సైన్స్అండ్ టెక్నాలజీ
పాక్ క్షిపణి హర్బా
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్తాన్నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు.
రాఫెల్ ఒప్పందం రద్దు
ట్యాంకుల నిరోధక క్షిపణులను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్అడ్వాన్స్డ్డిఫెన్స్సిస్టమ్స్లిమిటెడ్తో కుదుర్చుకున్న రూ.3,175 కోట్ల (సుమారు) విలువైన రక్షణ ఒప్పందాన్ని భారత్రద్దు చేసుకుంది. ఈ మేరకు రాఫెల్జనవరి 3న వెల్లడించింది.
భారత్ సూపర్ కంప్యూటర్.. ప్రత్యూష్
భారత్సూపర్కంప్యూటర్ప్రత్యూష్ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాఫ్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాఫ్లాప్అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ఆపరేషన్స్చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ఇన్స్టిట్యూట్ఆఫ్ట్రాపికల్æ మెటియోరాలజీ తెలిపింది. వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్కంప్యూటర్లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్ఏ తర్వాత భారత్‌నాలుగో స్థానంలో నిలిచింది.
ఇస్రో.. 100..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తన 100వ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ధావన్స్పేస్సెంటర్(షార్) నుంచి 2018 జనవరి 12న పీఎస్ఎల్వీసీ–40 రాకెట్మొత్తం 31 ఉపగ్రహాలను ఒకేసారి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది పీఎస్ఎల్వీ 41వ ప్రయోగం. పీఎస్ఎల్వీసీ–40 వాహక నౌక కార్టోశాట్–2ను 510 కిలోమీటర్ల ఎత్తులో, మరో 29 ఉపగ్రహాలను 519 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టింది. రాకెట్మళ్లీ అక్కడి నుంచి 359 కిలోమీటర్లు కిందకు వచ్చి చివరిదైన ఐఎన్ఎస్–1సీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. కార్టోశాట్బరువు 710 కిలోలు కాగా, మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 613 కిలోలు. కార్టోశాట్–2 సిరీస్వల్ల భారత్రిమోట్సెన్సింగ్వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇందులో పాన్క్రోమాటిక్, మల్టీస్పెక్ట్రల్కెమెరాలు ఉన్నాయి. వీటిద్వారా తీసే చిత్రాలు కార్టోగ్రాఫిక్అప్లికేషన్లు, పట్టణ గ్రామీణ అవసరాలు, రహదారులు, నీటిసరఫరా పరిశీలన, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
సరస్ విమానం..
బెంగళూరులోని నేషనల్ఏరోనాటిక్స్ల్యాబొరేటరీ (ఎన్ఏఎల్) అభివృద్ధి చేసిన 14 సీట్ల సరస్విమానాన్ని జనవరి 24న విజయవంతంగా పరీక్షించారు. 2009లో పరీక్షించిన సరస్విమానం కూలి ముగ్గురు పైలట్లు మరణించారు. దానికి అప్గ్రేడెడ్వెర్షన్గా ఈ విమానాన్ని రూపొందించి, పరీక్షించారు.
అగ్ని-5 పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్‌క్షిపణి అగ్ని–5ను భారత్జనవరి 18న అబ్దుల్‌కలాం దీవి (ఒడిశా)లోని సమీకృత పరీక్ష వేదిక(ఐటీఆర్) నుంచి 5వసారి విజయవంతంగా పరీక్షించింది. సైనిక దళాల సమక్షంలో ఈ „ì పణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. అగ్ని–5.. 19 నిమిషాల్లో 4,900 కిలోమీటర్లు ప్రయాణించింది.
జనవరి 31న సూపర్‌బ్లూ బ్లడ్‌మూన్
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జనవరి 31న సూపర్‌బ్లూ బ్లడ్మూన్కనిపించింది. ఇది సాధారణ రోజుల్లో కనిపించే చంద్రుడితో పోల్చితే 30 శాతం పెద్దగా, 14 శాతం ప్రకాశవంతంగా ఉందని సైంటిస్టులు వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కోట్లాది మంది ఈ ఖగోళ వింత(చంద్ర గ్రహణం)ను పెద్ద సంఖ్యలో వీక్షించారు.
నాసా గోల్డ్ మిషన్
భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట.. వాతావరణ పొరల్లో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ‘గ్లోబల్స్కేల్అబ్జర్వేషన్స్ఆఫ్ది లింబ్అండ్డిస్క్(గోల్డ్)’గా పిలిచే మిషన్‌ను జనవరి 25న ఫ్రెంచ్‌గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్ఈఎస్–14 సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి ప్రయోగించింది. భూ వాతావరణ చిట్టచివరి పొరల్లోని ఉష్ణోగ్రతలు, విద్యదయస్కాంత క్షేత్రాల్లో జరిగే మార్పులను ఈ మిషన్అధ్యయనం చేస్తుంది.
ఎల్సీహెచ్–టీడీ2
భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్సీహెచ్–టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ఏరోనాటిక్స్లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ఫ్లైట్కంట్రోల్సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.
అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతం
జపాన్అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకెట్(ఎస్ఎస్–520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్–1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్ఎస్–520 పొడవు 10 మీటర్లు, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది.
అగ్ని-1 పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌క్షిపణి అగ్ని–1ను భారత్ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్‌కలాం దీవి నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. పోరాట సన్నద్ధతను పటిష్టపరిచే చర్యల్లో భాగంగా సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం అగ్ని–1ను పరీక్షించింది.
ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం
ప్రపంచంలోనే అంత్యంత శక్తిమంతమైన ఫాల్కన్హెవీ రాకెట్తొలి ప్రయోగం విజయవంతమైంది. దీన్ని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ఫ్లోరిడాలోని కేప్కెనెవెరాల్లోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 7న ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్సీఈవో ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా రోడ్స్టర్కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టారు. మూడు చిన్న ఫాల్కన్–9 రాకెట్లను కలిపి దీన్ని రూపొందించారు. పునర్వినియోగం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు గల ఫాల్కన్హెవీ రాకెట్సుమారు 64 మెట్రిక్‌టన్నుల బరువును అంతరిక్షంలో ప్రవేశపెట్టగలదు.
హెచ్ఏఎల్ ఆర్టీఓఎస్ విజయవంతం
హిందుస్థాన్ఏరోనాటిక్స్లిమిటెడ్(హెచ్ఏఎల్) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రియల్టైమ్ఆపరేటింగ్సిస్టమ్(ఆర్టీఓఎస్) పరీక్ష విజయవంతమైంది. బెంగళూరులో ఫిబ్రవరి 7న ఆర్టీఓఎస్ను బిగించిన హక్–ఐ విమానం విజయవంతంగా విహరించింది. దీన్ని ఖరగ్పూర్ఐఐటీ సహకారంతో రూపొందించారు.
పృథ్వీ–2 క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ఫిబ్రవరి 7న స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ–2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్సమీకృత పరీక్షా వేదిక నుంచి పృథ్వీ–2ని పరీక్షించారు. దీనికి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగే; 500 నుంచి 1000 కిలోల బరువు గల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది.
ప్రయోగశాలలో మానవ అండాలు..
బ్రిటన్‌లోని ఎడిన్బర్గ్విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ అండాలను ప్రయోగశాలలో విజయవంతంగా పెంచారు. ఇవి మానవ అండాల అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని లండన్‌లో ఫిబ్రవరి 9న వెల్లడించారు. ఎలుకల అండాలను దాదాపు 20 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా 25–40 ఏళ్ల వయసు కలిగిన 10 మంది మహిళల నుంచి అండాశయ కణజాలాన్ని సేకరించారు.
బాలిస్టిక్‌క్షిపణి ధనుష్
అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే బాలిస్టిక్‌క్షిపణి ధనుష్‌ను ఫిబ్రవరి 23న ఒడిశా తీరంలోని నౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
పృథ్వీ–2 క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ–2 క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్సమీకృత పరీక్షా వేదిక(ఐటీఆర్) నుంచి ఫిబ్రవరి 21న రాత్రి 8.30 గంటలకు క్షిపణిని ప్రయోగించగా..లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది.
మానవ రహిత విమానం.. రుస్తుం – 2
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత విమానం.. రుస్తుం–2 వైమానిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. శాస్త్రవేత్తలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఫిబ్రవరి 25న ఈ పరీక్షలను నిర్వహించారు.
తెలంగాణ, నాస్కామ్ మధ్య ఒప్పందం
డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్‌లో ‘సెంటర్ఆఫ్ఎక్స్లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
తేజస్.. మరో కీలక పరీక్షలో పాస్
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్సీఏ) తేజస్మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2018 ఫిబ్రవరి 26న హిందుస్తాన్ఏరోనాటిక్స్లిమిటెడ్(హాల్) ఎయిర్‌పోర్ట్‌నుంచి బయలుదేరిన తేజస్ఎల్ఎస్పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవడంతోపాటు, ఇంజిన్ఆన్లో ఉండగానే ఇంధనం నింపుకొంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్మొట్టమొదటిది.
అనువైన సీకర్ల తయారీలో విజయం
బ్రహ్మోస్సూపర్సోనిక్క్రూయిజ్క్షిపణులకు అనువైన సీకర్ల తయారీలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్పరీక్షా కేంద్రం నుంచి మార్చి 22న దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్అమర్చిన బ్రహ్మోస్క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. వీటిని హైదరాబాద్‌లోని రీసెర్చ్సెంటర్ఇమారత్(ఆర్సీఐ).. ఇతర డీఆర్డీవో ప్రయోగశాలల సహకారంతో అభివృద్ధి చేసింది.
రష్యా.. సర్మత్..
అధునాతన ఖండాంతర బాలిస్టిక్‌క్షిపణి(ఐసీబీఎం)సర్మత్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా సైన్యం మార్చి 30న ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరొందిన వొయేవోడా(సాతాన్) స్థానంలో సర్మత్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని బరువు 200 టన్నులు.
‘ఇకారస్’ నక్షత్రం..
శాస్త్రవేత్తలు హబుల్స్పేస్టెలిస్కోప్ఉపయోగించి భూమికి 500 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించారు. దీనికి ‘ఇకారస్’ అని పేరుపెట్టారు. దీని కిరణాలు భూమిని చేరేందుకు 900 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలోని ఏ టెలిస్కోప్తోనూ ఇంత దూరంలోని నక్షత్రాలను చూడలేం… కానీ, గ్రావిటేషనల్లెన్సింగ్టెక్నిక్ఉపయోగించి నక్షత్రాన్ని గుర్తించినట్లు యూనివర్సిటీ ఆఫ్కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్పాట్రిక్కెల్లీ ఏప్రిల్2న తెలిపారు.
ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఏప్రిల్12న శ్రీహరికోటలోని షార్‌నుంచి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ నేవిగేషన్ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ–సీ41 వాహక నౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఫాల్కన్–9 బ్లాక్5 రాకెట్
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్మే 12న శక్తిమంతమైన ఫాల్కన్–9 బ్లాక్5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్కెనావెరాల్నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఈ రాకెట్బంగ్లాదేశ్తొలి కమ్యూనికేషన్ఉపగ్రహం బంగబంధు–1ను 35 వేల కి.మీ. ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం తర్వాత ప్రధాన బూస్టర్రాకెట్నుంచి విడిపోయి భూమికి తిరిగొచ్చింది. దీన్ని కనీసం పది ప్రయోగాలకు ఉపయోగించొచ్చు. పునర్వినియోగ రాకెట్పరిజ్ఞానంలో ఇదో ముందడుగు.
‘విజయ్ప్రహర్’ సైనిక విన్యాసాలు
భారత సైన్యం రాజస్థాన్‌లో ‘విజయ్ప్రహర్’ పేరుతో నెల రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించిన సైనిక విన్యాసాల కార్యక్రమం మే 9న పూర్తయింది. విన్యాసాల్లో భాగంగా సాయుధ హెలికాప్టర్లు, ట్యాంకులు, డ్రోన్లు, యుద్ధవిమానాలను పరీక్షించారు.
పినాక అప్డేటెడ్ వెర్షన్
పినాక రాకెట్‌కు సంబంధించిన అప్డేటెడ్వెర్షన్ను భారత్మే 31న ఒడిశాలోని చాందీపూర్నుంచి విజయవంతంగా పరీక్షించింది. దిక్సూచి, మార్గనిర్దేశ, నియంత్రణ కిట్జోడించిన ఈ తాజా వెర్షన్‌ను హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన రీసెర్చ్సెంటర్ఇమారత్(ఆర్సీఐ) అందించింది. ఈ డెవలప్మెంట్వల్ల పినాక పరిధి, కచ్చితత్వం బాగా పెరగడంతో దీని ప్రయాణ సామర్థ్యం 40 కి.మీ నుంచి 70 కి.మీలకు పెరిగింది.
అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్‌క్షిపణి
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్క్షిపణిని భారత్జూన్3న ఒడిశాలోని అబ్దుల్కలామ్ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి 5 వేల కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి పరిధి 5 వేల కి.మీ. కాగా, పొడవు 17 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 1.5 టన్నుల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. అగ్ని–5కు పరీక్షలు చేపట్టడం ఇది ఆరోసారి. మొదటిసారి 2012 ఏప్రిల్19న పరీక్ష చేపట్టారు. ఇది ఆసియా మొత్తం, ఆఫ్రికా, ఐరోపాలోని కొన్ని భాగాలను చేరుకోగలదు. ఖండాంతర క్షిపణి సామర్థ్యం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్దేశాలకే ఉంది.
బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టెలిఫోనీ ఆవిష్కరణ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశీయంగా తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ‘వింగ్స్’అనే మొబైల్ యాప్‌ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా జూలై 11న ఆవిష్కరించారు. టెలిఫోనీ సర్వీసు ద్వారా సిమ్ లేకుండా ఫోన్ కాల్స్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. జూలై 25 నుంచి అధికారికంగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
వింగ్‌స యాప్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం
సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూలై 16న విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోగం నిర్విహంచారు. త్వరలో బ్రహ్మోస్‌ను ఆర్మీకి అప్పగించనున్నారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిని ఎక్కడినుంచి ఎక్కిడికైనా ప్రయోగించవచ్చు.
‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ పరీక్ష విజయవంతం
వ్యోమగాముల్ని కాపాడేందుకు ఉద్దేశించిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా జూలై 5న విజయవంతంగా పరీక్షించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ప్రయోగంను చేపట్టారు.
మానవసహిత అంతరిక్ష నౌకల్ని ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే క్రూ ఎస్కేప్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి దూరంగా, సురక్షితంగా దిగేలా చేస్తుంది. తాజా ప్రయోగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ వ్యోమగాములు కూర్చునే దాదాపు 12.6 టన్నుల బరువున్న మాడ్యూల్ 2.7 కి.మీ ఎత్తునుంచి వాహకనౌకకు దూరంగా, సురక్షితంగా బంగాళాఖాతంలో దించింది.
ఇప్పటికే ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలోకి ప్రవేశపెట్టి భూమిపైకి తిరిగి రాగల పునర్వినియోగ వాహక నౌక, 2014లో జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములు పట్టే డమ్మీ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
కృష్ణా జిల్లాలో క్షిపణి పరీక్ష కేంద్రం
కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) జూన్ 28న ఆమోదం తెలిపింది. కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 154 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తొలిదశలో రూ.600 కోట్లు, రెండో దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తారు.
‘న్యూట్రిఫై ఇండియా నౌ’ యాప్ ఆవిష్కరణ
పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్ యాప్‌ను ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ జూన్ 29న ఢిల్లీలో ఆవిష్కరించారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా ఇటువంటి యాప్ అందుబాటులోకి వచ్చినట్టయింది.
తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఉండే ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రిషన్ గైడ్‌లా పనిచేస్తుంది. ఏ వయసుల వారు ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి, తీసుకున్న ఆహారంలో ఏయే మోతాదుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను తెలియజేయడంతోపాటు పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తుంది.
మహిళల రక్షణ కోసం ‘అభయ’ యాప్
మహిళా ప్రయాణీకుల రక్షణ కోసం ‘అభయ’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోలు, ఇతర వాహనాల్లో మహిళలకు ఏవైనా అంవాంఛనీయ ఘటనలు ఎదురైతే పోలీసులు, రవాణాశాఖకు సమాచారం అందించవచ్చు. ఇందులో భాగంగా ప్రయాణీకులను చేరవేసే అన్ని వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చడంతోపాటు అత్యాధునీక టెక్నాలజీతో పోలీసు, రవాణాశాఖల్లో కంట్రోల్‌రూమ్, కాల్సెంటర్లను ఏర్పాటు చేస్తారు. గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ప్రయాణిస్తున్నాయో గుర్తించి పట్టుకుంటారు. మొదటగా విశాఖపట్నం, విజయవాడల్లో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు విద్యాసంస్థల బస్సులోనూ జీపీఎస్ పరికరాలను అమర్చేలా రవాణాశాఖ చర్యలు తీసుకుంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అభయ యాప్ ద్వారా బస్సును ట్రాక్ చేయవచ్చు. మహిళల, చిన్నారుల రక్షణలో భాగంగా అభయ యాప్‌ను రూపొందించడానికి కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ. 56 కోట్లు కేటాయించింది.
అబెల్ గెలాక్సీని కనుగొన్న ఇస్రో
అబెల్ 2256 అనే కొత్త గెలాక్సీ(నక్షత్ర సమూహం)ని గుర్తించినట్లు ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) జూలై 3న వెల్లడించింది.. భూమికి 800 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీని అంతరిక్షంలోకి ఇస్రో పంపిన తొలి స్పేస్ టెలిస్కోప్(బహుళ–తరంగధైర్ఘ్య అంతరిక్ష పరిశోధన ఉపగ్రహం) ద్వారా గుర్తించారు. అబెల్ 2256 మూడు వేర్వేరు గెలాక్సీల సమూహంతో ఒకదాని తర్వాత ఒకటిగా కలసి ఏర్పడ్డాయని, ఇందులోని గెలాక్సీలు పెద్ద మొత్తంలో విస్తరించి ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 500 కంటే ఎక్కువ నక్షత్ర మండలాలతో ఏర్పడిన అబెల్ 2256 మన పాలపుంత కంటే 1,500 రెట్లు పెద్దది. దీనిని గుర్తించడానికి అల్ట్రావెలైట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌ను వినియోగించారు.
పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అనే వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆగస్టు 12న ప్రయోగించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా-4 హెవీ రాకెట్ ద్వారా పార్కర్‌ను ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 2024 డిసెంబర్ 19 నాటికి సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళ్లి సూర్యుడి ఉపరితలంపై ఉన్న కరోనాపై అధ్యయనం చేయనుంది.
సూర్యుడిపై ప్రయోగించిన తొలి ఉపగ్రహమైన పార్కర్‌కు సూర్యుడి వాతావరణంలో ఉండే అధిక వేడిని తట్టుకునేందుకు కార్బన్ మిశ్రమ లోహంతో తయారైన ఉష్ణకవచంను అమర్చారు. సూర్యుడి ఉపరితలం(కరోనా)లో 5,500 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా పార్కర్‌కు అమర్చిన ఉష్ణకవచం దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. 7 సంవత్సరాలపాటు అంతరిక్షంలో ప్రయాణించనున్న పార్కర్ గంటకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు నాసా సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పార్కర్ ప్రయోగాన్ని చేపట్టింది.
యూజీన్ పార్కర్ పేరు మీదుగా…
సూర్యుడి వాతావరణంపై పరిశోధనలు చేసిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజీన్ పార్కర్(91) గౌరవార్థం ఈ నౌకకు పార్కర్ సోలార్ ప్రోబ్ అని పేరు పెట్టారు. నాసా తన మిషన్‌కు జీవించి ఉన్న ఓ వ్యక్తి పేరు పెట్టడం ఇదే తొలిసారి. 1958లో సౌర గాలుల ఉనికిని పార్కర్ గుర్తించారు. ఈ వ్యోమనౌకలో పార్కర్ రాసిన ‘ముందు ఏం ఉందో చూద్దాం’ అనే సందేశాన్ని పంపించారు. అలాగే 1.1 మిలియన్ల పేర్లున్న మెమరీ చిప్‌ను కూడా పంపారు.
చంద్రయాన్-2కు సారాభాయ్ మిషన్‌గా నామకరణం
చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న చంద్రయాన్-2 మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్‌గా నామకరణం చేయనున్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆగస్టు 12న బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రారంభించిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా 3,890 కేజీల బరువైన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపించనున్నారు. 2019 జనవరి 3న చేపట్టే ఈ మిషన్‌కు రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నారు.
సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో చైర్మన్ కె. శివన్ తెలిపారు. 2019లో మొత్తం 22 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇస్రో టీవీ చానల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ చానల్లో ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్
అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వెళ్లనుంది. అమెరికా సహకారంతో ‘బోయింగ్’ సంస్థ తయారుచేసిన బోయింగ్ సీఎస్టీ-100, స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా మొత్తం తొమ్మిది వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నట్లు నాసా ఆగస్టు 4న తెలిపింది.
సునీతా మరో వ్యోమగామి జోష్ కస్సాడాతో కలసి స్టార్ లైనర్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుంది. అలాగే స్పేస్ ఎక్స్ డ్రాగన్‌క్యాప్సూల్ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్ బెహ్న్‌కెన్, డగ్లస్ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా 2012లో తిరిగి భూమిపై అడుగుపెట్టింది.