2018 Monthly Current Affairs – January – August (ECONOMY)

ఆర్థికం

2017-18లో భారత జీడీపీ అంచనా 6.5 శాతం

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 201718లో 6.5 శాతంగా ఉండనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్వో) జనవరి 5న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణంగా పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి 9.7 శాతం నుంచి 8.3 శాతానికి మందగించే అవకాశముంది.

రూ.2.16 లక్షల కోట్లకు ఏపీ రుణభారం

2018 బడ్జెట్నాటికి ఆంధ్రప్రదేశ్రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్లోక్సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018 బడ్జెట్నాటికి రూ.2,16,027 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

భారత జీడీపీపై ప్రపంచ బ్యాంక్ అంచనా

భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 201819లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్అంచనా వేసింది. ఆ తర్వాత 201920, 202021లో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ తెలిపింది. 2018 గ్లోబల్ఎకనామిక్స్ప్రాస్పెక్ట్స్పేరుతో ప్రపంచబ్యాంక్2018, జనవరి 9న విడుదల చేసిన తాజా నివేదికలో పై అంశాలను పేర్కొంది.

ఎఫ్ డీఐ నిబంధనలు మరింత సరళతరం

కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) ప్రోత్సహించేలా నిబంధనలను మరింత సరళతరం చేస్తూ 2018 జనవరి10న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాలో 49 శాతం పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్విధానంలో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. సింగిల్బ్రాండ్రిటైల్వ్యాపారంలో ఆటోమేటిక్రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతించింది.

ప్రపంచ తయారీ సూచీలో భారత్కు 30వ స్థానం

ప్రపంచ తయారీ సూచీలో భారత్కు 30వ స్థానం లభించింది. వరల్డ్ఎకనమిక్ఫోరం(డబ్ల్యూఎఫ్) 2018 జనవరి 14న విడుదల చేసిన ఈ నివేదిక సూచీలో జపాన్మొదటి స్థానంలో నిలిచింది. జపాన్తర్వాత స్థానాల్లో దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా ఉన్నాయి. భవిష్యత్తయారీ సంసిద్ధత అనే పేరుతో డబ్ల్యూఈఎఫ్తొలిసారి ఈ సూచీ రూపొందించింది.

201718 కేంద్ర ఆర్థిక సర్వే

201718 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సర్వే 201819 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిని 77.5 శాతంగా అంచనా వేసింది.

కీలకాంశాలు

 • 201718లో జీడీపీ వృద్దిరేటు 6.75 శాతంగా నమోదు కానుంది. ఇది కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువ.

 • 201819లో ఎగుమతులు, పెట్టుబడులు తిరిగి పుంజుకోనున్నాయి. 201617లో 7.1 శాతం; 201516లో 8 శాతం; 201415లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిపై జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది.

 • 201718లో రిటైల్ద్రవ్యోల్బణం 3.3 శాతంగా నమోదైంది. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్టం.

 • 201718లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం మేర పెరిగాయి.

20 పీఎస్బీలకు రూ.88 వేల కోట్లు

మొండిబకాయిలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,139 కోట్ల అదనపు మూలధనం అందనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ జనవరి 24న ప్రకటన చేశారు. ఈ మొత్తంలో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్కి రూ.10,610 కోట్లు, ఎస్బీఐకి రూ.8,800 కోట్లు దక్కనున్నాయి.

గువాహటిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

రెండు రోజుల గ్లోబల్ఇన్వెస్టర్స్సమ్మిట్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 3న అసోంలోని గువాహటిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ప్రధాని షెరింగ్తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, 16 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్201819

ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ 201819 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆయన ఏప్రిల్1 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.24,42,213 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. బడ్జెట్ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగ పటిష్టత, పేదల ఆరోగ్య భద్రత, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై దృష్టిసారించింది. జైట్లీ బడ్జెట్ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి.

ముఖ్యాంశాలు

 • బడ్జెట్మొత్తం: రూ.24,42,213 కోట్లు

 • రెవెన్యూ వసూళ్లు: రూ.17,25,738 కోట్లు

 • మూలధన వసూళ్లు: రూ.7,16,475 కోట్లు

 • 201819లో వృద్ధిరేటు 7.4 శాతంగా అంచనా, 201718లో ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి, 201819లో జీడీపీలో విత్తలోటు 3.3 శాతంగా లక్ష్యం, 201718లో విత్తలోటు రూ.5,94,8469(3.5 శాతం)గా సవరణ.

 • 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు.

 • ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతలకు రూ.1.38 లక్షల కోట్లు. పది కోట్ల కుటుంబాలకు లబ్ధిచేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా పథకం. దీని కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం.

 • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణం, పెట్టుబడి, వడ్డీ సబ్సిడీల కోసం రూ.3,790 కోట్లు.

 • 201819లో 7 లక్షలకుపైగా ఉద్యోగాల సృష్టి. ప్రతి జిల్లాలో మోడల్నైపుణ్య కేంద్రం ఏర్పాటు.

 • రైల్వేలకు మూలధన వ్యయం కింద రూ. 1,48,528 కోట్లు. 6,000 మేజర్రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.

 • వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎటాంటి మార్పులేదు, పన్ను శ్లాబులు యథాతథం.

 • పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరణ.

జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2.84 శాతం

టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.84 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి జనవరి 2017తో పోల్చితే 2018 జనవరి నాటికి టోకు ధరలు 2.84 శాతం మేర పెరిగాయని తెలుస్తుంది. ప్రభుత్వం ఫిబ్రవరి 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆరు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.

జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతం

జనవరిలో రిటైల్ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి.. 5.07 శాతంగా నమోదైంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం ఫిబ్రవరి 12న విడుదల చేసింది. అయితే ఇది రిజర్వ్బ్యాంక్మధ్యస్థ లక్ష్యమైన 4 శాతం కంటే అధికం. ఆహార, ఇంధన ధరల్లో పెరుగుదల రిటైల్ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది.

6వ ద్వైమాసిక పరిపత విధాన సమీక్ష

రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ఉర్జిత్పటేల్నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7న ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ను ప్రకటించింది. ఇందులో కీలకమైన రెపో రేటును 6 శాతంగా; రివర్స్రెపో రేటును 5.75 శాతంగా కొనసాగించింది.

బుందేల్ ఖండ్ లో డిఫెన్స్ కారిడార్

వెనుకబడిన బుందేల్ఖండ్ప్రాంతంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో డిఫెన్స్ఇండస్ట్రియల్కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. లక్నోలో ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్పెట్టుబడుల సదస్సు2018ను ప్రారంభించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.

విశాఖలో భాగస్వామ్య సదస్సు

విశాఖపట్నంలో ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజులపాటు భాగస్వామ్య సదస్సు జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సును కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి.

బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో చేరిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ఫిబ్రవరి 22న బాంబే స్టాక్ఎక్సే్ఛంజ్(బిఎస్ఇ)లో చేరింది. బాండ్ల ద్వారా తొలివిడతగా రూ.200 కోట్ల నిధులను సమీకరించి ఈ మేరకు బాంబే స్టాక్ఎక్సేంజ్ లో నమోదైంది. ఈ నిధులతో హైదరాబాద్నగరాన్ని సిగ్నిల్ఫ్రీ రహిత నగరంగా చేయడానికి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకాన్ని (ఎస్ఆర్డిపి) చేపడతారు. ఆర్ధిక క్రమ శిక్షణ, ఆదాయ మార్గాల స్థిరత్వం, అంతర్గత వనరుల వృద్ధి, మిగులు నిధులు తదితర అంశాల్లో నమ్మకమైన పురపాలక సంస్థగా ఏఏ స్టేబుల్రేటింగ్సాధించడంతో బాండ్ల జారి సులువైంది. దశల వారిగా ఎస్ఆర్డిపి కోసం వెయ్యి కోట్లను బల్దియా బాండ్ల రూపంలో సేకరించాలని నిర్ణయించారు.

ఫోర్బ్స్బిలియనీర్ల జాబితా2018

ఫోర్బ్స్బిలియనీర్ల జాబితా2018 ప్రపంచ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్మార్చి 6న ప్రకటించింది. ఫోర్బ్స్ప్రపంచ బిలియనీర్ల జాబితా 2018లో తొలిసారిగా అమెజాన్వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్బెజోస్అగ్రస్థానంలో నిలిచారు. బెజోస్సంపదను ఫోర్బ్స్112 బిలియన్డాలర్లుగా అంచనా వేసింది. మైక్రోసాఫ్ట్సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్90 బిలియన్డాలర్లతో రెండో స్థానంలో, అమెరికా వ్యాపార దిగ్గజం వారెన్బఫెట్84 బిలియన్డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.

ఈశాన్య రాష్ట్రాలకు 2020 వరకు పన్ను ప్రోత్సాహకాలు

ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకు పొడిగించింది. దీనికోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం2017 పేరుతో పన్ను ప్రోత్సాహకాలను అందించనున్నారు.

కీలక వడ్డీ రేట్లు యథాతథం

రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా(ఆర్బీఐ) ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో రెపో రేటు 6 శాతంగా, రివర్స్రెపో రేటు 5.75 శాతంగా కొనసాగుతాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి పరపతి విధాన సమీక్ష. తొలి క్వార్టర్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పెరుగుతుందని, 201819లో రియల్జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 130వ స్థానం

అమెరికాకు చెందిన హెరిటేజ్ఫౌండేషన్180 దేశాలతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్కు 130వ స్థానం దక్కింది. కాగా, 2017తో పోల్చితే భారత్13 స్థానాలను మెరుగుపరుచుకోగా, చైనా ఒక స్థానం ఎగబాకి 110వ ర్యాంకు పొందింది. ఆసియా పసిఫిక్ప్రాంతంలో 43 దేశాల్లో భారత్కు 30వ స్థానం దక్కింది.

భారత వృద్ధిపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా

ఆసియా అభివృద్ధి బ్యాంకు 201819లో భారత వృద్ధిరేటును 7.3 శాతంగా అంచనా వేసింది. ఇది 201920లో 7.6 శాతానికి చేరుతుందని పేర్కొంది. ఆసియా దేశాల్లో భారత్దే అధిక వృద్ధిరేటు అవుతుందని అభిప్రాయపడింది. వరుసగా రెండేళ్లు తక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన భారత్..ఈ సంవత్సరం నుంచి పుంజుకోనుందని తెలిపింది.

కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏప్రిల్10న దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్, అప్పటి కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరె గౌడ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. రాష్ట్రాలకు నిధుల పంపిణీకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షపూరితంగా ఉన్నాయని.. వాటిని రద్దు చేసి కొత్త విధానాలను రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు డిమాండ్చేశాయి. తమిళనాడు, తెలంగాణ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

లెఫ్టినెంట్గవర్నర్ల జీతభత్యాల పెంపు

లెఫ్టినెంట్గవర్నర్ల జీతభత్యాలను పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ఏప్రిల్11న నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్గవర్నర్కు నెలసరి వేతనంగా రూ.2,25,000 అందనుంది. పెరిగిన జీతభత్యాలు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

ఎస్ఏఈఎఫ్ నివేదిక..

ప్రపంచ బ్యాంకు రెండేళ్లకొకసారి విడుదల చేసే సౌత్ఏషియా ఎకనమిక్ఫోకస్(ఎస్ఏఈఎఫ్) నివేదికను ఉపాధిలేని వృద్ధి పేరుతో ఏప్రిల్16న విడుదల చేసింది. ఇందులో భారత్కు ఏటా 8.1 మిలియన్ల ఉద్యోగాలు అవసరమని వెల్లడించింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేసింది.

100 బి.డా. మైలురాయిని అందుకున్న టీసీఎస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లిమిటెడ్ఏప్రిల్23న ఇంట్రాడే ట్రేడ్లో 100 బిలియన్డాలర్ల(దాదాపు రూ.6.80 కోట్లు) మైలురాయిని అందుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా గుర్తింపు పొందింది. కానీ, ట్రేడింగ్ముగిసేసరికి టీసీఎస్మార్కెట్విలువ 98.8 బిలియన్డాలర్లకు తగ్గడం గమనార్హం.

భారత్ పై ఐఎంఎఫ్..

భారత్2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు.. వరుసగా 6.6 శాతం, 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.

అత్యంత సంపన్న దేశం.. అమెరికా

ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో 62,584 బిలియన్డాలర్లతో అమెరికా అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. చైనా 24,803 బిలియన్డాలర్లతో రెండో స్థానంలో, 19,522 బిలియన్డాలర్లతో జపాన్మూడో స్థానంలో నిలవగా, 8,230 బిలియన్డాలర్ల సంపదతో భారత్ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ సంపద వలస సమీక్ష పేరుతో మారిషస్లోని ఏఎఫ్ఆర్ఆసియా బ్యాంకు మే 20న ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

రూ.5,000 కోట్లతో నాబార్డు ఫండ్

సూక్ష్మసేద్యాన్ని విస్తరించే లక్ష్యంతో నాబార్డు ద్వారా రూ.5,000 కోట్ల ఫండ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన కింద సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించేందుకు ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నారు.

మే నెలలో 4.87 శాతంగా ద్రవ్యోల్బణం

ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఏప్రిల్నెలలో 4.58% గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 4.87% గా నమోదైంది. ఇంత స్థాయిలో రిటైల్ధరలు పెరగడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.18% గా ఉండటం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రిటైల్ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.

మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 4.43 శాతం

ఏప్రిల్లో 3.18 శాతంగా ఉన్న టోకు ధరల (హోల్సేల్ధరల ఆధారిత) ద్రవ్యోల్బణం మే నెలలో 4.43 శాతానికి పెరిగింది. ఇది 14 నెలల్లో గరిష్ట స్థాయి. గతేడాది మే నెలలో ఇది 2.26 శాతం. ఇక ఆహారోత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.87 శాతం కాగా, మే నెలలో 1.60 శాతానికి చేరింది. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఇంధనం, విద్యుత్విభాగంలో 11.22 శాతంగా నమోదైంది. ఇది ఏప్రిల్లో 7.85 శాతంగా ఉంది. ఈ గణాంకాలను జూన్ 14న కేంద్రం విడుదల చేసింది.

భారత్ వృద్ధిరేటు 7.3 శాతం

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం, 2019-20లో 7.6 శాతంగా నమోదవుతుందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) జూలై 19న అంచనా వేసింది. భారత్ కారణంగా దక్షిణాసియా అత్యధిక వేగంతో వృద్ది చెందుతున్న ప్రాంతంగా ఉంటుందని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు చైనా వృద్ధి 2018లో 6.6 శాతం, 2019లో 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. 2017లో చైనా వృద్ధి రేటు 6.9 శాతం ఉండగా భారత్ 6.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

88 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు వంటి 88 రకాల వస్తువులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. శానిటరీ న్యాప్కిన్లపై మొత్తం పన్ను రద్దయింది. ఈ మేరకు కొత్త పన్ను రేట్లు జూలై 27 నుంచి అమల్లోకి వస్తాయని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి తెలిపింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ అధ్యక్షతన ఢిల్లీలో జూలై 21న జరిగిన జీఎస్టీ మండలి 28వ సమావేశంలో జీఎస్టీ చట్టంలో మొత్తం 40 సవరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది.
అలాగే ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేస్తున్న రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలు ఇకపై మూడు నెలలకోసారి సమర్పించవచ్చు. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఆర్‌సీఎం (రివర్స్ చార్జ్ మెకానిజం) అమలును వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేయనున్నారు. కాంపొజిషన్ పథకం పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచారు.
28
శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తువులు
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు (28 అంగుళాల కంటే చిన్నవి), విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు, వీడియో గేమ్స్ పరికరాలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, లారీలు, ట్రక్కుల వెనుక ఉండే కంటెయినర్లు, జ్యూసర్ మిక్సర్లు గైండర్లు, షేవింగ్ పరికరాలు, హెయిర్, హ్యాండ్ డ్రయ్యర్లు, వాటర్ కూలర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, పెయింట్లు, వాల్‌పుట్టీలు, వార్నిష్‌లు, లిథియంఅయాన్ బ్యాటరీలు, పర్ఫ్యూమ్‌లు, టాయిలెట్ స్ప్రేలు

సుకన్య సమృద్ధి యోజన కనీస డిపాజిట్ తగ్గింపు
ఆడ పిల్లల పేరిట పొదుపు చేసేందుకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకం వార్షిక కనీస డిపాజిట్‌ను రూ.250కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 22న నిర్ణయం తీసుకుంది.వార్షిక ప్రీమియంను కూడా రూ.250 కి తగ్గించింది. ప్రస్తుతం కనీస డిపాజిట్ రూ. 1000 గా ఉండగా డిపాజిట్లపై వడ్డీ రేటు జూలైసెప్టెంబర్ త్రైమాసికానికి 8.1 శాతంగా ఉంది.
ఈ పథకం కింద 2017 నవంబర్ నాటికి 1.26 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా రూ.19,183 కోట్ల మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ అయ్యింది.

రైతుబంధుకు 3 లక్షల కోట్లు: ఎస్‌బీఐ
దేశవ్యాప్తంగా రైతుబంధు పథకంను అమలు చేయడానికి రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు రైతులు పండించిన పంటకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, భవంతర్ భుగ్తాన్ యోజన (బీబీవై) పథకం, రైతుబంధుపై జాతీయ స్థాయిలో రూపొందించిన పరిశోధన పత్రంను జూలై 6న విడుదల చేసింది. రైతుబంధును అమలు చేయడంలో వ్యవస్థీకృతంగా ఎలాంటి లోపాలు తలెత్తక పోవడంతోపాటు అక్రమాలు కూడా జరగవని ఎస్‌బీఐ తెలిపింది. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం అమలు చేయడం కంటే రైతుబంధు పథకానికే అధికంగా ఖర్చవుతుందని విశ్లేషించింది. ఈ మూడు పథకాలు రైతు సమస్యలకు తక్షణ పరిష్కారమే చూపుతాయని, దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవని ఎస్‌బీఐ పేర్కొంది.

నోయిడాలో శాంసంగ్ మొబైల్ తయారీ ప్లాంటు
ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ శాంసంగ్ ప్లాంటును జూలై 9న ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 6.8 కోట్లుగా ఉన్న శాంసంగ్ హ్యాండ్‌సెట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా 2020 నాటికి 12 కోట్లకు పెంచుకునేందుకు ఈ కొత్త ప్లాంటు తోడ్పడనుంది. ఇందులో కొత్తగా 2,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇక్కడ తయారయ్యే స్మార్ట్‌ఫోన్స్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి అవుతాయని శాంసంగ్ ఇండియా సీఈవో హెచ్‌సీ హాంగ్ తెలిపారు.

భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా కార్యకలాపాలు

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. చైనాలో 2018 జూన్ లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ జరిపిన చర్చల్లో భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా ఏర్పాటుకు మోదీ అంగీకారం తెలిపారు. దీంతో భారత్‌లో తొలి బ్రాంచ్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ జులై 4న లెసైన్స్ జారీ చేసింది.

ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) మరింత పెరగనున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2017-18 చివరికి ఎన్‌పీఏలు 11.6శాతం కాగా, ఇవి మరో 0.6% పెరిగి 2018-19 చివరికి 12.2 శాతానికి పెరిగి బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) అంచనా. సత్వర దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు గత మార్చికి 21% కాగా, వచ్చే మార్చి ఆఖరుకు 22.3 శాతానికి పెరగనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 11 బ్యాంకుల్లో 6 బ్యాంకులకు నష్టభయం ఆధారిత ఆస్తుల నిష్పత్తి (సీఆర్‌ఏఆర్) దృష్ట్యా మూలధన కొరత ఏర్పడుతుందని పేర్కొంది.

రూ.125 నాణేన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి
12
వ వార్షిక గణాంక దినాన్ని పురస్కరించుకుని రూ.125 ముఖ విలువ గల స్మారక నాణేన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జూన్ 29న కోల్‌కతాలో ఆవిష్కరించారు. భారతీయ గణాంక సంస్థ వ్యవస్థాపకుడు పీసీ మహలనోబిస్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. మహలనోబిస్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ 2007 నుంచి జూన్ 29ను గణాంక దినంగా పాటిస్తున్నట్లు కేంద్ర గణాంక మంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు.

ఫార్చూన్ జాబితాలో ఏడు భారత కంపెనీలు

అత్యంత విలువైన కంపెనీలతో ఫార్చూన్ రూపొందించిన ఫార్చూన్-500 జాబితాలో ఏడు భారత కంపెనీలకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఆదాయం పరంగా 65.9 మిలియన్ డాలర్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 137 స్థానం(2017లో 168వ స్థానం)లో నిలవగా ముకేశ్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ 62.3 బిలియన్ డాలర్లతో 148వ ర్యాంకు(2017లో 203వ ర్యాంకు) సాధించింది. అలాగే 47.5 బిలియన్ డాలర్లతో ఓఎన్‌జీసీ 197 ర్యాంకు, 47.5 బిలియన్ డాలర్లతో ఎస్‌బీఐకి 216వ ర్యాంకు, టాటా మోటార్స్ 232వ ర్యాంకు, బీపీసీఎల్ 314వ ర్యాంకు (2017లో 360వ ర్యాంకు), రాజేష్ ఎక్స్‌పోర్‌‌ట్స 405వ ర్యాంకు(2017-295వ ర్యాంకు) ను సొంతం చేసుకున్నాయి.
ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అదే విధంగా అంతర్జాతీయంగా అధిక లాభాలు కలిగిన కంపెనీల జాబితాలో భారత్ కి చెందిన ఆర్‌ఐఎల్ 99వ ర్యాంకు దక్కించుకుంది.

ఐడీబీఐలో ఎల్‌ఐసీకి 51 శాతం వాటా
ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.10,000-13,000 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7.5 శాతం వాటా ఉంది.
మరోవైపు హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) 15 శాతం తాజా ఈక్విటీ జారీ చేయడం ద్వారా రూ.900 కోట్లను సమీకరించేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 76.05 శాతం వాటా 66.13 శాతానికి తగ్గిపోనుంది.

పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీకి అగ్రస్థానం
2018
సంవత్సరంలో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) రూపొందించిన జాబితాను ఆగస్టు 3న విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 2017లో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది.

కేంద్రానికి 50 వేల కోట్ల డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2017-18)లో కేంద్ర ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. 2017లో ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డివిడెండ్‌తో పోలిస్తే(రూ.30,659 కోట్లు) ఇది 63 శాతం అధికం. కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) ఈ మొత్తం దోహదపడనుంది. ఆర్‌బీఐ జూలైజూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

భారత్ వృద్ధి తీరు పటిష్టం : ఐఎంఎఫ్

భారత్ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆగస్టు 9న పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2018-19లో ద్రవ్యోల్బణం 5.2 శాతం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 2.6 శాతంగా ఉంటుందని పేర్కొంది.

అత్యంత సంపన్నురాలుగా స్మితా కృష్ణ
దేశంలో అత్యంత సంపన్నురాలుగా గోద్రేజ్ గ్రూప్ మూడవ తరం వారసురాలైన స్మితా కృష్ణ నిలిచింది. ఈ మేరకు అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళలతో కొటక్ వెల్త్, హురున్‌లు సంయుక్తంగా రూపొందించిన జాబితాను ఆగస్టు 13న విడుదల చేశారు. ఈ జాబితాలో రూ.37,570 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్న స్మితా గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో ఐదింట ఒక వంతు వాటాను కలిగి ఉంది. ఈ జాబితాలో రూ.30,200 కోట్ల సంపదతో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రోషిణి నాడార్ రెండవ స్థానంలో ఉండగా రూ.26,240 కోట్లతో టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందు జైన్ 3వ స్థానం ఉన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments