కాబట్టి ఎల్జీ హోదా రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదు. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే అని స్పష్టం చేసింది. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239ఏఏతో ముడిపడి ఉన్న అనేక విషయాలపై జులై 4న తీర్పు వెలువరించింది. శాంతి భద్రతలు, పోలీస్, భూములు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉందని పేర్కొంది.
ఏమిటీ వివాదం
2014
లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌జంగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. 2014లో గ్యాస్ ధరలను ఏకపక్షంగా నిర్ణయించారంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మురళీ దేవ్‌రా తదితరులపై కేజ్రీవాల్ కేసు పెట్టారు. ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనాను ఏసీబీ ఆఫీసులోకి ప్రవేశించనీయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఎల్జీ కేంద్రం మద్దతుతో తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఎస్సీ, ఎస్టీ చట్టం పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రకారం దళితులపై దాడులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చే నిబంధనను తొలగించడంతోపాటు నిందితుల అరెస్ట్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరంలేదు. అలాగే కేసు నమోదుకు కూడా ప్రాథమిక విచారణ చేయాల్సిన అవసరం లేదు.
నిందితులకు పలు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న నేపథ్యంలో కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు-2018ను లోక్‌సభ ఆగస్టు 6న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

ఎన్‌సీబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ (123) బిల్లు-2017కు పార్లమెంటు ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్‌సీబీసీకి లభించనున్నాయి. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం-1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లును పార్లమెంటు ఆమోదించింది.

రేప్‌లకు ఉరి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆగస్టు 6న మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు జూలై 30న లోక్‌సభ ఆమోదం తెలిపింది.

అత్యాచారాలపై సుప్రీంకోర్టు ఆందోళన
ఉత్తర, దక్షిణ, మధ్య భారతం అని తేడా లేకుండా దేశంలోని అన్నిచోట్లా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆగస్టు 7న తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం రోజుకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
త్రిపుల్ తలాక్‌కు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతోపాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన త్రిపుల్ తలాక్ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆగస్టు 9న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం భార్య వాదనలు విన్న తరువాత భర్తకు బెయిల్‌ను మంజూరు చేస్తారు. నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ లభించదు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సుమారు 35 లక్షల టన్నుల పప్పుదినుసులను రాయితీపై రాష్ట్రాలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్ ధర కన్నా కిలోకు రూ.15 తక్కువకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం విక్రయించనుంది.
ఓబీసీ కులాల ఉపవర్గీకరణకు జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పదవీకాలంను నవంబర్ వరకు పొడిగించారు.

చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌దే: సుప్రీంకోర్టు
చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కే ఉందని, వాటిపై తీర్పులు ఇవ్వడం వరకే న్యాయస్థానాల బాధ్యత అని సుప్రీంకోర్టు ఆగస్టు 9న వ్యాఖ్యానించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు స్పందించింది.

రాజీవ్‌గాంధీ కేసు దోషుల విడుదలకు అంగీకరించం : కేంద్రం
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరిని విడుదల చే స్తే ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని పేర్కొంది. ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు వీరిలో 19 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. 2014, ఫిబ్రవరి 18న మరోసారి ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను యావజ్జీవంగా మార్చింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా జోధ్‌పూర్
దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నిలిచింది. జోధ్‌పూర్ తర్వాత జైపూర్, తిరుపతి రైల్వే స్టేషన్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే అత్యంత పరిశభ్రమైన రైల్వే జోన్‌గా వాయువ్య రైల్వే (జైపూర్) అగ్రస్థానం కైవసం చేసుకుంది. వాయువ్య రైల్వే జోన్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్), తూర్పు తీర రైల్వే (భువనేశ్వర్ )లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లకు పరిశుభ్రత ఆధారంగా ఏటా ఇచ్చే ‘స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్’ ర్యాంకుల వివరాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 13న వెల్లడించారు. దేశంలోని రైల్వేలపై సర్వే చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను రూపొందించింది.

అత్యంత నివాస యోగ్యమైన నగరంగా పుణే
దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పుణే నిలిచింది. పుణే తర్వాత నవీ ముంబై, గ్రేటర్ ముంబై, తిరుపతి నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. దేశంలోని 111 నగరాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్ 27వ స్థానం సంపాదించగా బెంగళూరు 58వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలోఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంపూర్ చివరి స్థానంలో నిలవగా కోహిమా, పట్నా నగరాలు కూడా అట్టడుగున నిలిచాయి.

ఆయుష్మాన్ భారత్ అంబాసిడర్లుగా టీచర్లు

దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్కూల్ టీచర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరు టీచర్లను ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్లు’గా నియమిస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. అంబాసిడర్‌గా నియమితులైన టీచర్లు ఆయుష్మాన్ భారత్‌పై విద్యార్థుల్లో అవగాహన, ఆరోగ్యంపై చైతన్యం కల్పిస్తారు. ఇందుకోసం ముందుగా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖ సంయుక్తంగా అమలు చేయనున్న ఆయుష్మాన్ భారత్‌ను తొలి విడతగా 115 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేయనున్నారు.

అటల్ నగర్ గా నయా రాయ్‌పూర్ పేరు మార్పు
అటల్ నగర్’ గా ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ పేరును మార్పు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ తెలిపారు. అలాగే కొత్త రాజధానిలో పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టడంతోపాటు స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
రాయ్‌పూర్‌లోని సెంట్రల్ పార్కుకు, బిలాస్‌పూర్ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీకి, మార్వా థర్మల్ ప్లాంట్‌కు, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు ‘వికాస్ యాత్ర’ రెండో దశకు ‘అటల్ వికాస్ యాత్ర’గా పేరుమార్చింది. ప్రతి సంవత్సరం వాజ్‌పేయి పేరుపై కవులకు జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంతోపాటు ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ‘అటల్ బిహరీ వాజ్‌పేయి సుహాసన్ అవార్డు’ను అందించనున్నారు. భావితరాలు అటల్ జీవిత విశేషాలు తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఛత్తీస్‌గఢ్ కేబినెట్ నిర్ణయించింది.పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా రాష్ట్రంలోని ఓ బెటాలియన్‌కు ‘పోఖ్రాన్ బెటాలియన్’గా పేరు పెట్టనున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments