2018 Monthly Current Affairs – January – August (Persons)

వార్తల్లో వ్యక్తులు

విదేశాంగ కార్యదర్శిగా గోఖలే

సీనియర్దౌత్యవేత్త విజయ్కేశవ్గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితులయ్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు

లాస్ఏంజెల్స్లో జనవరి 7న గోల్డెన్గ్లోబ్పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన అజీజ్ అన్సారీకి ప్రతిష్టాత్మక గోల్డెన్గ్లోబ్పురస్కారం దక్కింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. మాస్టర్ఆఫ్నన్ టీవీ సిరీస్‌లో అన్సారీ నటనకు ఈ అవార్డు దక్కింది. టాక్‌షో వ్యాఖ్యాతగా, నటిగా గుర్తింపు పొందిన ఆఫ్రికా సంతతి అమెరికా మహిళ.. ఓప్రా విన్ఫ్రేకు అత్యంత ప్రతిష్టాత్మక సిసిల్బీ డీమిల్లే అవార్డు లభించింది.

రాధా విశ్వనాథన్

కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు.

జాన్యంగ్

అమెరికా వ్యోమగామి జాన్యంగ్(87) జనవరి 5న మరణించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. యంగ్ఆరుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. చంద్రుడిపై కాలుమోపారు. జెమిని3; జెమిని10; అపోలో10; అపోలో16 ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు. వ్యోమనౌకకు కమాండర్‌గా వ్యవహరించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధానసంఖ్య

అమెరికాకు చెందిన జొనాథన్పేస్అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధానసంఖ్య (ఇప్పటి వరకు తెలిసిన)ను కనుగొన్నారు. 2ను 7,72,32,917 సార్లు గుణించగా వచ్చిన సంఖ్య నుంచి ఒకటి తీసివేశారు. అలా వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలిసిన ప్రధాన సంఖ్య కంటే M77232917గా పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువ ఉన్నాయి.

ఇస్రో చైర్మన్ గా కె.శివన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కె. శివన్నియమితులయ్యారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్చైర్మన్గా శివన్నియామకాన్ని కేబినెట్నియామకాల కమిటీ ఆమోదించింది. మూడేళ్లపాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. 1982లో ఇస్రోలో చేరిన శివన్, సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. పీఎస్ఎల్వీ(పోలార్శాటిలైట్లాంచ్వెహికల్) ప్రాజెక్టుకు కీలక సేవలందించారు.

బ్రిటన్ ప్రభుత్వంలో మంత్రిగా నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్బ్రిటన్ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. 2018, జనవరి 8న బ్రిటన్ప్రధానమంత్రి థెరిసా మే చేపట్టిన కేబినెట్పునర్వ్యస్థీకరణలో రిషికి చోటు దక్కింది. ఆయనకు బ్రిటన్హౌసింగ్, కమ్యూనిటీస్, లోకల్గవర్నమెంట్వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు.

సీఈసీగా ఓం ప్రకాశ్ రావత్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా ఓం ప్రకాశ్రావత్జనవరి 23న బాధ్యతలు చేపట్టారు. 1977 ఐఏఎస్బ్యాచ్, మధ్యప్రదేశ్కేడర్కు చెందిన రావత్.. భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసి.. రిటైర్‌అయ్యారు. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక లావసా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందిబెన్

గుజరాత్మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్పటేల్మధ్యప్రదేశ్గవర్నర్గా నియమితులయ్యారు. రాష్ట్ర్రపతి రామ్నాథ్కోవింద్జనవరి 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ సీఈసీగా ఆర్పీ సిసోడియా

ఆంధ్రప్రదేశ్ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈఓ)గా ఆర్పీ సిసోడియా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సిసోడియాను సీఈఓగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 18న ఉత్తర్వులు జారీ చే సింది.

ఎన్ఎస్జీ డీజీగా సుదీప్ లఖ్టాకిటా

అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రతా బాధ్యతలను నిర్వహించే నేషనల్‌సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) డైరెక్టర్జనరల్(డీజీ)గా సీనియర్ఐపీఎస్అధికారి సుదీప్లఖ్టాకియా జనవరి 19న నియమితులయ్యారు. బ్లాక్క్యాట్స్గా పిలిచే ఎన్ఎస్జీ గుర్గావ్లోని మనేసర్కేంద్రంగా పనిచేస్తుంది.

చరణ్ సింగ్ కల్కట్ కన్నుమూత

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్సింగ్కల్కట్(92) జనవరి 27న చండీగఢ్‌లో మరణించారు. పంజాబ్హరిత విప్లవంలో కీలకపాత్ర పోషించిన కల్కట్.. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ది టాల్ మ్యాన్..

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌పై గణేశన్రాసిన ది టాల్మ్యాన్ పుస్తకాన్ని జనవరి 27న భువనేశ్వర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాల్గొన్నారు.

నటి కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి నటి కృష్ణకుమారి(84) జనవరి 24న బెంగళూరులోని నివాసంలో మరణించారు. 1933 మార్చి 6న బెంగాల్లో జన్మించిన ఆమె.. 1951లో నవ్వితే నవరత్నాలు అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా విశేష గుర్తింపు పొందారు.

డీజీఎంఓగా అనిల్ చౌహాన్

భారత సైన్యం నూతన డీజీఎంఓ(డైరెక్టర్జనరల్ఆఫ్మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్జనరల్అనిల్చౌహాన్జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.

తెలంగాణ సీఎస్ గా శైలేంద్ర కుమార్ జోషి

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్‌జోషి జనవరి 31న బాధ్యతలు స్వీకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన జోషి 1984 బ్యాచ్ఐఏఎస్అధికారి.

డియాజ్ బలర్ట్ ఆత్మహత్య

క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్బలర్ట్(68) ఫిబ్రవరి 2న హవానాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డియాజ్రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తండ్రి పోలికలతో ఉండటంతో అక్కడి వారు ఆయన్ను ఫిడెల్జూనియర్గా పిలుస్తుంటారు. ఫిజిక్స్శాస్త్రవేత్తయిన డియాజ్.. క్యూబా అణుశక్తి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.

అమితాబ్ కాంత్ పదవీకాలం పొడగింపు

నీతి ఆయోగ్చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్అమితాబ్కాంత్పదవీకాలాన్ని 2019 జూన్30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఫిబ్రవరి 5న ప్రకటించింది. కేబినెట్నియామకాల కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్ గా ఇంద్రానూయి

పెప్సికో మాజీ సీఈవో ఇంద్రనూయి అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఫిబ్రవరి 9న నియమితులయ్యారు. దీంతో ఆమె జూన్నుంచి బోర్డులో చేరనున్నారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో 2017 జూన్‌లో ఐసీసీ నియమావళిలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా బోర్డులో తప్పనిసరిగా మహిళా స్వతంత్ర డైరెక్టర్ఉండాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసిన నేపథ్యంలో ఇంద్రనూయి ఎంపిక జరిగింది.

ఆచార్య చంద్రశేఖర కంబార

కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా కన్నడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య చంద్రశేఖర కంబార ఫిబ్రవరి 12న ఎన్నికయ్యారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైన కంబార.. కవిగా, నాటకరంగ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందారు.

బంగ్లాదేశ్అధ్యక్షుడిగా అబ్దుల్‌హమీద్

బంగ్లాదేశ్అధ్యక్షుడిగా అబ్దుల్హమీద్ఫిబ్రవరి 7న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి బంగ్లాదేశ్అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అస్మా జహంగీర్

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఫిబ్రవరి 11న లాహార్లో మరణించారు. అస్మా.. పాక్ఆర్మీ, ఐఎస్ఐ వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించేవారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2014లో రైట్లైవ్లీ హుడ్అవార్డు, 2010లో ఫ్రీడమ్అవార్డు దక్కాయి.

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్రమఫోసా

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్రమఫోసా ఎన్నికయ్యారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల అనంతరం జాకబ్‌జుమా ఫిబ్రవరి 15న అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 16న జాతీయ అసెంబ్లీలో అధ్యక్ష ఎన్నిక జరిగింది. పార్లమెంటులో మెజార్టీ కలిగిన ఆఫ్రికన్నేషనల్కాంగ్రెస్.. రమఫోసాను అధ్యక్ష పదవికి నామినేట్చేసింది.

కేపీ శర్మ ఓలీ రెండోసారి

కేపీ శర్మ ఓలీ రెండోసారి నేపాల్ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్రపతి బిద్యాదేవీ భండారీ ఫిబ్రవరి 16న ఖాట్మాండులో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి

తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా 1991 బ్యాచ్ఐఏఎస్అధికారి రజత్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది.

నటి శ్రీదేవి కన్నుమూత

భారత చలనచిత్ర రంగంపై తనదైన ముద్రవేసిన ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించారు. స్పృహకోల్పోయి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడటంతో శ్రీదేవి మృతి చెందినట్లు ఫోరెన్సిక్రిపోర్ట్వెల్లడించింది. తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి.. 1967లో కందన్కరుణై చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించారు. తెలుగులో నటించిన పదహారేళ్ల వయసు(1978) చిత్రం శ్రీదేవికి హీరోయిన్గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి రెండు దశాబ్దాలపాటు దక్షిణాది, ఉత్తరాది చలనచిత్ర రంగాల్లో అగ్రతారగా వెలుగొందారు. శ్రీదేవి చివరిగా నటించిన సినిమా మామ్ 2017లో విడుదలైంది. శ్రీదేవిని కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది.

అవనీ చతుర్వేది..

యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా అవనీ చతుర్వేది గుర్తింపు పొందారు. ఆమె ఫిబ్రవరి 19న జామ్నగర్స్థావరం నుంచి మిగ్21 బైసన్‌ను నడిపారు.

కున్వర్బాయి

స్వచ్ఛభారత్అభియాన్చిహ్నంగా పేరొందిన 106 ఏళ్ల వృద్ధురాలు కున్వర్బాయి ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్‌లో మరణించారు. స్వచ్ఛభారత్స్ఫూర్తితో 2016లో తనకున్న కొన్ని మేకలను అమ్మేసి.. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో కున్వర్బాయి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.

కమల్ హాసన్ పార్టీ

ప్రముఖ తమిళ నటుడు కమల్హాసన్ఫిబ్రవరి 21న మదురైలో మక్కల్‌నీది మయ్యం పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

నాయని కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ రచయిత, సాహితీ వేత్త నాయని కృష్ణమూర్తి (67) 2018 మార్చి 1న మరణించారు. పాఠశాల విద్యార్థుల కోసం ఆయన తీసుకొచ్చిన మాబడి, పాఠశాల పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ఆయన పలు నవలలు రాశారు.

చమేలీ దేవి అవార్డు

2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డు ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ఎడిటర్ఉమా సుధీర్‌కు లభించింది. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది.

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్పీపుల్స్పార్టీ(ఎన్పీపీ) అధినేత కాన్రాడ్సంగ్మా మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. ఈయన లోక్‌సభ మాజీ స్పీకర్దివంగత పి..సంగ్మా తనయుడు. గవర్నర్గంగాప్రసాద్రాజ్భవన్లో కాన్రాడ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఐటీబీపీ తొలి మహిళా కంబాట్ అధికారిగా ప్రకృతి

ఇండోటిబెటన్సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలి మహిళా కంబాట్అధికారిగా బిహార్‌కు చెందిన ప్రకృతి ఎంపికయ్యారు. ఈ మేరకు మార్చి 7న ప్రకటన వెలువడింది. ప్రకృతి యూపీఎస్సీ నిర్వహించిన కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) పరీక్షలో విజయం సాధించి కంబాట్ఆఫీసర్గా ఎంపికయ్యారు.

చైనా రాజ్యాంగ సవరణ

చైనా అధ్యక్షుడి పదవీకాలంపై ఉన్న పరిమితిని ఎత్తి వేసేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణను ఆ దేశ పార్లమెంటు మార్చి 11న ఆమోదించింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్పింగ్ఆ పదవిలో జీవితకాలం కొనసాగనున్నారు. ఇప్పటి వరకు చైనా అధ్యక్షుడు..

ఐదేళ్ల చొప్పున రెండు దఫాలు మాత్రమే అధికారంలో కొనసాగే వీలుంది.

బాలకృష్ణ దోశీకి ప్రిట్జ్కర్ప్రైజ్

ఆర్కిటెక్చర్నోబెల్గా పిలిచే ప్రిట్జ్కర్ప్రైజ్.. భారత్‌కు చెందిన బాలకృష్ణ దోశీకి దక్కింది. న్యూయార్క్‌లో మార్చి7న ఆయన ఎంపికను ప్రకటించారు. తక్కువ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి దోశీ ఆద్యుడు.

నాగాలాండ్ముఖ్యమంత్రిగా నీఫియు రియో

నాగాలాండ్ముఖ్యమంత్రిగా నేషనల్డెమొక్రటిక్ప్రోగ్రెస్సివ్పార్టీ(ఎన్డీపీపీ) నేత నీఫియు రియో మార్చి 8న ప్రమాణస్వీకారం చేశారు.

త్రిపుర నూతన సీఎంగా విప్లవ్కుమార్దేవ్

త్రిపుర నూతన సీఎంగా విప్లవ్కుమార్దేవ్మార్చి 9న అగర్తలాలో ప్రమాణస్వీకారం చేశారు.

శాస్త్రవేత్త జాన్సల్స్టోన్మృతి

బ్రిటన్‌కు చెందిన నోబెల్అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త జాన్సల్స్టోన్(75) లండన్‌లో మార్చి 11న మరణించారు. కణ విభజనను జన్యువులు ఎలా నియంత్రణ చేస్తాయన్న దానిపై చేసిన పరిశోధనకు ఆయనకు 2002లో నోబెల్‌బహుమతి దక్కింది.

జర్మనీ ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కల్

ఏంజెలా మెర్కల్మార్చి 14న జర్మనీ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా నాలుగోసారి. 709 మంది సభ్యులున్న జర్మన్పార్లమెంటులో 364 మంది ఆమెకు అనుకూలంగా ఓటేశారు.

స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్హాకింగ్(76) మార్చి 14న కేంబ్రిడ్జ్‌లో మరణించారు. ఆయన 1942 జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. భౌతికశాస్త్రంలో ఐన్స్టీన్తర్వాత అంతటి గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన స్టీఫెన్హాకింగ్.. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనం చేశారు. కృష్ణబిలాలు సైతం రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తాయని వెల్లడించారు. దీన్నే హాకింగ్రేడియేషన్అంటారు. స్టీఫెన్రచించిన బ్రీఫ్హిస్టరీ ఆఫ్‌టైమ్ పుస్తకం బ్రిటిష్సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. ఆయన రచించిన ఒక పుస్తకం కాలం కథపేరుతో తెలుగులో వెలువడింది.

రష్యా అధ్యక్షుడిగా మరోసారి వ్లాదిమిర్ పుతిన్

అమెరికా, బ్రిటన్లతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్పుతిన్కే పట్టం కట్టారు. మార్చి 18న ముగిసిన ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు, సమీప ప్రత్యర్థి.. కమ్యూనిస్ట్‌పార్టీ నేత పావెల్గ్రుడినిన్కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో పుతిన్2024 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 2014లో ఉక్రెయిన్నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతం ఓట్లు రావడం గమనార్హం.

నేపాల్ అధ్యక్షురాలిగా రెండోసారి విద్యాదేవి

విద్యాదేవి భండారీ రెండోసారి నేపాల్అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మార్చి 13న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. భండారీ 2015లో నేపాల్తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా మైక్పాంపీ

అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా మైక్పాంపీ నియమితులయ్యారు. రెక్స్టిల్లర్సన్స్థానంలో పాంపీని నియమిస్తున్నట్లుæఅధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్మార్చి 13న ప్రకటించారు.

సంపన్న ఎంపీగా మహేంద్ర ప్రసాద్

దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా మహేంద్ర ప్రసాద్(కింగ్మహేంద్ర) నిలిచారు. జేడీయూ పార్టీకి చెందిన ఆయన ప్రస్తుతం రాజ్యసభకు బిహార్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ్యకు పోటీ చేస్తున్న సమయంలో ఆయన మార్చి 14న సమర్పించిన ప్రమాణపత్రంలో ఆస్తుల విలువను రూ.4039 కోట్లుగా పేర్కొన్నారు. మహేంద్ర తర్వాత ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్రూ. 1000 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా భాజపాకు చెందిన రవీంద్ర కిశోర్సిన్హా గుర్తింపు పొందారు. ఆయన 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి ఆస్తుల విలువను రూ.800 కోట్లుగా ప్రకటించారు.

ప్రకాశ్చంద్జైన్కు హోమీ బాబా అవార్డు

డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ప్రకాశ్చంద్జైన్మార్చి 16న ప్రతిష్టాత్మక హోమీ జహంగీర్‌బాబా స్మారక అవార్డు అందుకున్నారు. ఇంఫాల్‌లో జరిగిన 105వ భారత సైన్స్‌కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి హర్షవర్థన్చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో పనిచేస్తున్న డా.జైన్ఎయిరోస్పేస్ఇంజనీరింగ్లో విశేష కృషి చేశారు. దానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఎన్నికల కమిషన్ అంబాసిడర్ గా రాహుల్ ద్రవిడ్

ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు భారత క్రికెట్జట్టు మాజీ కెప్టెన్రాహుల్ద్రవిడ్ను ఎలక్షన్కమిషన్అంబాసిడర్గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్కమిషనర్ఓంప్రకాశ్రావత్మార్చి 27న న్యూఢిల్లీలో ప్రకటించారు. ద్రవిడ్ఇప్పటికే ధూమపాన నిషేధం, ఆరోగ్య జాగృతి వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సచిన్ టెండూల్కర్..

క్రికెటర్సచిన్టెండూల్కర్రాజ్యసభ సభ్యుడిగా అందుకున్న వేతనం, ఇతర భత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. సచిన్ఆరేళ్లలో వేతనభత్యాల కింద దాదాపు రూ.90 లక్షలు అందుకున్నారు.

ఎన్టీఏ డీజీగా వినీత్ జోషి

జాతీయ పరీక్షా సంస్థ(నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ) డైరెక్టర్జనరల్గా వినీత్‌జోషి మార్చి 30న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ఐఏఎస్అధికారైన వినీత్ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

లిండా బ్రౌన్ మృతి

పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా బ్రౌన్(76) అమెరికాలోని కెన్సాస్‌లో మార్చి 25న మరణించారు. ఆమె 1954లో అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్షపై న్యాయపోరాటం చేసి అనూహ్య విజయం సాధించారు.

ఆయుష్మాన్ భారత్ సీఈవోగా ఇందు భూషణ్

ప్రతిష్టాత్మక జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. ఆయుష్మాన్భారత్కు చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్గా ఇందు భూషణ్‌ను నియమిస్తూ కేంద్రం మార్చి 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇందు భూషణ్ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా డెవలప్‌మెంట్‌బ్యాంక్(ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డైరెక్టర్జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు.

మయన్మార్నూతన అధ్యక్షుడిగా విన్మ్యింట్

మయన్మార్నూతన అధ్యక్షుడిగా విన్మ్యింట్మార్చి 28న ఎన్నికయ్యారు. మయన్మార్æ కౌన్సిలర్ఆంగ్సాన్సూచీ నేతృత్వంలోని నేషనల్లీగ్ఫర్డెమొక్రసీ(ఎన్ఎల్డీ) అభ్యర్థి అయిన మ్యింట్కు పార్లమెంటులో దాదాపు మూడింట రెండొంతుల ఓట్లు లభించాయి.

కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్అల్వరాడో

కోస్టారికా అధ్యక్షుడిగా నవలా రచయిత, సంగీతకారుడు కార్లోస్అల్వరాడో ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కార్లోస్పాత్రికేయం, రాజనీతి శాస్త్రాల్లో పట్టభద్రుడు.

తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి

తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా కొనసాగుతున్న మహేందర్‌రెడ్డి పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏప్రిల్9న సంతకం చేశారు. మహేందర్‌రెడ్డి 2017, నవంబర్12న రాష్ట్ర ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

పార్క్గ్వెన్హైకి జైలు

అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్గ్వెన్హైకి 24 ఏళ్లు జైలు శిక్ష పడింది. దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన పార్క్.. లంచం, అధికార దుర్వినియోగం వంటి కేసుల్లో దోషిగా తేలారు.

పెద్ద వయస్కుడు మసాజో నొనకా

జపాన్‌కు చెందిన 112 ఏళ్ల మసాజో నొనకా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు ఆయనకు గిన్నిస్వరల్డ్రికార్డ్స్ఏప్రిల్10న ధ్రువీకరణ పత్రం అందించింది.

క్యూబా నూతన అధ్యక్షుడిగా డియాజ్కేనల్

క్యూబా నూతన అధ్యక్షుడిగా డియాజ్కేనల్ఎన్నికయ్యారు. గత ఆరు దశాబ్దాల క్యూబా చరిత్రలో క్యాస్ట్రో కుటుంబానికి చెందని వ్యక్తి ఆ దేశ అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి.

ఛోగమ్చీఫ్ గా యువరాజ్ ఛార్లెస్

కామన్వెల్త్దేశాల కూటమి(ఛోగమ్) చీఫ్‌గా యువరాజు ఛార్లెస్ఎన్నికయ్యారు. ఛోగమ్సదస్సు ఏప్రిల్19 నుంచి రెండు రోజుల పాటు లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాణి ఎలిజబెత్తన వారసుడిగా ఛార్లెస్‌ను నియమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు కూటమిలోని 53 మంది దేశాధినేతలు ఏప్రిల్20న ఆమోదం తెలిపారు.

సిస్టర్ఆగ్నెస్మేరీ వలోయిస్కన్నుమూత

కెనడా సైనికులు శ్వేత దేవతగా పిలుచుకునే సిస్టర్ఆగ్నెస్మేరీ వలోయిస్(103) ఏప్రిల్20న మరణించారు. ఆమె రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సంMీ ర్ణ దళాలకు చెందిన కెనడా సైనికులకు విశేష సేవలు అందించారు.

బాలాంత్రపు రజనీకాంత రావు కన్నుమూత

సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంత రావు(99) ఏప్రిల్22న విజయవాడలో మరణించారు. ఆయన కర్ణాటక సంగీతంలో తనదైన ముద్రవేశారు. 1961లో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని, 2007లో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. 1941లో చెన్నై ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత రావు.. 1978లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంచాలకుడిగా పదవీ విరమణ చేశారు.

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పవన్కుమార్చామ్లింగ్

సిక్కిం ముఖ్యమంత్రి పవన్కుమార్చామ్లింగ్అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఏప్రిల్28న రికార్డు సృష్టించారు. ఆయన 1994 నుంచి నిరాటంకంగా సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ రికార్డు ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. ఐదోసారి సీఎంగా సేవలందిస్తున్న చామ్లింగ్పదవీకాలం వచ్చే ఏడాది వరకు ఉంది.

నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా

సీనియర్న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఏప్రిల్27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. అంతేకాకుండా స్వాతంత్య్రానంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఏడో మహిళగా గుర్తింపు పొందారు. జస్టిస్ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

శక్తిమంతుల జాబితా – 2018

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాను ఫోర్బ్స్మే 9న విడుదల చేసింది. మొత్తం 75 మందితో రూపొందించిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్ను వెనక్కి నెట్టి తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీకి 9వ స్థానం దక్కింది. ఈ జాబితాలో మోదీతోపాటు భారత్‌నుంచి ముఖేశ్అంబానీ (32వ ర్యాంకు) చోటు దక్కించుకున్నారు.

డేవిడ్గుడ్ఆల్కారుణ్యం

ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్గుడ్ఆల్(104) స్విట్జర్లాండ్వెళ్లి, అక్కడ కారుణ్యం పొందారు. ఈ మేరకు స్విస్ఫౌండేషన్మే 11న వెల్లడించింది. తన జీవితం దుర్భరంగా మారిందని, రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోందని చనిపోయేందుకు అనుమతించాలని డేవిడ్ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకోగా, అధికారులు తిరస్కరించారు. దీంతో స్విట్జర్లాండ్వెళ్లి, కారుణ్య మరణం పొందారు. ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాల్లో కారుణ్య మరణానికి అనుమతి లేదు. స్విట్జర్లాండ్‌లో మాత్రం కారుణ్య మరణం పొందాలని మనస్ఫూర్తిగా, తెలివితో ఉండి కోరితే నిబంధనల మేరకు ఎవరికైనా అనుమతిస్తారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి

జేడీ(ఎస్) నేత కుమారస్వామి మే 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మే 15న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 104, కాంగ్రెస్78, జేడీ (ఎస్) 37, ఇతరులు మూడు స్థానాలను దక్కించుకున్నారు. కాగా, కాంగ్రెస్, జేడీ (ఎస్) మధ్య కుదిరిన అవగాహనతో కుమారస్వామి సీఎం పగ్గాలను చేపట్టారు.

యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) మే 20న అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె∙1940లో కృష్ణా జిల్లా, కాజా గ్రామంలో జన్మించారు. సులోచనారాణి తన నవలల్లో మధ్యతరగతి మహిళల ఊహలు, వాస్తవ జీవితాలను అద్భుతంగా వర్ణించారు. జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, ఆశల శిఖరాలు, గిరిజా కళ్యాణం వంటి నవలలు విశేష ప్రాచుర్యం పొందాయి. 1970 దశకంలో ఆమె రచించిన అనేక నవలలు సినిమాలుగా రూపొందాయి.

శాస్త్రవేత్త ఇ.సి.జి.సుదర్శన్కన్నుమూత

ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇ.సి.జి.సుదర్శన్మే 14న అమెరికాలోని ఆస్టిన్‌లో మరణించారు. 1931లో కేరళలోని కొట్టాయంలో జన్మించిన సుదర్శన్40 ఏళ్లపాటు టెక్సాస్విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయిదు దశాబ్దాలపాటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా వ్యవహరించారు. పీహెచ్డీ సిద్ధాంత పత్రం కోసం పనిచేస్తున్న సమయంలో ఎ థియరీ ఆఫ్వీక్ఇంటరాక్షన్స్ను కనుగొన్నారు. భౌతిక శాస్త్రం, క్వాంటమ్ఆప్టిక్స్, క్వాంటమ్కంప్యూటేషన్తదితర రంగాల్లో అద్భుత ఆవిష్కర ణలు చేశారు. భారత ప్రభుత్వం ఆయన్ను 2007లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

లలిత కళా అకడామీ చైర్మన్‌గా ఉత్తమ్పాఛర్ణే

ప్రముఖ శిల్పి, కళాకారుడు ఉత్తమ్పాఛర్ణే లలిత కళా అకడామీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మే 17న ప్రకటన విడుదల చేసింది.

మాదాల రంగారావు కన్నుమూత

అభ్యుదయ చిత్రాల నటుడు, నిర్మాత మాదాల రంగారావు (70) హైదరాబాద్‌లో మే 27న మరణించారు. ఆయన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. నాటకాల్లో నటించిన అనుభవంతో 1980లో నవతరం ప్రొడక్షన్స్పతాకంపై యువతరం కదిలింది అనే సినిమా తీశారు. ఆ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా గెలుచుకుంది. ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, జనం మనం, ప్రజాశక్తి వంటి విప్లవాత్మక చిత్రాలను ఆయన నిర్మించారు.

అర్జున్వాజ్పేయి రికార్డు

8 వేల మీటర్ల కంటే ఎతైన ఆరు పర్వతాలను 24 ఏళ్ల వయసులో అధిరోహించిన వ్యక్తిగా భారత యువ పర్వతారోహకుడు అర్జున్వాజ్పేయి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ రికార్డు నేపాల్‌కు చెందిన చాంగ్డవా పేరు మీద ఉంది. కాంచన్‌గంగ పర్వతాన్ని అధిరోహించి ఈ రికార్డు నెలకొల్పిన ఈ యువ తరంగం 2010లో 16 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్శిఖరాన్ని చేరుకున్నారు. 8 వేల మీటర్ల కంటే ఎతైన 14 పర్వతాలను పిన్న వయసులోనే అధిరోహించాలన్నదే అర్జున్లక్ష్యం.

వ్యోమగామి అలెన్బీన్కన్నుమూత

చంద్రుడిపై కాలుమోసిన నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందిన అమెరికా వ్యోమగామి అలెన్బీన్(86) అనారోగ్యంతో మే 26న మరణించారు. 1932 మార్చి 15న టెక్సాస్‌లోని వీలర్లో జన్మించిన బీన్తొలుత నౌకాదళంలో టెస్ట్పైలట్గా చేరారు. తర్వాత 1963లో నాసాలో వ్యోమగామి అయ్యారు. చంద్రుడిపై నీల్ఆర్మ్స్ట్రాంగ్కాలుమోపిన నాలుగు నెలలకు అంటే 1969 నవంబర్14న బీన్తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అపోలో12 పేరిట సాగిన ఆ యాత్రలో బీన్‌తో పాటు కన్రాడ్, రిచర్డ్గోర్డాన్లు కూడా పాలుపంచుకున్నారు.

ఆర్బీఐ తొలి సీఎఫ్ వోగా సుధా బలృష్ణన్

రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా (ఆర్బీఐ) తొలి చీఫ్ఫైనాన్షియల్ఆఫీసర్(సీఎఫ్‌వో)గా సుధా బాలకృష్ణన్నియమితులయ్యారు. ఆమె రాబోయే మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. నేషనల్సెక్యూరిటీస్డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి అయిన సుధా బాలకృష్ణన్అకౌంటింగ్విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్షీట్ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్అకౌంటింగ్విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్థిక ఫలితాలను నివేదించడం, బ్యాలెన్స్‌షీట్స్, లాభ, నష్టాల ఖాతాల పరిశీలన వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తారు.

కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు యువతి
ఆఫ్రికాలో అతి పెద్దదైన కిలిమంజారో (5895 మీటర్లు) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశ దళవాయి అధిరోహించింది. జూలై 16 నుంచి 20వ తేదీ వరకు ప్రయాణం చేసి 19,341 అడుగుల ఎత్తుకు చేరుకుంది. పర్వతారోహణకు మొరాంగో మార్గంలోని అత్యంత కఠినమైన మార్గంను ఆమె ఎంచుకుంది.
గుంటూరులోని పార్వతీపురంలో నివాసం ఉంటున్న శివకుమార్, అనురాధ దంపతులకు జన్మించిన దళవాయి డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో చేరింది. 2006లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు అర్హత సాధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ) లో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా దళవాయి మాట్లాడుతూప్రపంచంలోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో భాగంగా కిలిమంజారోని అధిరోహించానని త్వరలో యూరప్‌లోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నాని చెప్పింది.

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఆర్కే జైన్
కృష్ణా బోర్డు నూతన చైర్మన్‌గా ఆర్కే జైన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బోర్డులకు చైర్మన్‌గా ఉన్న హెచ్‌కే సాహూ జూలై 31న పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో కేంద్ర జల సంఘం బెంగళూరు రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్కే జైన్‌ను ప్రభుత్వం నియమించింది.

షార్ డెరైక్టర్‌గా పాండ్యన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్‌గా ఎస్.పాండ్యన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ జూలై 31న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పాండ్యన్ తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం షార్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న పి.కున్హికృష్ణన్‌ను బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ డెరైక్టర్‌గా బదిలీచేశారు. యూఆర్‌రావు సెంటర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.అన్నాదురై జూలై 31న ఉద్యోగ విరమణ చేయటంతో ఆయన స్థానంలో కున్హికృష్ణన్‌ను నియమించారు.

మార్స్‌పై కాలుమోపబోయే తొలి మహిళ

అరుణ గ్రహం(మార్స్)పై కాలుమోపబోయే తొలి మహిళగా అమెరికాకి చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ రికార్డు నె లకొల్పనుంది. 2033లో నాసా చేపట్టే మార్స్ ప్రయోగం కోసం నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వైవల్లో అలెసా ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. పద్దెనిమిది ఏళ్లు నిండిన వారినే నాసా వ్యోమగామిగా ప్రకటిస్తుంది కాబట్టి ప్రస్తుతం అలెసా బ్లూ బెర్రీ అనే కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. ఈ ప్రయోగం ద్వారా మార్స్‌పై వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలు వంటి అంశాలపై పరిశీలించనున్నారు.

ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతి మహిళలు
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలకు చోటు దక్కింది. ఈ మేరకు అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల నాలుగో వార్షిక జాబితాను ఫోర్బ్స్ జూలై 12న ప్రకటించింది. అరిస్టా నెట్వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్న ఉల్లాల్ రూ.9,250 కోట్ల సంపదతో 18వ స్థానంలో నిలవగా ఐటీ సంస్థ సైన్‌టెల్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న సేథీ రూ.6,844 కోట్ల సంపదతో 21వ స్థానం సాధించింది.
ఈ జాబితాలో అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై సంస్థ చైర్మన్ డయానే హెన్డ్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.
మూడేళ్లకే రూ.6,164 కోట్ల విలువైన కాస్మెటిక్ వ్యాపారం చేసిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్(20) జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

అత్యుత్తమ అధ్యక్షుడిగా ఒబామా
అమెరికాలో ఉత్తమ అధ్యక్షుడిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వే జూలై 13న ఈ వివరాలు వెల్లడించింది. 2008 నుంచి వరుసగా రెండుసార్లు ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామాను సర్వేలో 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. ఈ జాబితాలో 33 శాతంతో బిల్ క్లింటన్ రెండో స్థానం, 32 శాతంతో రొనాల్డ్ రీగన్ మూడో స్థానంలో నిలవగా 19 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు.

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జూలై 13 1.6 శాతం పెరిగి రూ.1,099.80కి చేరుకోవండంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో ఈ జాబితాలో 44 బిలియన్ డాలర్లు(3.03 లక్షల కోట్లు) సంపదతో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రెండవ స్థానంలో నిలిచాడు. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.

సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీయార్
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ నియమితులయ్యారు. ఈ మేరకు రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సెలెక్ట్ ఫౌండర్ వై.గురు జూలై 13న తెలిపారు. 2019 జూలై నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 200 ఔట్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2,500 మందికి ఉపాధి లభిస్తుంద ని వై. గురు చెప్పారు.

ఫుట్‌బాల్ కోచ్ రహీమ్‌పై బయోపిక్
ప్రముఖ భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌పై బయోపిక్ రూపొందించనున్నారు. ఈ మేరకు ఎస్ఏ రహీమ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటించనున్నట్లు జూలై 13న చిత్ర బృందం తెలిపింది. సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్‌గుప్తా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ద్వితీయార్ధంలో విడుదలయ్యే ఈ చిత్రం రహీమ్ కోచ్‌గా వ్యవహరించిన, భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా భావించే 1951-1962 మధ్య కాలం నేపథ్యంలో నడుస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన రహీమ్ శిక్షణలో 1951, 1962 ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అలాగే 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరింది. కొత్త తరం టెక్నిక్‌లతో ఆటగాళ్లను తీర్చిదిద్ది రహీమ్ సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన 54 ఏళ్ల వయసులో 1963లో కన్ను మూశారు.

అత్యంత సంపన్నుడిగా జెఫ్ బెజోస్
ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఈకామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు. ఈ మేరకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్ జూలై 17న వెల్లడించింది. బెజోస్ సంపద మొత్తం విలువ జూలై 16 నాటికి 150 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10.25 లక్షల కోట్లు)కు చేరింది. ఈ జాబితాలో 95.5 బిలియన్ డాలర్లతో మెక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉండగా 83 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నాడు.
అలాగే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మొత్తం సంపద విలువ జూలై 13 నాటికి 44.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే ధనిక కుటుంబం వాల్టన్ ఫ్యామిలీ మొత్తం ఆస్తి విలువ 151.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ 1982 నుంచి ఏటా ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాను ప్రచురిస్తుండగా ఇంతవరకు ఎవరి సంపద 150 బిలియన్ డాలర్లకు చేరలేదు.

ఎన్జీటీ చైర్మన్‌గా జస్టిస్ గోయల్

జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయయూర్తి జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 6న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గోయల్ జూలై 6న పదవీ విరమణ చేశారు. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. 2017 డిసెంబర్లో జస్టిస్ స్వతంతర్ కుమార్ ఎన్జీటీ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించలేదు.
పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జూలై 7న రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుకు సీజేగా నియమితులైన తొలి వ్యక్తి రాధాకృష్ణన్.
2013 మే 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా 2015 మే 6న పదవీ విరమణ చేశారు. అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా 2015 మే 5న జస్టిస్ దిలీప్ బి. బొసాలే బాధ్యతలు చేపట్టారు. 2016 జూలై 30న ఏసీజేగా నియమితులైన జస్టిస్ రమేశ్ రంగనాథన్ 23 నెలలపాటు ఆ పదవిలో కొనసాగి నిరాటంకంగా సుదీర్ఘ కాలంపాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు.

ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ నూతన డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా రామ్ ప్రవేశ్ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నవంబర్ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
1961 జూలై 1న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్ఎస్పీ మెడల్ సాధించారు. అలాగే పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ పొందారు.

తొలి హిజ్రా న్యాయవాదిగా సత్యశ్రీ
దేశంలో తొలి హిజ్రా న్యాయవాదిగా 36 ఏళ్ల సత్యశ్రీ జూన్ 30న గుర్తింపు పొందారు. ఈ మేరకు చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సత్యశ్రీ 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు కాగా చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు.

ఎస్బీఐ ఎండీగా అరిజిత్ బసు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డెరైక్టర్‌గా అరిజిత్ బసు జూలై 2న బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కమర్షియల్ క్రెడిట్, ఐటీ తదితర విభాగాలకు ఉన్నతాధికారిగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆయన పనిచేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఎండీగా ఉన్న బి. శ్రీరామ్‌ను ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా నియమించడంతో ఆయన జూన్ 28న రాజీనామా చేశారు.

మెక్సికో అధ్యక్షుడిగా ఆమ్లో ఎన్నిక
మెక్సికో నూతన అధ్యక్షుడిగా వామపక్ష నాయకుడు ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో) జూలై 2న ఎన్నికయ్యారు. దీంతో మొక్సికో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి వామపక్ష నాయకుడిగా ఆమ్లో గుర్తింపుపొందాడు. ఈ మేరకు డిశంబర్‌లో ఆమ్లో అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. తాజాగా జరిగిన మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో ఆమ్లోకు 53 శాతం ఓట్లు వచ్చాయి.

సెయిల్ సీఎండీగా సరస్వతి ప్రసాద్
స్టీల్ ఆథారీటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా సరస్వతి ప్రసాద్ జూలై 1న అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సెయిల్ సీఎండీగా ఉన్న పీకే సింగ్ పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టీల్ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ప్రసాద్ ఉన్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్

రాజ్యసభ 13వ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ నారయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆగస్టు 9న జరిగిన ఎన్నికల్లో హరివంశ్‌కు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులు ఉండగా 226 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పి.జే కురియన్ జూన్ 30న పదవీ విరమణ పొందారు.

తెలంగాణ ఏజీగా బీఎస్ ప్రసాద్
తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌గా బండా శివానంద ప్రసాద్ (బీఎస్ ప్రసాద్)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10 ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన బీఎస్ ప్రసాద్ గత 30 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు ఆర్థిక సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. మొదట ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ)గా కొన్నేళ్లు సేవలు అందించిన బీఎస్ ప్రసాద్, తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయన 3 ఏళ్లపాటు ఏజీగా బాధ్యతలు నిర్వర్తించి 2017 జూలై 12న రాజీనామా చేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి జూలై 17న ఏజీగా నియమితులయ్యారు. 2018 మార్చి 26న ప్రకాశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

ఐరాస మానవహక్కుల చీఫ్‌గా బ్యాష్లే
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాష్లే ఎన్నికయ్యారు. ఈ మేరకు 93 సభ్య దేశాల సాధారణ అసెంబ్లీ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మానవ హక్కుల సంస్థ చీఫ్‌గా కొనసాగుతున్న జొర్డాన్ దౌత్యవేత్త జీద్ రాద్ అల్హుసేన్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హుసేన్ స్థానంలో బ్యాష్లే ఏడో హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. యూఎన్ మానవ హక్కుల సంస్థ 1993లో ఏర్పాటైంది.

జమ్మూకశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ గీత
జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత మిట్టల్ నియమితులయ్యారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్. ఎన్ వోహ్రా రాజ్‌భవన్‌లో ఆగస్టు 11న గీతా మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కశ్మీర్ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళగా గీతా మిట్టల్ నిలిచారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత వ్యవహరిస్తున్నారు.
1981
లో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన గీత మిట్టల్ 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) అనారోగ్యం కారణంగా కోల్‌కతాలో ఆగస్టు 13న కన్నుమూశారు. 2004-09 మధ్య కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఛటర్జీ పనిచేశారు. జెంటిల్మన్ కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన పదిసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
1929
జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో సోమనాథ్ ఛటర్జీ జన్మించాడు. ఆయన తండ్రి నిర్మల్ చంద్ర ఛటర్జీ లాయర్‌గా, అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేశాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో లా చదివిన ఛటర్జీ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. లాయర్‌గా పనిచేసే సమయంలో కార్మిక సంఘాలతో కలిసి పనిచేసిన ఆయన 40 ట్రేడ్ యూనియన్లకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1968లో సీపీఎం పార్టీలో చేరిన ఛటర్జీ 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం పది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఆయన ఒక్కసారి మాత్రమే (1984లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్ నుంచి పోటీచేసి మమతా బెనర్జీ చేతిలో) ఓడిపోయారు. 1989 నుంచి 2004 వరకు లోక్‌సభలో సీపీఎం నాయకుడిగా ఉన్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వంపై సీపీఎం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌గా ఉన్న చటర్జీ మద్ధతు ఇవ్వకుండా ప్రభుత్వానికి మద్ధతు తెలపడంతో సీపీఎం పార్టీ ఆయనను బహిష్కరించింది.
వివిధ పార్లమెంట్ కమిటీల్లో పనిచేసిన ఛటర్జీ 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఉండి 2004లో లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన ఏకైక వామపక్ష నేతగా ఆయన గుర్తింపు పొందారు.

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ టాండన్ కన్నుమూత
జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ దాస్ టాండన్ (90) కన్నుమూశారు. 2014 జూలై 14 నుంచి ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టాండన్ గుండెపోటు కారణంగా రాయ్‌పూర్‌లో ఆగస్టు 14న తుది శ్వాస విడిచారు.
1927
నవంబర్ 1న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన టాండన్ జన్‌సంఘ్ (1951లో స్థాపన) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. 1951-1957 మధ్య కాలంలో పంజాబ్ జన్‌సంఘ్ కార్యదర్శిగా ఉన్న టాండన్ 1995-97 మధ్య పంజాబ్ విభాగం బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1960లో మొదటిసారిగా అమృత్సర్ నుంచి ఎమ్మెల్యేగా టాండన్ ఎన్నికయ్యారు. మొత్తం అమృత్సర్ నుంచి ఐదుసార్లు, రాజ్‌పురా నుంచి ఒక్కసారి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. అలాగే పంజాబ్ డిప్యూటీ సీఎంగా, కేబినేట్ మంత్రిగా ఆయన పనిచేశారు. ఎమర్జెన్సీకాలంలో 1975-77 వరకు 19 నెలల పాటు జైలులో ఉన్నారు. టాండన్ భార్య బ్రిజ్‌పాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా పవార్
భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు పవార్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ ఆగస్టు 14న ప్రకటించింది. మహిళల జట్టు కోచ్‌గా ఉన్న తుషార్ అరోథే సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకోవడంతో జూలైలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు.

పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి రాజీనామా
అమెరికాకి చెందిన శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స తయారీ సంస్థ పెప్సీకో సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రా కృష్ణమూర్తి నూయి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు కంపెనీ నూతన సీఈవోగా డెరైక్టర్ల బోర్డు ఎంపిక చేసిన కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాకు ఆమె అక్టోబర్ 3న బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే 2019 జనవరి వరకు ఇంద్రానూయి చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు.

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కన్నుమూత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ ఉద్యమ నేత, డీఎంకే అధినేత కలైజ్ఞర్ ముత్తువేలర్ కరుణానిధి (94) కన్నుమూశారు. కొద్ది రోజులుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 7న చెన్నై ఆళ్వారుపేట్లోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎనిమిది దశాబ్దాలపాటు దేశానికి కరుణానిధి సేవలందించారు.

టెన్ ఐడియాలజీస్ పుస్తకావిష్కరణ
సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి రాసిన మొదటి పుస్తకం టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఆగస్టు 7న ఆవిష్కరించారు. 15 అధ్యాయాలున్న ఈ పుస్తకంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ వంటి విధానాలను ప్రస్తావించారు.

ఆర్బీఐ డెరైక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో డెరైక్టరుగా చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న నియమించింది. దీంతో ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో అనుబంధం ఉన్న గురుమూర్తి తమిళ పత్రిక తుగ్లక్కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ సి నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత అక్కినేని వ్యవహరించనున్నారు. బిగ్ సి కొత్త లోగో ఆవిష్కరించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆగస్టు 16న జరిగిన కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి ఈ మేరకు తెలిపారు. ప్రస్తుతం బిగ్ సి కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్టోర్లు ఉండగా తమిళనాడులో కూడా బిగ్ సి స్టోర్లను సెప్టెంబరులో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిగ్ సి లో 2,500లకు పైగా ఉద్యోగులు ఉన్నారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూత
రాజనీతిజ్ఞుడు, కవి, భారత రత్న, ఉత్తమ పార్లమేంటెరియన్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆగస్టు 16 తుదిశ్వాస విడిచారు. యమునా నది తీరంలో ఉన్న రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఆగస్టు 17 నిర్వహించనున్నారు.
1924
లో డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం అయిన కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి దంపతులకు అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించారు. వాజ్‌పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్‌గా పనిచేశాడు. అలాగే కవిగా గుర్తింపు పొందాడు. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో ప్రాథమిక విద్యనభ్యసించిన వాజ్‌పేయి గ్వాలియర్లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్ ఆంగ్లోవేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి 1939లో ఆరెస్సెస్‌లో చేరి 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా పాల్గొన్నారు. అలాగే హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్‌లలో పని చేశారు. అనంతరం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. 1957లో ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు సేవలందించిన వాజ్‌పేయి 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
1968లో జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన 1977లో జనతా పార్టీకి మద్దతివ్వడంతో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వాజ్‌పేయి బాధ్యతలు చేపట్టారు. అలాగే మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు.
1980
లో ఎల్కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్ వంటి వారితో కలసి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించిన వాజ్‌పేయి తర్వాత 1996, 1998, 1999లలో మొత్తం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన పూర్తికాలం (2004 వరకు) సమర్థపాలనను అందించారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999-2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి.
వాజ్‌పేయి జీవితంలో పద ఘట్టనలు
1924 : డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జననం
1942 : క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు
1951 : భారతీయ జన సంఘ్ (బీజేఎస్)లో చేరిక
1957 :
లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
1962 :
రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారి ఎన్నిక
1968 :
బీజేఎస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
1975 :
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో ప్రతిపక్షనేతలతో కలిసి అరెస్టయ్యారు
1977 :
జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు
1980 : బీజేఎస్ను బీజేపీగా మార్పుచేసి.. ఆ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడయ్యారు
1992 :
పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
1994 : లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
1996 :
తొలిసారి 13 రోజులపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాక,సభలో బలం నిరూపించుకోలేక వాజ్‌పేయి ప్రభుత్వ పతనం
1998 :
మేలో రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు
1999 : –
చారిత్రాత్మక ఢిల్లీలాహోర్ బస్సు సర్వీసు మొదలుపెట్టారు
కార్గిల్‌లో పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ విజయ్ నిర్వహించారు
మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు
2001 : దేశవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ప్రారంభం
2004 :
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు
2005 : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
2009 :
గుండెపోటుకు గురయ్యారు
2014 : వాజ్‌పేయి 90వ పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా నిర్వహణ
2015 :
దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం
2018 :
జూన్‌లో అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిక.

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ 22వ ప్రధానిగా పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18 ప్రమాణస్వీకారం చేశాడు. ఈ మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆ దేశ అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆగస్టు 17న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు 176 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పాకిస్థాన్ ముస్లిం లీగ్‌నవాజ్(పీఎంఎల్ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు దక్కాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుండగా ప్రధానిగా ఎన్నికయ్యేందుకు 172 మంది మద్దతు అవసరం. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన 54 మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ కన్నుమూత
ఐక్యరాజ్యసమితి(ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్(80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా స్విట్జర్లాండ్‌లో ఆగస్టు 18న అన్నన్ తుదిశ్వాస విడిచారని కోఫీ అన్నన్ ఫౌండేషన్ తెలిపింది.
ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా 1997 నుంచి 2006 వరకు రెండు పర్యాయాలు పనిచేసిన అన్నన్ ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందారు. ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి గాను 2001లో అన్నన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2012లో ఐరాసఅరబ్లీగ్ ప్రత్యేక దూతగా సిరియాకు అన్నన్ వెళ్లారు.
1938,
ఏప్రిల్ 8న ఆఫ్రికా దేశమైన ఘనాలోని కుమసి పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో కోఫీ అట్టా అన్నన్ జన్మించారు.

281 అండ్ బియాండ్ పేరుతో లక్ష్మణ్ జీవిత చరిత్ర
281 అండ్ బియాండ్ పేరుతో హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ఈ పుస్తకాన్ని నవంబర్ 20న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ఆగస్టు 20న తెలిపింది.
2001
లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్ చేసి మంచి గుర్తింపు పొందాడు. దీంతో లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తకానికి 281 అనే శీర్షిక పెట్టారు.

నో స్పిన్ పేరుతో వార్న్ జీవిత చరిత్ర
నో స్పిన్ పేరుతో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 4 విడుదల చేయనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఎబ్యురీ ప్రెస్ ఆగస్టు 20 వెల్లడించింది. నో స్పిన్ పుస్తకంలో వార్న్ తన అత్యుత్తమ క్రీడా జీవితం సహా వ్యక్తిగత జీవితంలోని ఎవరికీ తెలియని విషయాలను సొంత వ్యాఖ్యానంలో వెల్లడించనున్నాడు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments