2018 Monthly Current Affairs – January – August (Awards)

అవార్డులు

18 మంది చిన్నారులకు సాహస అవార్డులు

ధైర్యసాహసాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన బాలలకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 24న జాతీయ సాహస బాలల పురస్కారాలు ప్రదానం చేశారు. మొత్తం 18 మంది చిన్నారులు అవార్డులు గెలుచుకోగా, వీరిలో ఏడుగురు బాలికలు ఉన్నారు. ముగ్గురికి మరణానంతరం పురస్కారం దక్కింది. అవార్డులను ఐదు విభాగాల్లో ప్రకటించారు.

85 మందికి పద్మ పురస్కారాలు

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 85 మందికి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలు ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా; ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫాఖాన్‌; కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడు పరమేశ్వరన్‌లకు పద్మవిభూషణ్‌పురస్కారం దక్కింది. క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోనీ సహా తొమ్మిది మందికి పద్మభూషణ్‌పురస్కారం, 73 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. గ్రహీతల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌(బాడ్మింటన్‌)కు పద్మశ్రీ దక్కింది.

ఉత్తమ్‌జీవన్‌రక్ష పాదక్‌అవార్డు

తీవ్రవాదుల బుల్లెట్ల నుంచి తప్పించుకుంటూ.. చాకచక్యంగా బస్సును నడిపి 52 మంది అమర్‌నాథ్‌యాత్రికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌షేక్‌సలీం గఫూర్‌కు ఉత్తమ్‌జీవన్‌రక్ష పాదక్‌అవార్డు లభించింది.

ప్రకాశ్‌నిరోలాకు అశోక చక్ర

ఉగ్రవాదులతో పోరాడి అమరుడైనగరుడ్‌కమాండో ఫోర్స్‌కు చెందిన ప్రకాశ్‌నిరోలాకు కేంద్రం అశోక చక్ర పురస్కారం ప్రకటించింది. రాష్ట్రపతి జనవరి 25న మొత్తం 390 మందికి సాహస పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్‌విశిష్ట సేవా, 4 ఉత్తమ్‌యుద్ధ్‌సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు దక్కాయి.

షారుఖ్ ఖాన్ కు క్రిస్టల్ అవార్డు

ప్రముఖ బాలీవుడ్‌నటుడు షారుఖ్‌ఖాన్‌జనవరి 22న దావోస్‌లో 24వ క్రిస్టల్‌అవార్డు అందుకున్నారు. భారత్‌లో మహిళలు, బాలల హక్కుల దిశగా షారుఖ్‌చేస్తున్న సేవలను గుర్తించి వరల్డ్‌ఎకనమిక్‌ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఈ పురస్కారం అందించింది. షారుఖ్‌తోపాటు మ్యుజీషియన్‌ఎల్టన్‌జాన్, హాలీవుడ్‌నటి కేట్‌బ్లాంచెట్‌లకు ఈ అవార్డు దక్కింది. బ్లాంచెట్‌శరణార్థుల పరిరక్షణకు కృషి చేయగా; ఎల్టన్‌జాన్‌ఎయిడ్స్‌పౌండేషన్‌లో పనిచేశారు. ఈ అవార్డును సామాజిక సేవలో పాల్గొంటున్న కళాకారులకు అందిస్తారు.

గణతంత్ర దినోత్సవం.. శకటాలకు అవార్డులు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 26న రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన శకటాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ బహుమతులను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌జనవరి 28న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రాల కేటగిరీలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని చూపుతూ మహారాష్ట్ర ప్రదర్శించిన శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. అసోం, ఛత్తీస్‌గఢ్‌శకటాలకు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కాయి. మంత్రిత్వ శాఖల కేటగిరీలో క్రీడలు, యువజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖS శకటానికి ఉత్తమ అవార్డు దక్కింది. త్రివిధ దళాల్లో ఆర్మీ పంజాబ్‌రెజిమెంట్‌; పారామిలటరీ దళాల్లో ఐటీబీపీలు ఉత్తమ కవాతు ట్రోఫీ పొందాయి.

90వ ఆస్కార్‌అవార్డులు

90వ ఆస్కార్‌అవార్డులను లాస్‌ఏంజిల్స్‌(అమెరికా)లో 2018, మార్చి 5న ప్రదానం చేశారు. ఈ ఏడాది ది షేప్‌ఆఫ్‌వాటర్‌కు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాకు ఈ సంవత్సరం ఎక్కువ అవార్డులు దక్కాయి. బెస్ట్‌పిక్చర్‌తోపాటు బెస్ట్‌డైరెక్టర్, బెస్ట్‌ఒరిజినల్‌స్కోర్, బెస్ట్‌ప్రొడక్షన్‌డిజైన్‌ఇలా మొత్తం నాలుగు అవార్డులు లభించాయి.

ఉత్తమ చిత్రం : ది షేప్‌ఆఫ్‌వాటర్‌

ఉత్తమ దర్శకుడు: గెలెర్మో డెల్టొరో(ది షేప్‌ఆఫ్‌వాటర్‌)

ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్‌(త్రీ బిల్‌బోర్డ్స్‌ఔట్‌సైడ్‌ఎబ్బింగ్, మిస్సోరి)

ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మేన్‌(డార్కెస్ట్‌అవర్‌)

ఉత్తమ సహాయ నటి: ఎలిసన్‌జేనీ(, టోన్యా)

ఉత్తమ సహాయ నటుడు: సామ్‌రాక్‌వెల్‌(తీ బిల్‌బోర్డ్స్‌ఔట్‌సైడ్‌ఎబ్బింగ్, మిస్సోరి)

ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): జోర్డాన్‌పీలే(గెట్‌ఔట్‌)

65 జాతీయ చలనచిత్ర అవార్డులు

జాతీయ చలనచిత్ర అవార్డుల(65)ను ఏప్రిల్‌12న న్యూఢిల్లీలో ప్రకటించారు. అస్సామీ చిత్రం విలేజ్‌రాక్‌స్టార్స్‌ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

అవార్డు విజేతలు

దాదా సాహెబ్‌ఫాల్కే: వినోద్‌ఖన్నా

ఉత్తమ చిత్రం: విలేజ్‌రాక్‌స్టార్స్‌(అస్సామీ)

ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం(నర్గీస్‌దత్‌అవార్డు): ఢప్పా(గుజరాతీ)

హిందీ ఉత్తమ చిత్రం: న్యూటన్‌

ఉత్తమ నటి: శ్రీదేవి(మామ్‌)

ఉత్తమ నటుడు: రిద్ధీ సేన్‌(నగర్‌కీర్తన్‌బెంగాలీ)

ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌(భయానకమ్‌మలయాళం)

ఉత్తమ పోరాట చిత్రం: బాహుబలి2

ఉత్తమ స్పెషల్‌ఎఫెక్ట్స్‌: బాహుబలి2

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: బాహుబలి2

ఉత్తమ సంగీత దర్శకుడు: ఏఆర్‌రెహమాన్‌

ఉత్తమ గాయకుడు: జేసుదాసు

ఉత్తమ గాయని: షా షా తిరుపతి

ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ

కోహ్లీ, మిథాలీలకు విజ్డెన్ పురస్కారాలు

భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌విరాట్‌కోహ్లి, మహిళల జట్టు కెప్టెన్‌మిథాలీ రాజ్‌ప్రఖ్యాత క్రికెట్‌మ్యాగజైన్‌విజ్డెన్‌పురస్కారాలకు ఎంపికయ్యారు. విరాట్‌వరుసగా రెండో ఏడాది విజ్డెన్‌లీడింగ్‌క్రికెటర్‌ఇన్‌ద వరల్డ్‌అవార్డుకు ఎంపిక కాగా, ఫార్‌మోస్ట్‌టీ20 ప్లేయర్‌గా రషీద్‌ఖాన్‌(అఫ్గానిస్థాన్‌) ఎంపికయ్యారు.

వరదరాజన్ కు షోరెన్ స్టెయిన్ అవార్డు

ప్రముఖ న్యూస్‌వెబ్‌సైట్‌ద వైర్‌వ్యవస్థాపక ఎడిటర్‌సిద్దార్థ వరదరాజన్‌స్టాన్‌ఫోర్డ్‌యూనివర్సిటీ షోరెన్‌స్టెయిన్‌జర్నలిజం అవార్డుకు ఎంపికయ్యారు. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు 2017 సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

పులిట్జర్‌పురస్కారాలు

న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో ఏప్రిల్‌17న పులిట్జర్‌పురస్కారాలను ప్రకటించారు. పబ్లిక్‌సర్వీస్‌విభాగంలో న్యూయార్క్‌టైమ్స్, న్యూయార్కర్‌లకు పులిట్జర్‌ప్రైజ్‌లభించింది. జోడీ కెంటర్, మేగన్‌టౌహీల నేతృత్వంలోని టైమ్స్‌బృందం, న్యూయార్కర్‌కంట్రిబ్యూటర్‌రోనన్‌ఫారోకు అవార్డు దక్కింది.

యుద్‌వీర్‌ఫౌండేషన్‌స్మారక పురస్కారం

2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక యుద్‌వీర్‌ఫౌండేషన్‌స్మారక పురస్కారం.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ఉస్మాన్‌అజహర్‌మక్సూసీకి దక్కింది. ఉచితంగా అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది.

బీసీసీఐ అవార్డులు

భారత క్రికెట్‌నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అవార్డ్స్‌కమిటీ ఏప్రిల్‌28న సీకే నాయుడు లైఫ్‌టైమ్‌అచీవ్‌మెంట్‌అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో 201617 సంవత్సారానికి పంకజ్‌రాయ్‌(మరణానంతరం), 201718 సంవత్సరానికి అన్షుమన్‌గైక్వాడ్‌; మహిళల విభాగంలో 201617 సంవత్సరానికి డయానా ఎడుల్జీ, 201718 సంవత్సరానికి సుధా షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు.

సరస్వతి సమ్మాన్ పురస్కారం

ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కవితా సంకలనం వాఖర్‌2017 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్‌పురస్కారానికి ఎంపికైంది. వాఖర్‌2009లో ప్రచురితమై అత్యంత ఆదరణ పొందింది. సమకాలీన గుజరాతీ రచయితల్లో అగ్రగణ్యుడిగా పేరొందారు. ఈ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్‌అందిస్తోంది.

భారత్ బయోటెక్ కు జాతీయ సాంకేతిక అవార్డు

వివిధ వ్యాధి నిరోధక టీకాల పరిశోధనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారత్‌బయోటెక్‌సంస్థకు జాతీయ సాంకేతిక అవార్డు లభించింది. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌అవార్డును సంస్థ ప్రతినిధులకు అందజేశారు. రోటావ్యాక్‌వ్యాక్సిన్‌ను విజయవంతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు భారత్‌బయోటెక్‌కు అవార్డు లభించింది.

ఇద్దరు భారతీయులకు మెగసెసె అవార్డు

ఇద్దరు భారతీయలకు ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డు లభించింది. మానసిక వైద్యుడు భరత్ వాత్వానీ, ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లు అవార్డుకు ఎంపికైనట్లు మెగసెసె ఫౌండేషన్ జూలై 26ప్రకటించింది.
ముంబైకి చెందిన భరత్ వాత్వానీ వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. ఇందుకోసం వాత్వానీ దంపతులు 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
జమ్మూకశ్మీర్‌కి చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఈశాన్య భారతం, లడఖ్ యువతకు సృజనాత్మక బోధనా పద్ధతులతో విద్యను అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పడుతున్నారు. ఇందుకోసం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే 1994లో ఆపరేషన్ న్యూ హోప్ (ఓఎన్‌హెచ్)ను చేపట్టారు.
వీరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్‌లు మెగసెసె అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ప్రదానం చేయనున్నారు. అవార్డు విజేతలకు రూ.20.6 లక్షల నగదు బహుమతితోపాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్‌ను ప్రదానం చేస్తారు.

శాంతాదేవికి మాలతీచందూర్ పురస్కారం
ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారం – 2018 లభించింది. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జూలై 28న తెలిపారు. ఆగస్టు 25న హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డును ప్రదానం చేస్తారు.
తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన నవలా రచయిత్రికి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చందూర్ కుటుంబం, స్నేహితులు సంయుక్తంగా ఏటా మాలతీ చందూర్ పురస్కారాన్ని అందచేస్తారు.

ద ఇంగ్లిష్ పేషంట్’కు గోల్డెన్ బుకర్ ప్రైజ్
శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్ పేషంట్’ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఈ మేరకు గత యాభై ఏళ్లలో బుకర్ ప్రైజ్ సాధించిన పుస్తకాల్లో అత్యుత్తమమైందిగా ఎంపికైంది. 1992లో ‘ద ఇంగ్లిష్ పేషంట్’ నవల బేరీ ఉన్స్ వర్త్ రచన ‘సేక్రెడ్ హంగర్’తో కలిసి బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ, సంఘర్షణకు సంబంధించిన కథను ఆందాజీ ఆ నవలలో రచించారు.
జూలై 9న లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ చైర్మన్ హెలెనా కెన్నెడీ మాట్లాడుతూ ద ఇంగ్లిష్ పేషంట్ కవితాత్మక, తాత్విక అంశాలతో కూడిన సమగ్ర రచన అని అన్నారు. 2008లో బుకర్ ప్రైజ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఓటింగ్ నిర్వహించగా ప్రజలు సల్మాన్ రష్దీ ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’ను ఎంపిక చేశారు.
గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన భారతీయ మూలాలు కలిగిన రచయితలు వీఎస్ నైపాల్ (ఇన్ ఎ ఫ్రీ స్టేట్-1971), సల్మాన్ రష్దీ (మిడ్‌నైట్స్ చిల్డ్రన్-1981), అరుంధతీరాయ్ (ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్‌‌స-1997), కిరణ్ దేశాయ్ (ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్-2006), అరవింద్ అడిగ (ద వైట్ టైగర్-2008).

ఇస్రో శాస్త్రవేత్త సురేష్‌కు పయనీర్ అవార్డు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బైరన నాగప్ప సురేష్ కు పయనీర్ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ అన్ సిస్టం (ఇన్ కోస్) అనే సంస్థ అమెరికాలో జూలై 10 ఈ అవార్డును ప్రదానం చేసింది.
శ్రీహరికోటలో జరిగే ప్రతి ప్రయోగానికి వెహికల్ సిద్ధం అయ్యాక మిషన్ రె డీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) కమిటీకి చైర్మన్‌గా సురేష్ వ్యవహరిస్తుంటారు. ఇస్రోకు ఆయన చేసిన సేవలకు 2002లో పద్మశ్రీ, 2013 పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

గాయని సుశీలకు తెలుగు వైభవ పురస్కారం
సినీగాయని, పద్మభూషణ్ పి. సుశీలకు ‘మండలి వెంకట కృష్ణారావు (ఎంవీకేఆర్) తెలుగు వైభవ పురస్కారం’ లభించింది. ఈ మేరకు మండలి ఫౌండేషన్ తరఫున తొలి పురస్కారంను సుశీలకు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆగస్టు 1న తెలిపారు. ఆగస్టు 4న అవనిగడ్డ గాంధీక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె వడ్డి విజయ చాముండేశ్వరి ఈ పురస్కారాన్ని సుశీలకు ప్రదానం చేస్తారు. ఇప్పటికే సుశీల 20వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు పేరుమీద అందిస్తున్న ఈ పురస్కారం ద్వారా రూ.1 లక్ష నగదు, జ్ఞాపికను ప్రదానం చేస్తారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌కు పద్మనాభన్ పురస్కారం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మణప్పురం ఫైనాన్స్ సంస్థ నెలకొల్పిన వీసీ పద్మనాభన్ స్మారక జీవితకాల సాఫల్య పురస్కారం 2018 లభించింది. ఆగస్టు 4న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్‌కు ఈ అవార్డును న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments