కరంట్ అఫైర్స్ – జూలై 16, 2020

జియోలో గూగుల్ రూ. 33వేల కోట్ల పెట్టుబడులు

జియో ప్లాట్ ఫామ్స్ లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, తద్వారా జియోలో 7.7% వాటాను పొందనుందని రిలయన్స్ ఇండస్ర్టీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ జూలై15న జరిగిన రిలయన్స్ ఇండస్ర్టీస్ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్ వర్చువల్ సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు జియో ప్లాట్ ఫామ్స్ లోకి రూ. 2.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిందన్నారు. దేశంలో అత్యధిక వస్తుసేవల పన్ను చెల్లించిన రిలయన్స్ వాటాదారులకిచ్చిన హామీ ప్రకారం గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా మారిందన్నారు.

కరోస్యూర్ విడుదల

ప్రపంచంలోనే అత్యంత చౌక కరోనా టెస్ట్ కిట్ కరోస్యూర్ ను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ జూలై15న ఆవిష్కరించారు.. ఇది మేకిన్ ఇండియా దిశగా ఒక ముందడుగు అని అన్నారు. దీన్ని తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన రామగోపాలరావు సారథ్యంలో ఢిల్లీ శాస్ర్తవేత్తలు పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. కేవలం 3 గంటల్లోనే ఫలితం తేలిపోయే ఈ కిట్ ధర కూడా కేవలం రూ. 399. దీనికి RNA ఐసోలేషన్, ల్యాబ్ ఛార్జీలు కలిపినా ఒక్కో టెస్టుకు రూ. 650 మించదు. ఈ కిట్ కు భారత వైద్య మండలి(ICMR), భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (DCGI) అనుమతి లభించింది.

ADB వైస్ ప్రెసిడెంట్ గా అశోక్ లావాసా

ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా ఫిలిప్పీన్స్ కు చెందిన ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. వచ్చే నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న దివాకర్ గుప్తా స్థానాన్ని లావాసా భర్తీ చేయనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అశోక్ లావాసా పదవీ కాలం అక్టోబర్, 2022 వరకు ఉంది.

న్యుమోనియాకు భారత్ తొలి టీకా

న్యుమోనియా వ్యాధి నిరోధానికి పూర్తిగా దేశీయంగా రూపొందించిన తొలి టీకాకు DGCA( డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించింది. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టీకాను రూపొందించిందని జూలై– 15న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రత్యేక నిపుణుల బృందం మూడు దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని పరీక్షించిన అనంతరం ఈ టీకాకు మార్కెట్ అప్రూవల్ లభించిందని పేర్కొంది.

భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు

తూర్పు లద్దాఖ్ లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ జూలై15న ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ. 300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని, ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి ఆంక్షలు లేవని, కానీ మొత్తం ఖర్చు మాత్రం రూ. 300 కోట్లు దాటరాదని రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన DCA సమావేశంలో వెల్లడించింది.

వచ్చే ఏడాది జియో 5జి

వచ్చే ఏడాది దేశంలో 5జి సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని రిలయన్స్ ఇండస్ర్టీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జూలై15న జరిగిన 43వ రిలయన్స్ ఇండస్ర్టీస్ వార్షిక సమావేశంలో తెలిపారు.

జవాన్లకు బాలిస్టిక్ హెల్మెట్లు

సైనికుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా జవాన్లకు ఏకే– 47 రక్షిత హెల్మెట్లు అందజేయాలని రక్షణశాఖ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బాలిస్టిక్ హెల్మెట్ల సేకరణ కోసం దేశీయ, ప్రపంచ హెల్మెట్ తయారీ సంస్థలకు ఆర్మీ జూన్23న ప్రకటన జారీ చేసింది. మైల్డ్ స్టీల్, హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించే ఈ హెల్మెట్ ధర రూ. 50 వేలు ఉండొచ్చని అంచనా.

ఫిఫా ప్రపంచకప్ -2022

రోజుకు నాలుగు మ్యాచులు, నవంబర్-21న తొలి మ్యాచ్, డిసెంబర్– 18న ఫైనల్

2022 ఫిఫా ప్రపంచకప్ లో రోజుకు నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయని ఫిఫా నిర్వాహక కమిటీ జూలై-15న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం గ్రూపు దశలో టెలివిజన్ ల ద్వారా రోజుకు 11 గంటలకు పైగా మ్యాచ్ లను వీక్షించవచ్చన్నారు. 32 టీంలు పాల్గొనే మెగా టోర్నీలో జట్లను 8 గ్రూపులుగా విభజించడం జరిగిందని, ఖతార్ వేదికగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది.

ప్రదీప్కొత్త రకం డోపీ

HGH కు పాల్పడిన వెయిట్ లిఫ్టర్

2018 కామన్వెల్త్ గేమ్స్ లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్ లిఫ్టర్ ప్రదీప్ సింగ్ సరికొత్త డోపింగ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్( HGH) డోపింగ్ కు పాల్పడ్డాడు. HGH కేసు ప్రపంచంలో ఇంతకముందే ఉన్నా .. భారత్ లో ఇదే తొలి కేసు.

జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) పరీక్షల్లో ప్రదీప్ కరోనా లాక్ డౌన్ కు ముందే మార్చిలో పట్టుబడ్డాడు. బిశాంపిల్ ను నాడా గుర్తింపు పొందిన దోహా ల్యాబ్ కు పంపి ధ్రువీకరించిన తర్వాత.. భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ప్రదీప్ పై నాలుగేళ్ల నిషేధం విధించింది. కాగా ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్ షిప్ లో ప్రదీప్ 102 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచాడు.

HGH ఉత్ర్పేరకం అంటే….

మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే HGH ఉత్ర్పేరకంను కొన్ని రకాల మెడిసిన్ ద్వారా శరీరంలోకి ఉత్పత్తి చేస్తారు. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజిత పరిచే ఈ ఉత్ర్పేరకం ఎముక, ఇతర దెబ్బతిన్న అవయవ పెరుగుదలకు దోహదం చేయడమే కాకుండా ఎముక శక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్ కు పాల్పడింది కేవలం 15 మందే.. ఇందులో ఇద్దరు లండన్ ఒలింపిక్స్ సమయంలో దొరికిపోయారు.

గ్రీన్ రామాయణ పార్క్

దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ రామాయణ పార్కును అభివృద్ధి పరచి ఉత్తరాఖండ్ అటవీశాఖ అరుదైన ఘనతను దక్కించుకుంది. హవానీ ప్రాంతంలోని కుమావున్ లో ఈ పార్కును కేవలం 6 నెలల కాలంలో అభివృద్ధి చేశారు. వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన మొక్కలన్నింటికి ఇందులో చోటు కల్పించారు. ఇక్కడ నాటిన మొక్కల పేర్లతో పాటు వాటి జాతుల శాస్ర్తీయ నామాలు, శ్లోకాలను కూడా రాసి వుంచారు. ఈ విధమైన థీమ్ ప్రాజెక్టులలో రామాయణ పార్క్ మొదటిదని ఉత్తరాఖండ్ చీఫ్ కన్జర్వేటరీ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సంజీవ్ చతుర్వేది చెప్పారు

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments